Girls Notice Boys : సాధారణంగా యువకులు..అమ్మాయిలు తమను చూడాలని అనుకుంటుంటారు. ఈ క్రమంలోనే అమ్మాయిలకు నచ్చే విధంగా రెడీ అవుతుంటారు. అయితే, ఆడవాళ్లు మగవారిలో గమనించే విషయాలేంటో వారికి తెలియక బాహ్య అందానికే ప్రయారిటీ ఇస్తుంటారు. కానీ సైకాలజీ ప్రకారం ఆడవాళ్లు వేటిని ఇష్టపడుతారో తెలుసుకుని అలా రెడీ అయితే ఆటోమేటిక్‌గా ఆడవాళ్లు మగవారికి అట్రాక్ట్ అవుతారట. అమ్మాయిలకు నచ్చే ఆ విషయాలేంటో ఇవాళ తెలుసుకుందాం.
వ్యక్తిత్వం అనగానే చాలా మంది మగవాళ్లు తమ శారీరక దృఢత్వం అనుకుంటారు. కానీ దానితో పాటు మానసిక స్థిరత్వం కూడా చాలా ముఖ్యం. సరైన ఎత్తు, వెయిట్ ఉంటే చాలు ఆడవాళ్లు అట్రాక్ట్ అవుతారనుకోవడం పొరపాటే. బాడీ ఫిట్‌గా ఉండటంతో పాటు మైండ్ యాక్టివ్‌నెస్ చాలా ఇంపార్టెంట్. అయితే, వ్యక్తిగత లక్షణాలు అనేవి ఒక్కరోజులో వచ్చేవి కాదు. అవి వారు అలవర్చుకునే పద్ధతులను బట్టి ఇంప్రూవ్ అవుతుంటాయి. ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్‌నెస్‌తో పాటు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించేవారికి ఆడవారి మద్దతు తప్పకుండా ఉంటుందట. దీంతో పాటు హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ మెథడ్ స్టైలిష్‌గా ఉంటే సాధారణంగానే ఆకర్షితులవుతుంటారు.
కాని వీటన్నిటితో పాటు చిరునవ్వు అనేది చాలా ముఖ్యమని గ్రహించాలి. ముఖంలో చిరునవ్వు ఉంటే ఆడవాళ్లు మగవారిని ఎక్కువగా గమనిస్తారు. నవ్వడంతో పాటు నవ్వించే సామర్థ్యం కలిగిన వారిని ఇంకా ఎక్కువగా ఆడవారు ఇష్టపడుతారని తేలింది. ఇకపోతే శారీరక దృఢత్వం అనగా జిమ్‌కు వెళ్లి సిక్స్ ప్యాక్, యైట్ ప్యాక్ చేసే వారిని అమ్మాయిలు ఇష్టపడుతారని అనుకుంటారు.
అది నిజమే కాని కొందరు అమ్మాయిలు సిక్స్ ప్యాక్ చేసేవారిని అస్సలు ఇష్టపడరట. ఆత్మ విశ్వాసం మెండుగా ఉన్న వారు జీవితంలో తప్పక రాణిస్తారని పెద్దలు చెప్తుంటారు. అలా ఆత్మ విశ్వాసం మెండుగా ఉన్నటువంటి మగవారిని ఆడవారు బాగా లైక్ చేస్తారు. అమ్మాయిలు మగవారిని కలిసిన నిమిషాల్లోనే వారిలోని ఆత్మవిశ్వాసాన్ని ఇట్టే అంచనా వేయగలరని కొందరు నిపుణులు అంటున్నారు. ఇకపోతే మగవారి అలవాట్లు, అభిరుచులను బట్టి కూడా ఆడవారు వారిని ఇష్టపడుతుంటారు.
అబ్బాయిలు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ తమను నవ్విస్తూ కేర్ తీసుకోవాలని భావిస్తుంటారు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన అబ్బాయిలు తారసపడినప్పుడు వారి నుంచి ఎక్కువగా కేర్ గా తీసుకోవాలని ఆశిస్తారు. అలాంటి వారినే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. చూడగానికి హ్యాండ్ సమ్ గా ఉండటమే కాదు.. మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అబ్బాయితో పరిచయం ఏర్పడినప్పుడే వారిని లోతుగా గమనిస్తారు. వారు ఎలాంటి వారో కూడా పసిగట్టేస్తారు. భౌతికంగానే కాదు.. మానసికంగా కూడా వారిని గమనిస్తారు.
తమను ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండేలా తన పట్ల ఎక్కువగా కేర్ తీసుకోవాలని భావిస్తారు. అలా ఉండేవాళ్లంటే అమితంగా ఇష్టపడతారు. ఎత్తు, ఫిట్ గా ఉండే మగాళ్లంటే ఆడవాళ్లు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. కళ్లల్లో కళ్లు పెట్టి సూటిగా నిజాయితీగా మాట్లాడేవాళ్లంటే అమ్మాయిలు ఎక్కువగా ఆకర్షితులవుతారు. కండలు పెంచేసిన వాళ్ల కంటే మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండేవారే అమ్మాయిలకు బాగా నచ్చుతారు.
Read Also : Marriage Problems : ఈ ప్రవర్తన కలిగిన వారిని పెళ్లి చేసుకుంటే అతి త్వరలోనే విడిపోతారట.. జర జాగ్రత్త!