Lord Shiva Worship : ఓం నమశ్శివాయ.. శివారాధనకు సోమవారానికి అవినాభావ సంబంధం ఉంది. శివుడు అంటే.. ఒక్కడేనా శివలింగం ఒక్కటేనా.. శివకళ్యాణం ఎలా నిర్వహిస్తారు.. ఈశ్వరుడు లింగ రూపంలో మనకు దర్శనమిస్తాడు. అమ్మవారు పార్వతి శివాలయంలో వాయువ్య దిగ్భాగంలో దర్శనం ఇస్తుంది. శివారాధన చేసే క్రమంలో ఎన్నో ప్రత్యేకతలు, ఈశ్వరుడు లింగాకారంలో చిన్న రూపంలో దర్శనమిస్తాడు. ఏ విధమైన అవయవాదులు, పాదులు, మనం దర్శించలేం.. ఒకవైపు ముఖం ఉందా అంటే ఈశ్వరుడు పంచముకుడు సద్యోజాతము తత్పురుషము, అఘోరము ఈశానము వాసుదేవము ఇలా ఉండేటటువంటి ఐదు రూపాలతో ఆ స్వామి పంచముకుడిగా దర్శనం ఇస్తాడు. పార్వతి ఎక్కడ, అర్ధనారీశ్వరుడు అనే ప్రశ్నలకు ఆషాడమాసం అద్భుతమైన సమాధానం ఇస్తుంది.
ఆషాడమాసం అంతా కూడా అమ్మను ఆరాధన చేసేటటువంటి కాలం.. పూర్వకాలంలో ఈ ఆషాడ మాసంలో వరుణ ప్రకాశము అనే పేరిట ఒక ప్రత్యేకమైనటువంటి యజ్ఞక్రియను పాటించేటటువంటి వారు. ఈ వర్ణ ప్రకాశం ఇష్టాపూర్ ఆరంభం చేసి పౌర్ణమి పూర్తి చేసేటటువంటి వారు అష్టమి సోమవారం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈశ్వరునికి ప్రతికరంగా అభిషేక సేవ నిర్వహించాలి. శివ లింగాన్ని మనం దర్శించేటటువంటి సమయంలో కింద పాలవట్టం ఉంటుంది. ఆ పానమెట్టమే పరమేశ్వరి పరమేశ్వరుని లేకుండా పరమేశ్వరుడు ఉండడు. పానవట్టం లేకుండా పరమశివుడిని పూజించరాదు. నేలపైన వెండి తీగ చుట్టి ఏదో ఒక విధంగా అలా పడుకోబెట్టి శివలింగాన్ని ఒక్కసారి పూజిస్తూ ఉంటారు. అలా చేయకూడదు పాపం తగలుతుంది.
శివలింగాన్ని ఎప్పుడు పూజించిన అభిషేక సేవ నిర్వహించిన ఆ శివలింగాన్ని నిలబెట్టే ఉంచి పూజించాలి. ఆ నిలబెట్టే నిమిత్తమై మనం వినియోగించేటటువంటి పీఠ ఆధారం ఉపాధి అయినటువంటి ఆ స్వరూపం పార్వతి దేవి.. ఆ పార్వతీదేవి రూపంగా పాల పట్టాలని మనం గుర్తించి చుట్టూరా చక్కగా పుష్ప మాలికల అలంకరణ చేస్తుంటారు. అమ్మకు ఆనందంగా ఉండే పరమేశ్వరుడిని అభిషేక సేవతో మనం చక్కగా పరమేశ్వరుడికి సేవించుకోవాలి. పార్వతీ పరమేశ్వరులు విడివిడిగా ఉండరు. కనుక శివపార్ధన కళ్యాణం నిర్వహించేటటువంటి సమయంలో ఒక్క శివలింగాన్నే భారతీ సమేతంగా ఉన్నట్టుగా భావన చేసి కూడా అనేకులు కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు.
Lord Shiva Worship : శివుడిని ఇలా అభిషికేస్తే.. అద్భుతమైన ఫలితాలు..
కనుక ఒకవైపున శివలింగం మరొక వైపున పార్వతీదేవి ప్రతిమ ఆలయంలో ఉన్నట్లయితే పరమేశ్వరికి సమర్పిస్తున్నాను అన్న భావనతో చేయాలి. ఆషాడమాసంలో అమ్మవారు ఉత్సవాలలో సోమవారం నాడు ప్రత్యేకంగా దీపారాధనకు ఏర్పాటు చేస్తుంటారు. వర్షాలు విరివిగా కురిసేటటువంటి కర్ణంలో జగత్తుకు క్షేమం కలిగించే విధంగా ఆ పరమేశ్వరుడిని ఈ రోజున సాయంత్రం సమయంలో అభిషేక సేవ చేస్తుంటారు. భూమి అంటేనే పరమేశ్వరుడు.. భూమిపైన అలా పులకరించి ఎదిగేటటువంటి మొలకలే ప్రకృతి.. దాన్నే మనం పర్యావరణం చెట్లు, చేమలు అని పిలుచుకుంటూ ఉంటాం. ప్రకృతి పార్వతి చుట్టూరా తిరిగేటటువంటి ఉపగ్రహం చంద్రుడు.. ఈ భూమి అనే శివుడికి అలంకారంలో ఉండే స్వరూపం.. వర్షం కురిస్తే భూమి పైన మొలకలు ఆనందంగా అనుకూరిస్తాయి. అభిషేక సేవ నిర్వహిస్తే పరమేశ్వరుడు ఆనందంతో మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు.