Yoga Poses For Back Pain : వెన్నునొప్పి బాధిస్తోందా? ఈ యోగాసనాలతో చిటికెలో తగ్గించుకోవచ్చు!

Yoga Poses for back pain : వెన్నునొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ యోగాసనాలను ఓసారి ప్రయత్నించండి.. మంచి ఫలితాలను తొందరగా పొందవచ్చునని అంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ యోగా చేస్తే అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. వెన్నునొప్పిని తగ్గించే యోగసానాల్లో చాలా ఉన్నాయి. అందులో మీకోసం కొన్ని ఆసనాలను అందిస్తున్నాం.. ఈ యోగాసనాలను ప్రయత్నించి మీ వెన్నునొప్పి సమస్య నుంచి బయటపడొచ్చు.. అవేంటో ఓసారి చూద్దాం..

1. ​అథోముఖ మర్జరి ఆసనం:
ఈ ఆసనంలో మోకాళ్ల సాయంతో నేల మీద కూర్చోవాలి. కాళ్లను వెనక్కి చాపాలి. అలాగే మీ ముఖాన్ని ముందుకి పెట్టాలి. చేతులు రెండూ కూడా కింద పెట్టాలి. శ్వాసను తీసుకోవాలి. స్పైన్ సహాయంతో పైకి వెళ్లాలి. ఆ తర్వాత మెడను కదపాలి. శ్వాస తీసుకోవడం.. వదలడంపై మీ ధ్యాసను ఉంచాలి. అప్పుడు మీ వెన్నునొప్పి నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. మీరూ వెన్నునొప్పితో బాధపడుతుంటే మాత్రం ఓసారి ఈ యోగసనాలను మీరూ ట్రై చేసి చూడండి..

yoga poses for back pain : 5 yoga poses to get relief from back pain
yoga poses for back pain : 5 yoga poses to get relief from back pain

​2. ఊర్ధ్వ ముఖ మర్జరి ఆసనం :
ఈ ఆసనంలో మీ మోకాళ్లను చేతులను కిందకి ఉంచాలి. భుజాలు కిందకి చేతులు వెళ్లాలి. అలాగే పొట్ట కిందకి మోకాళ్లు రావాలి. ఇప్పుడు శ్వాస తీసుకుని ఈ భంగిమలోకి రావాలి. కంప్యూటర్ ముందు కూర్చునేవారు పొట్టని వెనక్కి పెట్టి బరువంతా కాళ్ల మీద పడేలా కూర్చుంటారు. ఇలా చేస్తే అనేక వెన్ను నొప్పి సమస్యలు వస్తాయి. ఈ ఆసనంతో మీ వెన్నునొప్పిని ఇట్టే తగ్గించుకోవచ్చు.

3. ​మలాసనం :
మలాసనం అంటే.. ఇలా భంగిమలో చేయాలి. ముందుగా మీరు చేయాల్సిందిల్లా.. రెండు కాళ్లను జాపాలి.. రెండు చేతులూ కిందికి ఉంచాలి.. అలాగే మోకాళ్లను వంచి కిందికి ఇలా కూర్చోవాలి. మీ కాళ్లను ఫ్లోర్‌పై సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. చేతులు నేల మీద పెట్టుకోవచ్చు.. నమస్కారం చేస్తున్న భంగిమలో కూర్చోవాలి.

Yoga Poses For Back Pain : వెన్నునొప్పికి అద్భుతమైన రెమడీలు..  

​4. అథోముఖి శ్వాస ఆసనం :
అథోముఖి శ్వాస ఆసనం అంటే.. టేబుల్ టాప్ పొజిషన్‌లోకి రావాలి. మీ మోకాళ్లను చేతులను కింద పెట్టాలి. మీ భుజాల కిందికి చేతులు తేవాలి. పొట్ట కిందకి మీ మోకాళ్లు వచ్చేలా చూసుకోవాలి. వి ఆకారంలోకి మీ కాళ్లను ఉంచండి. ఇప్పుడు రెండు చేతుల మధ్యలో మీ తల వచ్చేలా చూసుకోండి. మీరు బొటన వేలిని చూస్తూ మీ దృష్టిని నిలపండి.

5. ​శలభాసనం:
ఈ శలభాసనం ఎలా చేయాలంటే.. మీ పొట్టను తిరగేయాలి.. అలా నేల మీద పడుకోవాలి. కాళ్లు చేతులు ముందుకి చాపాల్సి ఉంటుంది. శ్వాస గట్టిగా తీసుకోవాలి. శ్వాస బిగపట్టి ఉంచి మీ కాళ్లను పైకి చాపాలి. అలాగే మీ శరీరం బ్యాలెన్స్ మొత్తం పొట్ట మీద పడేలా చూసుకోవాలి. ఇక మీ తల, భుజాల్ని పైకిఎత్తాలి. మోకాళ్లను తిన్నగా ఉంచాల్సి ఉంటుంది. ఈ యోగాసనాన్ని పది సెకన్ల పాటు వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ కాళ్లను కింద పెట్టి శ్వాసని వదిలేయాలి.

నడుం నొప్పిని తగ్గించుకునేందుకు అనేక రకాల భంగిమలతో యోగసాలను వేయవచ్చు. కానీ, యోగా నిపుణుల సలహాలు, సూచనలతో మాత్రమే ఈ యోగసానాలను వేయడం చాలా మంచిది. లేదంటే లేనిపోని ఇతర సమస్యలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు.

Read Also :  Walking Heart Lungs Health : నడకతో గుండెజబ్బులకు చెక్.. మరెన్నో ప్రయోజనాలు..!

Leave a Comment