Posani Krishna Murali : నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)పై ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ ఫైబర్ నెట్ (AP Fibernet Program) కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నంది అవార్డుల (Nandi Awards)పై పోసాని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan Mohan Reddy)ని బాలకృష్ణ (Balakrishna) సైకో అని పిలవటంపై పోసాని ఘాటుగానే స్పందించారు. బాలకృష్ణపై పోసాని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. పోసాని కృష్ణ మురళి ఏమన్నారంటే.. బాలకృష్ణ.. ఇద్దరినీ తుపాకీతో కాల్చేశాడని, మంచివాళ్లు కాలుస్తారా? సైకోలు కాలుస్తారా? అని ప్రశ్నించారు. ఏదైనా సమస్య ఉంటే.. పోలీస్ స్టేషన్‌కి వెళ్లాలన్నారు. చేతిలో గన్ ఉంది కదాని కాలుస్తారా? అని పోసాని మండిపడ్డారు.
ఇంట్లో కళ్ల ముందే నైట్ వాచ్‌మెన్ చనిపోతే.. శవం అక్కడే పెట్టుకుని బాలకృష్ణ ఏం చేశారు? అంటూ పోసాని ప్రశ్నించారు. బాలకృష్ణ.. మేకప్ వేసుకుని వాచ్‌మెన్ మృతదేహాన్ని దాటుకుని మరి షూటింగ్ వెళ్లిపోయాడని పోసాని విమర్శించారు. ఇప్పుడు చెప్పండి.. ఇందులో వైస్ జగన్ సైకోనా! బాలకృష్ణ సైకోనా ? ఆయనే ప్రశ్నించుకోవాలన్నారు. గతంలో బాలకృష్ణ స్టేజ్‌పై ఆడాళ్లకు కడుపు చేయాలని అన్నాడు.
ఇలాంటివి ఎప్పుడైనా జగన్ నోటి ద్వారా విన్నారా? అని పోసాని ప్రశ్నించారు. పబ్లిక్‌లో జనాలను కొడతారు.. ఎప్పుడైనా జగన్ పబ్లిక్‌లో ఎవరినైనా కొట్టారా? జగన్ తన నోటి నుంచి అరేయ్ అని అనడం ఎప్పుడైనా విన్నారా? అని పోసాని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ (YSRCP) ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. ఏపీ ప్రజలే తమను గెలిపిస్తారని నమ్మకం ఉందని పోసాని విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also : Renu Desai : అకీరా నా కొడుకు.. మీ హద్దులను మీరొద్దు.. పవన్ ఫ్యాన్స్‌కు రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్..!