Mahishasura Mardini : ఆషాడ మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తితిని మహిషాసురమర్ధిని అష్టమి అనే పేరుతో పిలుస్తారని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథం చెబుతోంది. అంటే మహిషాసుర మర్దిని అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. మహిషాసుర మర్ధిని అమ్మవారిని అర్చన చేసినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. భయంకరమైన శత్రు బాధలన్నీ తొలగిపోతాయి. ఎదుటి వాళ్ళ ఏడుపులు, నరదిష్టి వీటన్నిటిని పోగొట్టుకోవటానికి కూడా మహిశాసురమర్ధిని అమ్మవారి అర్చన విశేషంగా సహకరిస్తుంది. అలాగే, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కారణం తెలియని అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా మహిషాసుర మర్దిని అమ్మవారికి సంబంధించిన మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని చదివినా, విన్న అతి త్వరలోనే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. సహజంగా ఉగ్రదేవతల చిత్రపటాలు, పూజ గదిలో ఏర్పాటు చేసుకోకూడదని సంప్రదాయం మనకు చెబుతుంది.
మహిషాసుర మర్దిని అమ్మవారి చిత్రపటాన్ని ఈరోజు పూజకు మాత్రమే తెచ్చుకుని పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. పూజా మందిరంలో పూజా పీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద మహిషాసురమర్ధిని అమ్మవారి చిత్రపటానించాలి. ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి. మహిషాసుర మర్దిని అమ్మవారి చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత మహిషాసుర మర్దిని అమ్మవారికి సంబంధించిన మహిషాసుర మర్దిని గాయత్రి మంత్రం అని మంత్ర శాస్త్రంలో చెప్పారు. అది ఈరోజు 21సార్లు చదువుకుంటే.. మహిషాసుర మర్దిని విశేషమైన అనుగ్రహానికి పాత్రులై శత్రువుల నశించిపోతారు. దృష్టి దోషాలు తొలగిపోతే అనారోగ్య సమస్యలు పటాపంచలైపోతాయి.
ఆ శక్తివంతమైన మహిషాసురమర్ధిని గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ‘ఓం మహిషా మర్దిన్యై విద్మహే దుర్గాదేవ్యైచ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్’ దీన్ని మహిషాసుర మర్దిని గాయత్రి మంత్రం అంటారు. ఈ మంత్రం 21 సార్లు చదువుకుంటూ మహిషాసుర మర్దిని అమ్మవారి చిత్రపటానికి ఎర్రటి మందార పూలతో ఎర్ర గులాబీపూలతో కుంకుమ కలిపిన అక్షంతలతో పూజ చేయండి. అమ్మవారి ప్రీతి కోసం పులిహోర నైవేద్యం పెట్టండి. కర్పూర హారతి ఇవ్వండి. ఇలా మహిషాసుర మర్దిని అమ్మ వారిని పూజించిన తర్వాత మర్నాడు ఈ చిత్రపటాన్ని ఎక్కడైనా దేవాలయంలో ఉంచి రావాలి. ఎందుకంటే.. ఉగ్రదేవతల చిత్రపటాలు పూజ గదిలో ఏర్పాటు చేసుకోకూడదు. కేవలం ఆషాడ శుక్లా అస్తమితి మహిషాసుర మర్దిని అష్టమి అంటారు.
Mahishasura Mardini : శక్తివంతమైన మహిషాశుర మర్దిని స్తోత్రాన్ని ఇలా పఠిస్తే..
శత్రుభాధలు దృష్టి దోషాలు పోగొట్టుకోవటానికి ఈరోజు మాత్రమే చిత్రపటాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకొని అర్చన చేసుకోవాలి. ఇలా అర్చన చేయడం వీలుకాని వాళ్లు కూడా ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసి మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని 9సార్లు చదివితే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. చదవటం కూడా వీలు కాని వాళ్ళు కనీసం మహిషాసుర మర్దిని అమ్మ వారి చాంటింగ్ ఈ రోజు ఇంట్లో పెట్టుకోండి. మహిషాసుర మర్దిని స్తోత్రం చాంటింగ్ ఉదయం, సాయంత్రం ఇంట్లో పెట్టుకున్నా కూడా దానివల్ల మహిషాసుర మర్దినీ దేవి విశేషమైన అనుగ్రహం కలిగి శత్రుభాధలు దృష్టి దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. మహిషాసుర మర్దిని అమ్మవారి వైభవాన్ని గురించి చండీ సప్తశతిలో మనకు చెప్పారు. మహాలక్ష్మి దేవికి రెండు రూపాలు ఉంటాయి.
సత్వరూపము, రజో రూపము.. సత్వరూపంలో ఉన్న మహాలక్ష్మి దేవి క్షీరసాగరం నుంచి దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు గజలక్ష్మి దేవిగా ఆవిర్భవించింది. అయితే, మహాలక్ష్మి దేవి రజోగుణంలో కూడా ఆవిర్భవించింది. 18 భుజాలలో రకరకాల ఆయుధాలు ధరించి మహాలక్ష్మి దేవి రాజో రూపంలో ఆవిర్భవించింది. అప్పుడు, ఆ మహాలక్ష్మి దేవిని మహిషాసురమర్తిని అనే పేరుతో పిలుస్తారని చండీ సప్తశతిలో చెప్పారు. మహిషాసురుడని రాక్షసుడిని సంహరించడానికి దేవతలందరిలో నుంచి తేజస్సులో బయటికి వచ్చినాయి. ఆ తేజస్సులన్నీ కూడా ఒక మహా తేజస్సుగా మారి 18 భుజాలను కలిగి ఉండి ఆయుధాలను ధరించి మహిషాసురుడని రాక్షసుడిని సంహరించిందని చెబుతారు. ఆ తేజస్సే శ్రీ మహాలక్ష్మీదేవని రజో రూపంలో ఉన్న శ్రీమహాలక్ష్మి దేవిని మహిషాసుర మర్దిని అంటారు.
దేవి భాగవతం చండీ సప్తశతిలో చెప్పారు. మహిషాసుర మర్దిని అమ్మవారు లక్ష్మీ స్వరూపమే లక్ష్మీదేవి స్వరూపమే కానీ రజోగుణంలో ఉన్న లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవి తత్వగుణంలో ఉన్న స్వరూపం పాల సముద్రం నుంచి వచ్చింది. లక్ష్మీదేవి రజోగుణంలో ఆయుధాలు ధరించిన రూపం దేవ.. సంవత్సర మర్దిని అష్టమి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఏ శక్తివంతమైన మంత్రాన్ని 21సార్లు చదువుకుంటే భయంకరమైన శత్రు బాధలు తీవ్రమైన నరదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపులు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి.