Bermuda Grass Benefits : గరికగడ్డిని చాలా మంది లైట్ తీసుకుంటారు. గరిక గడ్డితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఇకపై గరిక గడ్డి కోసం ఎక్కడ దొరకుతుందా?అని పరుగులు పెట్టకుండా ఉండలేరు.. ఈ గడ్డి బయట ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుంది. ఇందులో చాలా ఔషధ గుణాలు ఉంటాయట. మన చుట్టూ, కళ్లముందే పెరుగుతున్నా చాలా మంది దీనిని గుర్తించలేరు. పిచ్చిగడ్డి అని వదిలేస్తుంటారు. పశువులు ఇష్టంగా తినేవాటిలో గరికగడ్డి కూడా ఉంటుంది. దీంతో ఏయే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
గరిక గడ్డిని మిశ్రమంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని మెత్తగా నూరి నెయ్యి కలిపిన మిశ్రమాన్ని చర్మంపై రాసుకుంటే చర్మంపై ఏర్పడే పొక్కులు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా ఈ మిశ్రమాన్ని గాయాలు, పుండ్లపై రాసుకుంటే త్వరగా తగ్గుతాయి. గరిక గడ్డిని పసుపుతో కలిపి ముద్దగా చేసుకుని దానిని రాసుకుంటే దద్దుర్లు, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. గరిక వేళ్ల కషాయాన్ని 30 ఎంఎల్ మోతాదులో ప్రతీరోజు తీసుకుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. అదేవిధంగా గరిక వేర్లను దంచి రెండు టీస్పూన్ల ముద్దను ఒక కప్పు పెరుగులో కలిపి తీసుకుంటే మహిళల్లో వచ్చే వైట్ డిశ్చార్జి సమస్యను నివారిస్తుంది.
మూత్రంలో రక్తం పడుతున్న వారు గరిక గడ్డి రసాన్ని ఒకటి లేదా రెండు టీస్పూన్లు తీసుకోవాలి. లేదా దాని వేరు కషాయం 30 ఎంఎల్ మోతాదులో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది గరికను మెత్తగా నూరి ముద్దగా చేసి అర్శమొలలు ఉన్న దగ్గర రాస్తే తగ్గిపోతాయి. పిడికెడు గరిక, 2 చెంచాల జీలకర్ర, ఒక టీస్పూన్ మిరియాలను రెండు గ్లాసుల నీటిలో వేసి సన్నని సెగపై మరిగించుకోవాలి.
మంటపై మరిగించాలి. దానిని అలా అరగ్లాస్ కషాయం మిగిలేంత వరకు మరిగించి ప్రతిరోజూ ఉదయం పరిగడుపున 4-5 రోజుల పాటు తీసుకుంటే జ్వరం, ఫ్లూ తగ్గుతాయి. ఈ కషాయం వలన మూత్రపిండాల్లో రాళ్లు కూడా కరిగిపోతాయి. గరిక ఆకులను ఎండబెట్టి చూర్ణం చేసి నిల్వ చేసుకుని ఒక చెంచాను అరకప్పు నీళ్లతో కలిపి తీసుకోవాలి. దీంతో జీర్ణాశయంలో ఉండే అల్సర్లు తగ్గుతాయి.
అల్సర్లతో బాధపడేవారికి ఆయుర్వేదంలో చక్కని పరిష్కారాలు ఎన్నో ఉన్నాయి. మనకు లభించే అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, గడ్డి, పూలు వంటివి ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వీటి ప్రాముఖ్యత తెలియక చాలామంది వాటిని పెద్దగా వినియోగించకోవడం లేదు. ఒక నోటి అల్సర్లు మాత్రమే కాదు.. కడుపులోని అల్సర్లు ఇలా ప్రతి అనారోగ్య సమస్యను నివారించే అద్భుతమైన పోషక విలువలు కలిగిన ఔషధ మొక్కలు ఉన్నాయి.
అందులో గరిక నార ఒకటి.. ఈ నార చూడటానికి సన్నగా గడ్డిపోచ మాదిరిగా కనిపిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఆరోగ్యపరంగానే కాదు.. పూజ విధానాల్లోనూ గరిక గడ్డికి ప్రత్యేేక స్థానం ఉంది. అందులోనూ వినాయకుడికి గరికతో పూజించడం ద్వారా అనేక సత్పలితాలను పొందవచ్చు. గణేశుడిని అనుగ్రహాన్ని పొందవచ్చు.
Read Also : Knee Pains Tips : 7 రోజులు ఇలా చేస్తే చాలు.. కీళ్ల నొప్పులు, బాడీ పెయిన్స్, కాల్షియం లోపానికి చెక్