Gopadma Vrata Pooja : గో పద్మ వ్రతం.. ఆషాడ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ తొలి ఏకాదశి రోజున గోపద్మ వ్రతం కూడా చేస్తారు. గో పద్మ వ్రతము అనేది చాతుర్మాస్య సమయంలో గోవులను పూజించడానికి ఏర్పాటు చేసుకున్న వ్రతంగా పిలుస్తారు. దీనిని సుమంగళీ స్త్రీలు ఆషాడ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక్ శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు. అసలు ఈ గో పద్మ వ్రతం ఏంటి? అంటే పశువుల పాకలను కొట్టాలను శుభ్రపరచి వాటిలో అందమైన ముగ్గులు వేసి అలంకరించాలి. ఈ ముగ్గులలో ఆవును దూడను గీసి వాటిని 33 పద్మాలతో నింపుతారు. ముగ్గు చుట్టూ కూడా 33 ప్రదక్షిణాలు చేస్తారు. 33 సార్లు ఆర్గమ్ ఇస్తారు. 33 రకాల స్వీట్లు దానం చేస్తారు. పశువులను పూజిస్తారు. గోవులను పూజిస్తారు. ఈ రోజుల్లో పశువుల పాక అంటే కష్టం కదా..
అలాంటి వారు ఏం చేయాలి అంటే.. ఇంట్లోనే ముగ్గు వేసి పూజ కార్యక్రమాన్ని చేస్తారు. సమస్త దేవతలు కూడా గోమాతలో కొలువై ఉంటారు. ఈ గోమాతను పూజించడం వలన సమస్త దేవతలని పూజించిన ఫలితం దక్కుతుంది. గో పద్మ వ్రతం అంత అయిపోయిన తర్వాత వ్రత కథని చదువుకోవాలి. అక్షతలు తల పైన వేసుకోవాలి. పూజలో ఏమైనా అపరాధం ఉంటే క్షమించమని కోరాలి. ఈ వ్రతాన్ని చాతుర్మాసం 4 నెలలు కూడా క్రమం తప్పకుండా పాటించాలి. ప్రతిరోజు కూడా ఇదే విధంగా చేయాలి. ఇప్పుడైనా అనివార్య పరిస్థితుల్లో ఒకటి 2 రోజులు తప్పిపోయిన కూడా ఏం పర్వాలేదు. ఆడవారికి ఆటంకం వచ్చినా రోజుల్లో చేయకపోయినా కూడా పర్వాలేదు. ఆ తర్వాత నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. వరుసగా 7 రోజులు గనుక ఆటంకం వస్తే.. ఆ వ్రతాన్ని ఆ సంవత్సరానికి రతభంగం అయింది అని భావించి ఇక వ్రతాన్ని ఆపివేయాలి.
గోపద్మవ్రత కథని ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి దేవసభలో అప్సర రంభ నాట్య ప్రదేశం చేస్తూ ఉంటారు. మనోహరంగా వాయిస్తున్న సంగీత వాద్యముల నడుమ ఆమె అద్భుత నాట్యం చేస్తుంటుంది. ఒక తబలా పగిలి అపస్వరం రావడంతో కార్యక్రమం ఆగిపోతుంది. దానికి ఇంద్రుడు నొచ్చుకుని వెంటనే యమున్ని పిలిచి భూలోకంలో వ్రతమాచరించని వారి చర్మం తెచ్చి తబలాను బాగు చేయవలసిందిగా కోరుతాడు. దానికి యముడు భూలోకంలో అటువంటివారు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకొని రమ్మని తన భటుల్ని పంపిస్తాడు. ఆ భటులు లోకమంతా తిరిగి వచ్చి యమునికి ఇలా నివేదిస్తారు. గౌరీ, సావిత్రి, అనసూయ, ద్రౌపది, అరుంధతి, సరస్వతి ఇలా అందరూ ముగ్గులు వేసి పూజిస్తున్నారు. ఒక్క శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్ర ఇంటి వద్ద మాత్రం ఎలాంటి ముగ్గు లేదు అని చెబుతారు. అప్పుడు, యముడు ఆమె చర్మాన్ని తీసుకొని వచ్చి ఆ తబలాకు బిగించవలసిందిగా ఆదేశిస్తాడు.
Gopadma Vrata Pooja : చాతుర్మాస్ పూజలో గో పద్మ వ్రత విధానం..
ఈ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణుడికి చేరవేస్తాడు. విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఉదయం నిద్ర లేచిన వెంటనే సుభద్ర దగ్గరకు వెళ్లి ఆమెను ఇంటి వద్ద ముగ్గు ఎందుకు లేదని, వ్రతాన్ని ఎందుకు ఆచరించడం లేదు అని ప్రశ్నించగా దానికి సుభద్ర నాకు సూర్యచంద్రుల వంటి ఇద్దరు సోదరులు మహావీరుడైన అర్జునుని వంటి భర్త దేవకి, వసుదేవుల వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చేయాలి అని ఎదురు ప్రశ్నిస్తుంది. దానికి శ్రీకృష్ణుడు అన్నీ ఉన్నాగాని భవిష్యత్తు కోసం వ్రతం చేయాలని ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని ఇలా వివరిస్తాడు. గద్ద, విష్ణు పాదము, శంఖము, చక్రము, గదా, పద్మము, స్వస్తిక బృందావన వేణువు, వీణ తబలా, ఆవు దూడ, 33 పద్మములు, రాముని ఊయల, సీత చీర అంచు, తులసి ఆకు, ఏనుగు, బటుడు, నదులు, చెరువులు, దేవుని చిత్రాలతో కలిపి గీయాలి అని చెబుతాడు
అప్పుడు సుభద్ర రాతిపూడిని ముత్యములు, పగడంతో కలిపి ముగ్గు వేసింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తెలిపిన విధంగా గోపద్మవ్రతాన్ని ఆచరించింది. ఈ విధంగా సుభద్ర గో పద్మ వ్రతం ఆచరించి తప్పించుకుంది. అప్పటినుంచి ఈ వ్రతం ప్రాచుర్యం పొందింది. యమ భటులు ఉత్తరానికి తలపెట్టి పడుకొని ఉన్న ఒక ఏనుగు నుంచి చర్మం సంగ్రహించి తబలా బాగు చేసుకున్నారు. అందుబాటులో లేనివారు ఇంట్లో తులసి కోట దగ్గర కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇంట్లో తులసి కోట దగ్గర గోమాత విగ్రహాన్ని కానీ, ఫోటోని కానీ ఉంచి ఈ గోపద్మ వ్రతం చేయవచ్చు. ఎలా అంటే.. ప్రతిరోజు కూడా తులసి కోట దగ్గర పసుపు కలిపిన నీటితో శుభ్రం చేసి 33 పద్మాలు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి 33 పద్మాల దగ్గర విడివిడిగా పంచదారని కానీ, చిన్న బెల్లం ముక్కను కానీ ఉంచి నివేదన చేయాలి. ఇప్పుడు మీరు విన్న వ్రత కథను చెప్పుకొని అక్షతలు తల మీద వేసుకోవాలి. గోశాలలు దగ్గరలో ఉన్నవారు, కుదిరిన వారు గోశాలను శుభ్రం చేయడం, గోవులను పోషించడం చేయవచ్చు. గో పద్మ వ్రతాన్ని తొలి ఏకాదశి రోజున మొదలుపెట్టి 4 నెలల పాటు ఈ వ్రతాన్ని ప్రతిరోజు ఆచరించాలి. ఇలా ఐదు సంవత్సరాలు ఆచరించాలి. దీనివలన స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది.