Pearl Garlic Health Benefits : వంటింట్లో లభించే వెల్లుల్లిలో ఎన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే.. అందరికి తెలిసిన వెల్లుల్లిలానే మరొకటి ఉంది.. అదే కాశ్మరీ గార్లిక్ (Kashmiri Garlic Benefits) గురించి తెలుసా? కొంతమందికి మాత్రమే ఈ కశ్మరీ వెల్లుల్లి గురించి తెలిసి ఉంటుంది.. సాధారణంగా హిమాలయ పర్వతాల్లో ఎక్కువగా ఈ కశ్మరీ గార్లిక్ పండుతుంది. ఇప్పుడు ఈ కశ్మరీ గార్లిక్ హైదరాబాద్ ఎగ్జిబిషన్‌లో లభ్యమవుతోంది.
‘కాశ్మీరీ లెహ్‌సున్’గా పేరొందిన ‘పెర్ల్ గార్లిక్’ చాలా కొత్తగా ఉంటుంది. అంతేకాదు.. ఈ వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన వంటింట్లో దొరికే వెల్లుల్లిలా కాదు.. ఈ పెర్ల్ వెల్లుల్లిని పచ్చిగానే కరకరమని తినొచ్చు. ఇందులో ఘాటైన వాసన అసలే ఉండదట.. ఉదయాన్నే పరిగడపున తినడం ద్వారా గుండె జబ్బులు, హైపర్‌టెన్షన్, డయాబెటిస్, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి ఎలాంటి అనారోగ్య సమస్యలైన పరారు కావాల్సిందే..
Pearl Garlic Health Benefits : పెర్ల్ గార్లిక్ ఆరోగ్య ప్రయోజనాలివే..
పెర్ల్ వెల్లుల్లిగా పిలిచే ఈ వెల్లుల్లి అన్ని చోట్ల పండదు.. ఎక్కువ చల్లని ప్రాంతాల్లో మాత్రమే బాగా పెరుగుతుంది. కాశ్మీర్ వంటి పర్వత ప్రాంతాల్లో చాలా బాగా పండుతుంది. ఈ రకం వెల్లుల్లిని పండించే కాశ్మీరీ రైతులు ప్రతి ఏడాదిలో హైదరాబాద్‌లో జరిగే ఎగ్జిబ్యూషన్‌లో ఉంచుతున్నారు. నుమాయిష్ జరిగే రోజుల్లో సుగంధ ద్రవ్యాలు, కాయలు, ఔషధ మూలికలతో పాటు ఈ పెర్ల్ గార్లిక్ కూడా అమ్మకానికి ఉంచుతారు. ప్రతి ఏడాదిలో రెండు క్వింటాళ్ల పెర్ల్ గార్లిక్‌ను విక్రయిస్తున్నామని నుమాయిష్‌లో కాశ్మీరీ వ్యాపారి వసీమ్ పేర్కొన్నారు. 20 ఏళ్లుగా పెర్ల్ గార్లిక్ విక్రయిస్తున్నామన్నారు. ఈ పెర్ల్ వెల్లుల్లిలో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని జనాలు ఎక్కువగా కొనేస్తున్నారని చెప్పారు. పెర్ల్ గార్లిక్ ఆరోగ్య ప్రయోజనాలు తెలిసిన జనం కిలోలు కిలోలుగా కొనుగోలుచేసి ఇళ్లకు పట్టుకెళ్తున్నారని వసీమ్ చెప్పుకొచ్చారు.

పెర్ల్ వెల్లుల్లి చూడటటానికి తెల్లగా గుండ్రని ఆకారంలో ఉంటాయి. సాధారణ వెల్లుల్లిలా కాకుండా వీటికి ఒకే రెబ్బ ఉంటుంది. పెర్ల్ వెల్లుల్లి చాలా చిన్నగా ఉంటుంది. అంతేకాదు.. ఈ వెల్లుల్లిని తింటే తీపి, వగరు కలిసి ఉంటాయి. ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. కడుపులో గ్యాస్ట్రిక్ మంటను కూడా నివారించగలదు. ఎలాంటి వైరస్‌లు, బ్యాక్టీరియాతోనైనా పోరాడగల పోషకాలు ఇందులో ఉన్నాయి. పెర్ల్ వెల్లుల్లి తినడం ద్వారా కొలెస్ట్రాల్ తో పాటు రక్తపోటు తగ్గించగలదు. గుండెసంబంధ వ్యాధులను కూడా నయం చేయగలదని ఇప్పటికే అనేక అధ్యయనాల్లో తేలింది. పెర్ల్ వెల్లుల్లిని ఆన్ లైన్‌లో కూడా కొనుగోలు చేయొచ్చు. కిలో ధర దాదాపు రూ. 3,500 నుంచి అందుబాటులో ఉంది. ధర ప్రారంభం అవుతుంది.