Samantha Ruth Prabhu : సమంత.. శాకుంతలం మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శాకుంతలం సినిమాను పాన్ ఇండియాగా ఐదు భాషల్లో విడుదలైంది. ఇప్పటికే సమంత సినిమా ప్రమోషన్లలో బిజీగా గడిపేశారు.
శాకుంతలం మూవీ రిలీజ్ సందర్భంగా సమంత ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు కూల్‌గా సమాధానం చెప్పుకొచ్చింది సమంత.. ట్విట్టర్‌లో AskSam సెషన్‌లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. తన కొత్త ఫ్రెండ్ ఎవరు అనేది రివీల్ చేసింది.
టీనేజ్ అమ్మాయిలా మీ లుక్స్ కనిపిస్తున్నాయి. ఇలానే ముద్దుగా కనిపిస్తారా? అని ప్రశ్నించారు. అప్పుడు సమంత తన క్లోజ్ ఫ్రెండ్.. ఎవరో కాదు.. కళ్లజోడు.. ఇదే నా కొత్త బెస్ట్ ఫ్రెండ్’ అంటూ రివీల్ చేసింది. కళ్ల జోడు పెట్టుకోవడం వల్లనే తనకు ఈ లుక్ వచ్చినట్టు తెలిపింది. అదే సమయంలో సమంతకు ఒక నెటిజన్ వార్నింగ్ ఇచ్చాడు.
గతంలో సమంత చేసిన ఓ బేబీ మూవీ సమయంలో తనకు రిప్లై ఇచ్చినట్టు తెలిపాడు. దాంతో ఆ మూవీ హిట్ అయిందని ట్వీట్ చేశాడు. శాకుంతలం మూవీకి కూడా సమంతను రిప్లయ్ ఇవ్వాలని అడిగాడు. అలా చేస్తే.. శాకుంతలం బ్లాక్ బస్టర్ అవుతుందని అన్నాడు. దాంతో సమంత ‘వామ్మో.. నీతో జాగ్రత్తగా ఉండాల్సిందేనని ఫన్నీగా స్పందించింది.
Glasses are my new best friend 🤓🤍#Shaakuntalam https://t.co/X9151BOZx2
— Samantha (@Samanthaprabhu2) April 9, 2023
Read Also : Niharika Chaitanya : నిహారికతో విడాకులపై చైతన్య దిమ్మతిరిగే కౌంటర్.. ఒక్క ఫొటోతో చెక్ పెట్టేశాడుగా!