Tamalapaku benefits : సంతాన సామర్థ్యం పెరగాలంటే… ఈ ఆకులు తినండి..

Tamalapaku benefits : తమళపాకు.. ప్రస్తుత జనరేషన్‌లో దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. పాన్ అంటే చాలా మందికి అర్థమవుతుంది. ఈ ఆకు వల్ల మన బాడీకి అనేక ఉపయోగాలుంటాయి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. దీనిని తినడం వల్ల నియాసిన్, థయామిన్, కరోటిన్ వంటి విటమిన్స్ ఎక్కువగా మన బాడీకి అందుతాయి. ఈ ఆకు పరిమళం చాలా మందికి ఇష్టం. దీనిని ఇంట్లో మొక్కగా పెంచుకోవచ్చు కూడా. కానీ ఈ ఆకును తినేటప్పుడు తొడిమె తీసెయ్యాలి. ఈ తొడిమె తినడం వల్ల మగవారిలో సెక్స్ ప్రాబ్లమ్స్, ఆడవారిలో సంతాన ప్రాబ్లమ్స్ వస్తాయట. అందుకే దీనిని తొడమ తీసేసి ఉపయోగించడం ఉత్తమం. ఇది రక్తంలోని చక్కెర లెవల్స్ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. బరువు తగ్గేందుకు సైతం ఎంతో సహాయపడుతుంది. శరీరంలో కొవ్వును సైతం కరిగిస్తుంది. నోటి క్యాన్సర్ ను నివారించేందుకు ఈ ఆకులు ఉపయోగపడతాయి. ఎందుకంటే మన లాలాజలంలో ఉన్న ఆమ్లాల స్థాయిని నిర్వహించేందుకు హెల్ప్ చేస్తుంది.

tamalapaku health benefits in telugu
tamalapaku health benefits in telugu

ఈ ఆకులను గాయాలపై పూస్తే గాయం నయమవుతుంది. ఆయుర్వేదంలోనూ దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. తలనొప్పితో బాధపడేవారికి ఇది మంచి మెడిసిన్. ఎక్కువగా జలుబు, దగ్గు చేసిన వారు దీనిని తింటారు. దీనిని తినడం వల్ల జలుబు, దగ్గు నయమవుతుంది. వాటి నుంచి కాస్త రిలీఫ్ దొరుకుతుంది. దీనిని చిన్న పిల్లల చాతిపై ఉంచితే వారి చాతిలో పేరుకుపోయిన కఫం కరిగిపోతుంది. తమళపాకులను తినడం వల్ల మగవారిలో సంతాన సామర్థ్యం సైతం పెరుగుతుంది. కానీ ఈ విషయాలు మనలో చాలా మందికి తెలియవు. ఈ కారణంగానే తమళపాకులను ఎక్కువగా వాడము. కేవలం పూజలు, తదితర కార్యక్రమాలకు మాత్రమే పరిమితం చేస్తూ ఉంటాం. గతంలో ముసలివారు దీనిని ఎక్కువగా తినేవారు. దీనిని కాస్త సున్నం, జాజు కలిపి తీసుకునేవారు.

Read Also : Tamalapaku benefits : తమలపాకును తరచుగా ఉపయోగిస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజలున్నాయో తెలుసా..!

Leave a Comment