Varun Tej Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి, వరుణ్‌ తేజ్ పెళ్లి నిజమేనా? ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్..? మెగా అభిమానులకు ఊహించని షాక్..!

Varun Tej Lavanya Tripathi : మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పెళ్లి చేసుకోబోతున్నారా? తెలుగు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్.. మెగా ఫ్యామిలీలో త్వరలో పెళ్లిబాజాలు మోగబోతున్నాయా? అంటే.. చూస్తుంటే ఆ వార్తలే నిజమనిపించేలా టాక్ వినిపిస్తోంది. మెగా హీరోల పెళ్లిళ్ల గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక రుమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఆ హీరో ప్రేమలో పడ్డాడట.. ఆ హీరోయిన్ లవ్ ట్రాక్ అంటూ తెగ గాసిప్‌లు వినిపిస్తుంటాయి. అలానే లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ (Varun Tej) ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, రేపో మాపో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ జోరుగా వార్తలు వినిపించాయి. ఇందులో నిజమెంత? అనేది ఇప్పటివరకూ మెగా కంపౌండ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు.

అభిమాన హీరో పెళ్లిపై అభిమానుల్లో ఆసక్తి ఉండట కామన్.. ఇప్పుడు అలాంటిదే మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి (Varun Tej Marriage) చేసుకోబోతున్నారనే వార్త బయటకు రావడంతో అభిమానుల్లో సందడి నెలకొంది. గతంలోనూ తమ పెళ్లి వార్తలపై వరుణ్, లావణ్య కొట్టిపారేశారు. మా మధ్య ఎలాంటి ప్రేమ లేదని, జెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. కానీ, ఇటీవల ఓ జాతీయ మీడియాలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహానికి వచ్చే నెలలో నిశ్చితార్థం (Varun tej Lavanya tripathi to get engaged) అంటూ ఒక వార్తను పబ్లీష్ చేసింది. ఈ వార్త తెలియగానే మెగా అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారట.. ఇప్పటివరకూ ఇదంతా పుకార్లు కదా అని కొట్టిపారేసిన మెగా అభిమానులకు షాక్‌లో ఉన్నారట..

Rumoured couple Varun Tej Lavanya Tripathi engagement news in telugu viral
Rumoured couple Varun Tej Lavanya Tripathi engagement news in telugu viral

ఇప్పుడు, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారని కొత్త నివేదికలు సూచిస్తున్నాయి. కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత జూన్ 2023లో ఇద్దరూ నిశ్చితార్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యే ప్రైవేట్ వేడుక కానుంది. ఈ వేడకకు రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి ప్రముఖులు హాజరు కానున్నారు. నివేదికలు నిజమని తేలితే.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఈ ఏడాది చివరిలో గ్రాండ్ వేడుకలో వివాహం చేసుకోనున్నారు.

అన్న పెళ్లిపై నిహారిక కొణిదెల రియాక్షన్ ఇదిగో..
డెడ్ పిక్సల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ సందర్భంగా నిహారిక కొణిదెల తన సోదరుడు వరుణ్ తేజ్ పెళ్లి వార్తలపై స్పందించింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారట కదా అని అడగగా.. సమాధానం చెప్పకుండా నిహారిక మాట దాటేసింది. మా అన్న పెళ్లి గురించి ఎందుకు? వెబ్ సిరీస్ ప్రమోషన్స్ గురించి మాత్రమే మాట్లాడండని తెలిపింది. ఒకవేళ ఇది అబద్దమైతే అదంతా పుకార్లు మాత్రమేనని నిహారిక కొట్టిపారేసి ఉండేది.. అలా చేయలేదంటే.. వరుణ్, లావణ్య పెళ్లి ఫిక్స్ అయిందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Varun Tej Lavanya Tripathi : మెగా బ్రదర్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా? :

మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.. లావణ్య త్రిపాఠితో వరుణ్ పెళ్లిని మెగా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా? లేదా అనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. అప్పట్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే వీరిద్దరి పరిచయడం కాస్తా ప్రేమగా మారి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. మెగా కంపౌండ్ నుంచి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లిపై ఇప్పటివరకూ స్పందించలేదు. కానీ, పెళ్లి నిశ్చితార్థ వేడకులకు ఘనంగా ఏర్పాటు జరుగుతున్నట్టు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే..

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి రెండు సినిమాల్లో నటించారు. మిస్టర్, అంతరిక్షం 9000 KMPH మూవీలో కనిపించారు. గతంలో ఈ ఇద్దరు పలు ఈవెంట్లలో కలిసి కనిపించారు. వరుణ్ తేజ్ కొత్త మూవీ గందీవధారి అర్జునలో కనిపించనున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో వరుణ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపిస్తాడు. లావణ్య త్రిపాఠి చివరిసారిగా హ్యాపీ బర్త్ డే సినిమాలో కనిపించింది. థనల్ (Thanal) మూవీ రిలీజ్ కోసం లావణ్య త్రిపాఠి ఎదురుచూస్తోంది.

Read Also : Anchor Rashmi : అలా నాపై ఆ ముద్ర వేశారు.. అందుకే నా పరిస్థితి ఇలా.. యాంకర్ రష్మీ షాకింగ్ కామెంట్స్..!

Leave a Comment