Yoga Mistakes in Telugu : యోగా చేసేప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే అంతే సంగతులు..

Yoga Mistakes in Telugu : కరోనా మహమ్మరి వల్ల ప్రజల్లో మునుపటితో పోలిస్తే ఆరోగ్యంపై శ్రద్ధ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే జనం బలవర్ధకమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వైపు మొగ్గు చూపుతున్నారు. మినరల్స్, విటమిన్స్ సమృద్ధిగా ఉండే తాజా ఫలాలు, కూరగాయలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యాన్ని అందించే ఎక్సర్‌సైజెస్ చేస్తున్నారు. యోగా చేయడం కూడా అలవర్చుకుంటున్నారు. అయితే, యోగా చేసేప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెప్తున్నారు. లేదంటే ఇబ్బందులు తలెత్తే చాన్సెస్ ఉంటాయి.

Yoga Mistakes in Telugu : yoga mistakes for beginners in telugu
Yoga Mistakes in Telugu : yoga mistakes for beginners in telugu

సాధారణంగా అందరు ప్రతీ రోజు మార్నింగ్ టైమ్స్‌లో యోగా చేస్తుంటారు. అలా చేయడం మంచిదే. కానీ, యోగా చేసే సమయంలో ఈ జాగ్రత్తలు కంపల్సరీ. అట్మాస్పియరిక్ కండీషన్స్ సరిగా ఉన్నాయో లేవో చూసుకున్న తర్వాతనే యోగా చేయాలి. వాతావారణం బాగా వేడిగా ఉన్నా లేదా బాగా చల్లగా ఉన్నా యోగా చేయొద్దు. కూల్ లేదా హాట్ వెదర్‌లో యోగా చేయడం వల్ల హెల్త్‌పై ప్రభావం పడుతుంది. యోగా ఈ సమయంలో చేయడం వల్ల హ్యూమన్ బాడీ టెంపరేచర్‌పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి అట్మాస్పియరిక్ కండీషన్స్ సరిగా ఉన్న టైంలోనే యోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇకపోతే చాలా మంది త్వరత్వరగా పనులు చేయాలని చూస్తుంటారు. అలా త్వరగా చేస్తున్న మాదిరగానే యోగా ఆసనాలు కూడా స్పీడ్‌గా చేసేయాలని అనుకుంటారు. కానీ, అలా చేయడం చాలా డేంజర్. ఇన్‌స్ట్రక్టర్స్ పర్యవేక్షణలోనే యోగాసనాలు చేయడం స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్‌లోనే కష్టమైన ఆసనాలు చేయడానికి ప్రయత్నిస్తే మీకే ఇబ్బందులు వస్తాయి. ఇకపోతే ఒకేరోజు అన్ని ఆసనాలు చేయాలనుకోకూడదు. అలా చేయడం మూర్ఖత్వమే అవుతుంది. ప్రజెంట్ డిజిటల్ వరల్డ్‌లో యూట్యూబ్‌లో చూసి చాలా మంది పలు విషయాలు తెలుసుకుంటారు.

అది మంచిదే కానీ, ఆ మాదిరగానే యోగా ఆసనాలు చేయాలనుకోవడం తప్పు. యూట్యూబ్ వీడియోలు చూసి ఇష్టం వచ్చిన ఆసనాలను అస్సలు ట్రై చేయకూడదు. అలా చేయడం వల్ల మీ ఆరోగ్యంపైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. నిపుణులు లేదా యోగా ఇన్‌స్ట్రక్టర్స్ పర్యవేక్షణలో యోగా చేయాలి. యోగా చేసే సమయంలో ఫ్రీ డ్రెస్ ధరించాలి. దాంతో పాటు యోగా చేసిన వెంటనే స్నానం చేయొద్దు. ఫుడ్ తీసుకున్న వెంటనే యోగా అస్సలు చేయొద్దు.

Read Also : Yoga Benefits in Telugu : ఈ యోగాసనాలతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా పెంచుకోవచ్చు తెలుసా?

Leave a Comment