5 Easy Neck Exercises : మెడనొప్పి బాధిస్తోందా? అయితే డోంట్ వర్రీ.. ఈ చక్కని యోగసనాలతో వెంటనే తగ్గించుకోవచ్చు. మెడనొప్పికి అనేక కారణాలు ఉంటాయి. మెడ పట్టేయడం అనేది చాలా సాధారణమైన సమస్య కూడా. అనేక కారణాలతో మెడ నొప్పి వస్తుంటుంది.
మెడ నొప్పి తగ్గాలంటే అనేక యోగసనాలు ఉన్నాయి. అందులో మెడనొప్పిని తగ్గించే ఆసనాలేంటో తెలియాలి. సర్వైకల్ స్పెయిన్ ఫ్లెక్సిబుల్ అయి ఉంటుంది. నిరంతరం పనులు చేయడం ద్వారా మెడనొప్పి వస్తుంటుంది. మెడ నొప్పిన భరించలేక తల ఎత్తడం, దించడం చేస్తుంటారు. కొన్నిసార్లు కదపడం చేస్తూ ఉంటారు. మెడనొప్పి కొన్నిసార్లు భరించలేనంతగా ఉంటుంది. ఈ మెడనొప్పిని ఎలా తగ్గించుకోవాలో కొన్ని అద్భుతమైన ఆసనాలు ఉన్నాయి.. అవేంటో ఓసారి చూద్దాం..
మెడనొప్పికి కారణాలివే :
మెడ నొప్పికి చిన్న పొరపాట్లే కారణమవుతాయి. మెడనొప్పిని తట్టుకోలేనంతగా ఉంటుంది. మెడనొప్పి ఉన్నవాళ్లంతా ఈ ఆసనాలు వేస్తె మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మెడ పట్టేయడం వల్ల సౌకర్యవంతంగా తలను తిప్పలేరు. ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఏడాదిలో 1400 గంటలు స్మార్ట్ ఫోన్ చూస్తేనే ఉంటారు. అనేక పోజిషన్లలో కూర్చొంటారు. ఇలా చేయడం వల్ల మెడపట్టేయడం జరుగుతుంది. మెడ ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈ ఆసనాలతో మెడనొప్పి నుంచి బయటపడొచ్చు.
క్యాట్ పోజ్ :
పిల్లి మాదిరిగా ఇలా పోజ్ లో ఉండటం ద్వారా మెడనొప్పిని తగ్గించుకోవచ్చు. ఒకసారి పై నుంచి కిందకి కింది నుంచి పైకి ఈ ఆసనంలోకి వెళ్లాలి. ఇలా అనుసరిస్తే.. స్పైన్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. మెడనొప్పి కూడా తొలగిపోతుంది. ప్రతిరోజు ఇలా చేసి మెడనొప్పిని నివారించుకోవచ్చు.
ఛైల్డ్స్ పోజ్ :
నేలపై పాకే పిల్లల మాదిరిగా మెడ పోజ్ ఇవ్వాలి. ఈ తేలికిపాడి ఆసనాలను వేస్తుండటం వల్ల తొందరగా మెడ నొప్పి నుంచి అలాగే బ్యాక్ పెయిన్ నుంచి విముక్తి పొందవచ్చు. ఈ ఆసనంతో ఆందోళనతో పాటు ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు. మెడనొప్పిని తగ్గించడంలో ఈ ఆసనం అద్భుతంగా పనిచేస్తుంది.
ట్రయాంగిల్ పోజ్ :
ఈ ఆసనంతో బ్యాక్ పెయిన్ తొందరగా తగ్గించుకోవచ్చు. అలాగే లోయర్ బ్యాక్ పెయిన్ బాగా తగ్గిస్తుంది. మెడనొప్పి తగ్గించడంలోనూ ఈ ఆసనం బ్రహ్మండంగా పనిచేస్తుంది. పోస్టర్ కూడా బాగా మెరుగు పడుతుంది. మెడనొప్పితో ఇతరేతర నొప్పి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఓసారి ఈ ఆసనాలను వేయడం ద్వారా మెడనొప్పిని నెమ్మదిగా తగ్గించుకోవచ్చు.
డౌన్‌వర్డ్ డాగ్ పోజ్ :
కుక్క మాదిరిగా డౌన్ వర్డ్ పోజ్ ఆసనం చేయాలి. ఈ ఆసనం ద్వారా భుజం, మెడ నొప్పి వెంటనే తగ్గిపోతుంది. పోస్టర్ కూడా సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. మెడ నొప్పి సమస్యలను కూడా తొలగిస్తుంది.
అప్‌వార్డ్ ఫేసింగ్ డాగ్ :
కుక్క మాదిరిగా పైకి మెడ లేపాలి.. డౌన్ వర్డ్ డాగ్ మాదిరిగానే అప్ వర్డ్ ఆసనం వేయాలి. డాగ్ పోజ్ మెడ నొప్పిని తగ్గించగలదు. మెడ సరైన పోజులో ఉండేలా చేస్తుంది. ఈ ఆసనంతో మెడని సెట్ చేసుకోవచ్చు. నెమ్మదిగా ఈ ఆసనం చేస్తూ ఉంటే.. మెడనొప్పి దానంతంటే అదే తగ్గిపోతుంది.
Read Also : Weight Loss Exercises : బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని గంటలు ఎక్సర్‌సైజ్ చేయాలో తెలుసా?