Covid Effects on Brain : కరోనావైరస్ మహమ్మారి మెదడుపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో తెలుసా? కరోనావైరస్ సోకినవారిలో కన్నా మహమ్మారి భయాందోళనలే ఎక్కువగా మెదడుపై ప్రభావాన్ని చూపిస్తాయాంటే నిపుణులు అవకాశం లేకపోలేదని అంటున్నారు.
ఒక అధ్యయనం ప్రకారం.. కరోనా కారణంగా మెదడు మీద ప్రభావాలు ఉంటాయని తేలింది. అది కూడా ఏడుగురిలో ఒకరికి మెదడు మీద ప్రభావం చూపిస్తుందని కనుగొన్నారు. చాలామందిలో టెన్షన్, కంగారపడటం, వాసన లేకపోవడం, గుండెపోటు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉందంటున్నారు. కొన్సిసార్లు అది మరణానికి దారితీయొచ్చునని హెచ్చరిస్తున్నారు.
మెదడుకు ముప్పు ఎక్కువే :
శరీరంలోకి ప్రవేశించిన కరోనావైరస్.. మెదడులోకి చొచ్చుకుపోయే ముప్పు లేకపోలేదని పేర్కొన్నారు. రక్తం గడ్డకట్టడం కూడా కరోనా కారణం కావొచ్చునని చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో మెదడు అనారోగ్య సమస్యలు బయటపడుతున్నాయి. అందులో చాలామందికి అందరిలో కాదు.. జ్ఞాపకశక్తి కోల్పోవడం, కంటి దృష్టి కోల్పోవడం, అలసట, వాసన కోల్పోవడం, రుచి, వాసన తెలియకపోవడం, తలనొప్పి, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ముప్పు ఉంది. మెదడుకు ఎక్కువ రోజులు ఆక్సిజన్ సరిగా అందడం లేదని అంటున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే..వెంటనే వైద్యసాయం తీసుకోవడం ద్వారా ప్రాణాలు నిలబెట్టుకోవచ్చునని సూచిస్తున్నారు.
కరోనాతో మానసికపరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో చాలామందిలో వైరస్ ప్రభావంపై అనేక భయాందోళనలు నెలకొన్నాయి. అది వారిలో మానసిక ప్రభావానికి గురిచేసిందని పలు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా మెదడులోని మెమెరీ కణాలపై తీవ్ర ఒత్తిడిపడినట్టు అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు.
కొంతమందిలో మెమరీ పవర్ కోల్పోవడంతో పాటు మరికొంతమందిలో దృష్టిలోపాలు, తీవ్ర అలసటగా అనిపించడం, వాసన, రుచి కోల్పోవడం, తలనొప్పి వంటి సమస్యలు బాధిస్తుంటాయి. మానసిక ఒత్తిడికి గురైన వారిలో ఎక్కువగా రక్తప్రసరణ సరిగా ఉండదు. అప్పుడు ఆక్సిజన్ లెవల్స్ కూడా బాగా తగ్గిపోతాయి. అప్పుడు మెదడుకు అందాల్సిన రక్తం తగినంతగ సరఫరా కాకపోవడం ద్వారా జ్ఞాపకశక్తి క్షీణించడం లేదా ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కరోనా వైరస్ సోకిన వారిలోనూ అది మెదడు, నాడీ కణాలపై ప్రభావం చూపిస్తుంది.
గ్రే.. మ్యాటర్ క్షీణిస్తే :
కరోనా సోకినవారిలో మెదడులో ఉండే గ్రే మ్యాటర్ అనే బూడిద రంగు భాగం క్షీణించిపోతుందని గుర్తించారు. మెదడులో ఎక్కువగా నల్లటి భాగం ఉంటుంది. ఇది సరిగా పనిచేసినప్పుడే మన శరీర అవయవాలు అది చెప్పినట్టు వింటాయి. కదలికలతో పాటు తినడం, జ్ఞాపకశక్తి మెరుగుపడటం, ఎమోషన్స్, హవాభావాలను తెలపడం.. ఇలా ఏది చేయాలన్నా ఈ గ్రే మ్యాటర్ ఆదేశాలు ఇవ్వాల్సిందే. అప్పుడే శరీరం, మెదడులో ఉండే కణాలను బ్యాలెన్స్ చేస్తుంది. దీనికి కేంద్ర నాడీ వ్యవస్థతో కనెక్ట్ అయి ఉంటుంది.
ఈ నల్లటి గ్రే మ్యాటర్ భాగాన్ని కరోనావైరస్ తినేస్తుంది. వెంటిలేటర్ స్థితికి చేరుకునే కరోనా బాధితుల్లో మెదడు ముందు భాగంలో ఈ నల్లటి పదార్థం క్షీణించిపోతుంది. నాడీ కణాల నరాల సమస్యలతో ఇబ్బందులు పడే వందకు పైగా మందికి అమెరికా యూనివర్సిటీ సైంటిస్టులు లోతుగా అధ్యయనాలు చేశారు. ఈ అధ్యయనంలో 58 మందికి కరోనా సోకగా.. ఇతరులకు 60 మందిలో కరోనా ఆనవాళ్లు లేవని గుర్తించారు.
కరోనాతో ఆక్సిజన్ అందక వెంటిలేటర్ మీద ఉన్నవాళ్లలోనే సమస్య అధికంగా ఉందని పరిశోధకులు తేల్చేశారు. కరోనావైరస్ వైరల్ లోడ్ అధిక స్థాయిలో ఉన్నవారిలో మెదడుపై తీవ్ర ప్రభావం అధికంగా ఉంటుందని నిర్ధారించారు. ఇప్పటికే అనేక అధ్యయనాల్లో మెదడు వ్యాధులకు కరోనా ప్రభావం అధికంగానే ఉంటుందని రుజువైంది. అదే హైబీపీ సమస్యతో బాధఫడేవారు, అధిక బరువుతో బాధపడేవారిలోనూ ఈ నల్లటి భాగాన్ని కరోనావైరస్ తినేస్తుందని గుర్తించారు. కొంతమందిలో మెదడు పరిమాణం చాలా పెద్దదిగా ఉంటుంది.
మరికొంతమందిలో మెదడు పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. ప్రత్యేకించి వీరిలోనే ఈ సమస్య అధికంగా ఉంటుందని అంటున్నారు. అందుకే మానసిక ఆందోళనలు, మెంటల్ డిసీజెస్ ఎక్కువగా వస్తున్నాయని గుర్తించారు. ఈ సమస్యలతో బాధపడేవారి ఆలోచనల తీరు, ప్రవర్తన విధానం మారడంతో పాటు మానసిక సమస్యలకు దారితీస్తోందని అంటున్నారు. ఫలితంగా వీరి మూడ్ ఎప్పుడు ఎలా మారిపోతుందో చెప్పలేమంటున్నారు.
నిద్రలేమితో మానసిక సమస్యలు :
కరోనావైరస్ ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే.. కంటినిండా నిద్రపోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. కంటికి సరైన నిద్ర ఉన్నప్పుడే రిలాక్స్ అయ్యేందుకు వీలుంటుందని చెబుతున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారిలో మానసిక రుగ్మతల స్థాయి కూడా అధికంగానే ఉంటోందని చెబుతున్నారు. నిద్ర ఎంతసేపు పోయామనేది కాదు.. కంటినిండా నిద్ర ఎంతసేపు పోయారనేది ముఖ్యమని అంటున్నారు. కళ్లు ముసుకుంటే నిద్ర పోయినట్టు కాదు.. నిద్రపోతే శరీరం ఆటోమాటిక్ గా రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోతుంది.
రాత్రిసమయాల్లోనే నిద్రించేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. పగటి నిద్రతో ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. రోజులో కనీసంగా రాత్రి సమయాల్లో 8 గంటల నుంచి ఆపై నిద్రపోతే మంచిది. మంచినిద్రతో మెదడు ఆరోగ్యంగా మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. మెదడు చురుకుగా పనిచేస్తేనే ఆ రోజుంతా యాక్టివ్ గా ఉండగలరు. ముఖ్యంగా ఒత్తిడిని అదుపు చేయడం చేయాలి. దాంతో షుగర్, బీపీలు కూడా వాటంతటవే అదుపులోకి వచ్చేస్తాయని చెబుతున్నారు.
ప్రతిరోజూ వ్యాయామం చేస్తుండాలి. రూబిక్ క్యూబ్ వంటి పజిల్స్ పూర్తి చేస్తుండాలి. ప్రొటీన్లు ఉండే పదార్థాలను అధికంగా తీసుకోవాలి. పచ్చి కూరగాయలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకుంటుండాల. ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకోవడం చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు. కరోనావైరస్ మహమ్మారి సంక్రమించిన చాలామందిలో 15శాతం వరకు మెదడు వాపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు.
కరోనా వ్యాప్తితో నిద్రలేమి, మెదడువాపు సమస్యలు, బ్రెయిన్ స్టోక్, రుచి తెలియకపోవడం, వాసన తెలియకపోవడం, కీళ్ల నొప్పులు, నాడీ కణాలు దెబ్బతినడం, మూర్ఛ కోల్పోవడం, గందరగోళం, ఒక్కసారిగా ప్రవర్తనలో మార్పులు రావడం, మూడ్ మారిపోవడం వంటి అనేక లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ సమస్యల ఆధారంగా కరోనావైరస్ ప్రభావం మెదడుపై ఎంత స్థాయిలో ఉంటుందో నిర్ధారించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.
కరోనావైరస్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించలేమనే విషయం గుర్తించుకోవాలి. కరోనా వ్యాప్తిని మాత్రమే కంట్రోల్ చేయగలమనేది తెలుసుకోవాలి. మెదడుపై కరోనా ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. అందుకు తగినట్టుగా మనస్సును ఇతర పనులపై మరలించాలి. అప్పుడే కరోనా ప్రభావాన్ని మెదడుపై పడకుండా కాపాడుకోవచ్చు. ఇలా చేస్తుండటం ద్వారా క్రమంగా కరోనా తీవ్రతను తగ్గించుకోనే అవకాశం ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు.