Mulla Thota Kura : నేచర్ మనకు అందించిన గొప్ప వర్గాల్లో మొక్కలు సైతం ఉన్నాయి. వాటిల్లో కొన్నింటిని మాత్రమే మనం వినియోగించుకుంటున్నాం. మరి కొన్నింటిని పిచ్చి మొక్కలుగా భావించి వాటిని దూరంగా పెడుతున్నాం. కానీ అలాంటి వాటిల్లో చాలా ఔషద గుణాలున్నాయి. వాటిల్లో మెయిన్‌గా ఊర్లలో చేను గట్లపై పలు రకాల మొక్కలు పెరుగుతుంటాయి. మనం కలుపు మొక్కలు అనుకుని వాటిని తీసి పారేస్తుంటాం.
అలాంటి వాటిల్లో ముళ్లతోటకూర మొక్క సైతం ఒకటి. వరి పొలాల వద్ద ఇది కలుపు మొక్కగా పెరగుతుంది. దీని కొమ్మలకు చివర్లో చిన్నని ముళ్లు ఉంటాయి. ఇది తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ కలర్స్‌లో ఉంటుంది. దీనిని ఆఫ్రికాలో ఆహారం పంటగా పండిస్తుంటారు. మరి దీని యూజెస్ ఎంటో తెలుసుకుందాం.

ఈ మొక్కల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే వీటిని ఆఫికాలో ఆహారంలో భాగంగా తీసుకుంటారు. స్ట్రీలను ఎక్కువగా ఎర్ర బట్ట వ్యాధి ఇబ్బంది పెడుతుంటుంది. దీనిని నివారించేందుకు ముందుగా బియ్యంను కడిగిని నీటిని తీసుకుని అందులో ఈ ఆకుల వేర్లకు సంబంధించిన పొడిని, కొంచెం తేనెను, బెల్లంను కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది.
తేలు, పాము వంటివి కాటు వేసినప్పుడు ఆ విషయం మన బాడీలోకి ఎక్కకుండా ఈ మొక్కులు ఔషధంగా పనిచేస్తాయి. తేలు, పాము కాటు వేసినప్పుడు ఆ మొక్కల రసం తాగాలి. దీని వల్ల ఆ విషయం మన శరీరమంతా పాకదు. మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్నవారు ఈ మొక్క వేర్లను ఎండబెట్టి, దంచి పొడి చేయాలి. ఆ పొడిని కొంచెం తీసుకుని గోరు వెచ్చని నీటిలో కలిపి భోజనానికి అరగంట ముందు తాగాలి. ఇలా చేస్తే రాళ్లు కరిగిపోతాయి.
Read Also : Kamanchi Plant : కాలేయ సమస్యలకు ఈ మొక్కతో చెక్.. మీ ఊళ్లో కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చిపెట్టుకోండి..!