Ipomoea Carnea : అచ్చం గులాబీలానే ఉంటుంది.. గులాబీ పూల మాదిరిగానే కనిపిస్తుంది. ఈ మొక్కను రబ్బర్ మొక్కగా పిలుస్తారు.. లొట్ట పీసులా ఉండే ఈ మొక్కలో ఎన్ని ఔషధ గుణాలో తెలుసా? ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు.
ఈ రకం మొక్కలలో విష పదార్థం ఉండటంతో పశువులు తినవు. కానీ ఈ మొక్కల్లో పాలు అధిక స్థాయిలో ఉంటాయి. ఎక్కువగా జలాశయాల్లో కనిపిస్తుంటాయి. లోట పీసు మొక్క లేదా రబ్బరు మొక్క లేదా పాల సముద్రపు మొక్కగా పిలిచే ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయట.. ఈ మొక్కలో పాలతో తేలు విషానికి విరుగుడుగా అద్భుతంగా పనిచేస్తాయట.
తామర వ్యాధితో బాధపడేవారికి ఈ పాలను రాస్తే తొందరగా తగ్గిపోతుందట.. అలాగే పంటల దిగుబడిని దెబ్బతీసే దోమల నివారణకు కూడా పంటపోలాల్లో ఈ మొక్కలను పెంచుతారట.. కాగితం తయారీలో ఎక్కువగా వాడుతుంటారు. మొక్క ఆకులతో రసాన్ని తయారుచేసి.. పంటలపై పిచికారీ చేస్తుంటారు.
ఎలా తయారుచేయాలంటే..
10 కిలోల లొట్ట పీసు ఆకులను తీసుకోండి.
మెత్తగా దంచి ఒక పాత్రలో వేయండి,
– 10 కిలోల గోమూత్రం రెండు కిలోల ఆవు పేడ వేయండి.
– ఏడు కిలోలు వరకు కలిపి బాగా మరిగించాలి. – 2 స్పూన్ల డిటర్జెంట్ పొడి కలిపాలి.
– ద్రావణాన్ని చల్లార్చిన తర్వాత వడకట్టాలి.
– ఈ మొక్క ద్రావణాన్ని వంద లీటర్ల నీటిలో బాగా కలిపి పంటలపై పిచికారి చేయాలి
– రెండు రోజులు మాత్రమే ఈ ద్రావణం నిల్వ ఉంటుంది.
– తయారుచేసిన రెండు రోజుల్లోనే వరి పొలంలో పిచికారి చేయాలి.
– దోమలు ఎక్కువగా ఉండే మొక్కల మొదళ్లలోనే చేయాలి.
– వరి పొలంలో దోమల నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది.
గులాబి మొక్కల్లో అనేక రకాలు ఉంటాయి. అలాగే ఈ మొక్క కూడా చూసేందుకు గులాబి మొక్క మాదిరిగానే కనిపిస్తుంది. కానీ, ఇందులో అనేక అరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, విష పదార్థంతో కూడి ఉండటంతో తినడానికి పనికిరాదు. కానీ, ఔషధపరంగా ఈ మొక్కలోని పాలను వాడొచ్చు. దోమల నివారణలో లోట్టపీసు మొక్కకు మించిది లేదనే చెప్పాలి.
పశువులు కూడా ఈ మొక్కను ముట్టుకోవు. తామర వ్యాధితో బాధపడేవారికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. పంటలకు నష్టం వాటిల్లకుండా ఈ మొక్క రసంతో చేసిన ద్రావణాన్ని పిచికారి చేయాలి. అప్పుడు మీ పంటకు మంచి దిగుబడిని ఇస్తుంది. దోమల బెడదను నివారిస్తుంది. ఈ మిశ్రమాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచలేము. అవసరమైనప్పుడు మాత్రమే ఈ ద్రావణాన్ని తయారుచేసుకుని వాడుకోవాలి.
దోమల బెడదకు పరిష్కారం :
సాధారణంగా వరిపోలాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. చీడపురుగులు మాత్రమే కాదు.. ఈ పంటనాశనానికి దోమలు కూడా కారణమే అవుతాయి. దోమకాటు కారణంగా పంటలు తీవ్రంగా నష్టపోతాయి. అందుకే క్రిమిసంహరణిలా ఈ రబ్బరు మొక్కతో తయారుచేసిన మిశ్రమాన్ని పిచికారి చేసుకోవాలి. ఈ మిశ్రమం మొక్కల మొదళ్లలోకి వెళ్లేలా పిచికారి చేయాలి. అప్పుడే లోపల దాగిన దోమలు వెంటనే చనిపోతాయి.
ఈ మొక్కను పాల మొక్క అని కూా పిలుస్తారు. ఎందుకంటే ఇది ఎక్కువగా జలశయాాల్లోనే కనిపిస్తుంది. అలాగే లోట పీసు మొక్క మాదిరిగా జిగురు జిగురుగా ఉండి పాలు కారుతుంటాయి. మొక్కను తుంచగానే అందులో నుంచి పాలు బయటకు వస్తాయి. దాని పూలు కూడా గులాబి పూల మాదిరిా ఉండటంతో సులభంగా గుర్తుపట్టొచ్చు.
పాలు కారే చెట్లలో ఇదొకటి :
లొట్ట పీసుగా పిలిచే ఈ మొక్కలో అధిక మోతాదులో పాలు వస్తుంటాయి. తేలు వంటి విషపూరితమైన వాటికి మంచి విరుగుడులా అద్భుతంగా పనిచేస్తుంది. చర్మంపై ఏర్పడే తామర వంటి సమస్యలకు ఈ పాలు రాస్తే వెంటనే మానిపోతుంది. పంటల్లో మాత్రమే కాదు..ఇంట్లో కుట్టే దోమల నివారణకు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. మీరు మీ ఇంట్లో ఈ మొక్కతో పొగ వేసి నివారించుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో ఇళ్ల చుట్టూ ఎక్కువగా ఈ లొట్ట పీసు మొక్కలను పెంచుతుంటారు. ఇంతకీ ఈ మొక్క సైంటిఫిక్ శాస్త్రీయ నామం ఏంటో తెలుసా? ఐఫోమియా కార్నియా (ipomoea carnea)గా పిలుస్తారు.
నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మొక్క పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఊరి బయట నీటి మడుగు ఉన్న ప్రాంతాల్లో ఈ మొక్క అధికంగా కనిపిస్తుంది. గులాబీ రంగులో పూలు తెలుపు వర్ణంలో కనిపిస్తాయి. లోటపీచు మొక్కలుగా పిలిచే వీటిని ఇతర పిచ్చి మొక్కలతో కలిసి పెరుగుతుంది. సాధారణంగా పూలను బట్టి రబ్బరు మొక్కలుగా గుర్తు పట్టొచ్చు. పొలాల్లో కూడా ఎక్కువగా చెట్ల గట్ల దగ్గర పెరుగుతుంటాయి.
6 నుంచి 9 అంగుళాలు పెరుగుతుంది :
ఈ రబ్బరు మొక్క ఆకులతో దాదాపు ఆరు నుంచి తొమ్మిది అంగుళాల వరకు పొడవు పెరుగుతాయి. చూడటానికి అందగా అచ్చం గుండె ఆకారంలో కనిపిస్తాయి. ఈ మొక్కలు విషపూరితమైనవి కావడంతో జంతువులు తినడానికి పనికిరావు. ఈ మొక్క విత్తనాల్లో విషంతో నిండి ఉంటాయి. సెలినీయం జాతికి చెందిన విత్తనాలకు సంబంధించిన లొట్టపీసు మొక్కగా చెబుతుంటారు. ఈ రబ్బరు మొక్కలు చూడటానికి (బైఆక్యులేషన్) సలేనీయం స్పిసియస్ వంటి ఆకులతో పాటు విత్తనాల మాదిరిగా కనిపిస్తుంటాయి.
