Lakshmi Kataksham : శ్రీ మహాలక్ష్మి దేవికి ప్రీతిపాత్రమైన రోజు శుక్రవారం.. లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, సిరి సంపదలు కలగాలన్నా ఇంట్లో అనేక కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ప్రత్యేకించి శుక్రవారం రోజున గడపకు పసుపు రాసి, కుంకుమ బొట్లను అలంకరించి గడప పూజ చేసుకోవాలి. అయితే, గడప పూజ చేసిన తర్వాత గడప మీద కాలు పెట్టరాదు. తెలియక నడిచేటప్పుడు గడప మీద కాలు పెడుతూ ఉంటారు. అలా చేస్తే.. సంపద క్రమక్రమంగా తగ్గిపోతుంది. అలాగే, ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు కూడా విడవరాదు. మీ ఇంటి సింహద్వారానికి ఎదురుగా చెప్పులు విడిచినట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది.
అలాగే, బీరువా సర్దుకునేటప్పుడు మాసిపోయిన వస్త్రాలు బీరువాలో పెట్టరాదు. మాసిన వస్త్రాలు, బీరువాలో సర్దుకుంటే కూడా సంపదలు అనేవి క్రమక్రమంగా తగ్గిపోతాయి అలాగే, తడికాళ్లతో నిద్రించరాదు, గురువులను దూషించరాదు. ఎవరైనా యాచకుడు ఇంటిదగ్గరకు వచ్చినప్పుడు లేదు పొమ్మన రాదు. ఎంతో కొంత వాళ్లకు ఇవ్వాలి. అప్పుడే మీ సంపద క్రమక్రమంగా పెరుగుతుంది. ఈ నియమాలను ప్రతిఒక్కరూ తప్పకుండా పాటించాలి. అలాగే, స్త్రీలు ఇంట్లో ఎప్పుడూ కూడా మట్టి గాజులు ధరించి ఉండాలి. అప్పుడే, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
అలాగే, లక్ష్మీ కటాక్షం కలగాలంటే.. లవంగాలకు సంబంధించిన కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలు పాటించాలని పరిహార శాస్త్రం చెబుతోంది. నవగ్రహాలలో శుక్రుడికి ప్రియమైనవి లవంగాలుగా చెబుతారు. శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు.. అందుకని లవంగాలకు సంబంధించిన పరిహారాలు పాటిస్తే.. శుక్రుడి బలం పెరుగుతుంది. దాంతో లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రులు కావచ్చు. అందుకే.. అమావాస్య రోజున రాత్రిపూట 11 లవంగాలు లేదా 21 లవంగాలు కాల్చండి. ఆ పొగ ఇంట్లో వ్యాపిస్తే ఇంట్లో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి. తద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు 2 లవంగాలు నోట్లో వేసుకొని నములుకుంటూ వెళ్ళండి. శుక్రుడి బలం వల్ల ఆ పనిలో ధన లాభం కలుగుతుంది. అలాగే, 2 లవంగాలు మీ జేబులో ఉంచుకొని పని మీద వెళ్లండి. శుక్రుడి బలం వల్ల ఆ పని సులభంగా పూర్తవుతుంది.
అలాగే, ఎప్పుడైనా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆవనూనెతో దీపం పెట్టి 2 లవంగాల దీపంలో వేయండి. ఆంజనేయుడు విశేషమైన అనుగ్రహం ఇంకా పెరిగి మానసిక ధైర్యం కలుగుతుంది. శత్రుబాధలు తొలగిపోతాయి. నరదృష్టి నుంచి బయటపడవచ్చు. శుక్రవారం పూట లక్ష్మీ పూజ చేసేటప్పుడు కూడా లవంగాలకు సంబంధించిన ఒక చిన్న విధివిధానం పాటించాలి. ఆ విధివిధానమేంటంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించేటప్పుడు ఒక గులాబీ పువ్వు తీసుకొని దానిలో 2 లవంగాలు ఉంచాలి. ఆ గులాబీ లక్ష్మీదేవికి సమర్పించండి. పూజ పూర్తయిన తర్వాత ఆ లవంగాలు ప్రసాదంగా స్వీకరించండి.
Lakshmi Kataksham : ఈ నియమాలను నమ్మకంతో పాటిస్తే.. అద్భుత ఫలితాలు..
ఇలా గులాబీ పూలతో పాటు లవంగాలు ఉంచి లక్ష్మీ పూజ చేస్తే.. లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే, ఎప్పుడైనా సరే ఒక శుక్రవారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో 5 లవంగాలు, 5 గవ్వలు ఉంచి మూటగట్టి ఆ మూట లక్ష్మీ పూజలో ఉంచండి. పూజ పూర్తయిన తర్వాత ఆ మూటకి కర్పూర హారతి ఇచ్చి ధూపం వేసుకోవాలి. ఆ మూట మీ బీరువాలో దాచి పెట్టుకోండి. లవంగాలు గవ్వలు ఉన్నటువంటి మూట బీరువాలో ఉంటే అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. లవంగాల ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. తద్వారా శ్రీమహాలక్ష్మి దేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరు సులభంగా పాత్రులు కావచ్చు. శనివారం పూట లవంగాలు దానం ఇస్తే చాలా మంచిది. ఏదైనా పదార్థంలో లవంగాలు వేసి ఆ పదార్థం దానమిచ్చిన లేదా ఒక కేజీ లవంగాలను శనివారం రోజు దానం ఇచ్చిన మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి.
లవంగాలు ఎవరు దానం తీసుకోకపోతే మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివలింగం దగ్గర కొన్ని లవంగాలు ఉంచండి. ఎక్కడైనా దేవాలయం బయట శివలింగం ఉంటే.. ఆ శివలింగం దగ్గర లవంగాలను ఉంచి నమస్కారం చేసుకోవాలి. శివానుగ్రహం, మహాలక్ష్మి దేవి అనుగ్రహం రెండు కలిగి ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. శుక్రవారం లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక 2 శక్తివంతమైన మంత్రాలు జపించుకోవాలి. ఇంటి యజమాని 21 సార్లు చదువుకుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆ మంత్రాలు చదువుకోవటంతో పాటుగా లవంగాల పరిహారాలు పాటించాలి. అందులో మొదటిది.. మంత్రం ‘లక్ష్మీ కమల వాసినియై స్వాహా’ ఈ మంత్రాన్ని లక్ష్మీ విమల మంత్రం అంటారు. రెండో మంత్రం.. ‘ఓం నమో ధనదాయై స్వాహా’ ఈ రెండు మంత్రాలు ఇంటి యజమాని 21 సార్లు చదువుకుంటే అనేక అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు.
Read Also : Lakshmi Devi : లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టే ముందు కనిపించే 4 సంకేతాలు ఇవే..!