ఈ ఇపొమియా కార్నియా రబ్బరు లొట్టపీసు మొక్కకు మరో పేరు కూడా ఉంది. అదే.. బష్ మార్నింగ్ గ్లోరిగా పిలుస్తారు. అన్ని ప్రాంతాల్లోనూ అక్కడి ఉష్ణోగ్రత పరిస్థితులకు అనుగుణంగా పెరుగుతుంటుంది. ఈ మొక్క కాండం లొట్టపీచు మాదిరిగా సాగిపోతుంటుంది. అందుకే ఈ కాండాన్ని ఎండబెట్టి కాగితం తయారుచేసేందుకు వాడుతుంటారు. అంతేకాదు.. బోలు పొగాకులతో చుట్టలు చుట్టేందుకు కూడా ఈ మొక్క పీచులను వినియోగిస్తుంటారు.
ఈ రకం మొక్కను మీ ఊళ్లో ఎక్కడైనా కనిపిస్తే.. సులభంగా గుర్తుపట్టొచ్చు. దోమల బెడదను నివారించడంతో పాటు పంట పోలాల్లో దోమల బెడదను కూడా తొందరగా నివారించగల గుణాలు అధికంగా ఉన్నాయనడంలో సందేహం అక్కర్లేదు. గ్రామ శివారు ప్రాంతాల్లో ఈ మొక్క కనిపిస్తే వదిలిపెట్టకండి.. ఔషధ గుణాలు కలిగిన మొక్కలతో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. అందులో ఏ మొక్క అయినా ప్రకృతిపరంగా ఏదో ఒక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఏదో ఒక వ్యాధికి సమస్యకు పరిష్కారం చూపించేలా ఉంటాయి అనేది ఆయుర్వేదం చెబుతోంది.
తెల్ల గులాబీ మొక్క మాదిరిగా ఉండే ‘ఐఫోమియా కార్నియా’ మొక్కను అసలు ఆరోగ్యానికి మంచిదేనా? ఇందులో నిజంగా ఔషధ గుణాలు ఉన్నాయా? పశువులకు ఈ మొక్కను ఆహారంగా పెట్టరాదు. ఈ మొక్క ఆకులు విషపూరితమైతే.. ఔషధ మొక్కగా ఎలా పరిగణిస్తారనే సందేహం రాకమానదు. ఎందుకంటే.. ప్రకృతిలో లభించే పలు మొక్కల్లో ఔషధ గుణాలు తప్పనిసరిగా ఉంటాయి. ఒక్కో మొక్క ఒక్కో ఔషధ గుణాలను కలిగి ఉంటుందనేది అందరికి తెలిసిందే.
అయితే ఈ మొక్కలో ఔషధ గుణాలను పొందాలంటే నేరుగా సేవించేది కాదు.. కేవలం చర్మ వ్యాధులకు మాత్రమే ఉపయోగపడుతుంది. అలాగే దోమల బెడద సమస్యల నివారణకు మందులా పిచికారీ చేసుకోవచ్చు. నోటి ద్వారా ఈ ఔషధాన్ని తీసుకోకూడదని గుర్తించుకోవాలి. మొక్కలోని పాలు ద్వారా చర్మ సంబంధిత సమస్యలకు నివారిణిగా పనిచేస్తుంది. ఈ ఔషధ మొక్కను వాడేందుకు ఇందులోని ప్రయోజనాల గురించి అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో లేదో తెలుసుకుని వాడుకోవడం మంచిది.
Read Also : Oral Diabetes : నోటిలో ఇలాంటి లక్షణాలు ఉంటే.. డయాబెటిస్ వచ్చినట్టేనా?