Heart Attack : అధిక బరువు కలిగి ఉన్నవారు, మంచి ఫిట్‌నెస్, ఆరోగ్యంగా ఉండేందుకు జిమ్ చేయమని వైద్యులే చెబుతుంటారు. అయితే, జిమ్ చేయడంలోనూ లిమిట్ ఉండాలని, ఆవేశపడి రెండ్రోజులది కలిపి ఒకే రోజు చేయడం, ఓవర్ లోడ్ వేసుకుని లిఫ్టింగ్ చేయడం, పుష్ అప్స్ వంటివి చేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా చేయడం వలన శరీరం తీవ్ర ఒత్తిడికి లోనయ్యి రెండ్ హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.. రోజుకు ఇంత అని చొప్పున మితంగా వ్యాయామం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీరం కూడా త్వరగా అలసటకు గురికాదని వెల్లడించారు.కానీ, చాలా మంది తక్కువ టైంలో ఎక్కువ బాడీ బిల్డప్ చేయాలని చూస్తారని, వారికి ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండదని కూడా వివరించారు.
ఎక్కువసేపు జిమ్ చేయడం లేదా శరీరాన్ని అలసటకు గురిచేయడం వలన గుండె ధమనులకు రక్తప్రసరణ జరగక.. రెడ్ హార్ట్ స్ట్రోక్‌కు దారితీస్తుందని పేర్కొన్నారు. ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (46) వర్కౌట్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆస్పత్రికి తరలించాక ఆయన మరణించారు.ఆ ఒక్క ఘటన జిమ్ చేస్తే అందరికీ ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు.
అందుకే గంటలు గంటలు జిమ్ చేసే బదులు.. వ్యాయామంతో కూడా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చట.. రోజు ప్రాణాయామం, యోగా మరియు 30 నుంచి 45 నిమిషాల ప్రతీరోజు నడుస్తుంటే గుండె సిరలకు రక్తప్రసరణ బాగా జరుగుతుందని, ఫలితంగా మన గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Heart Attack : జిమ్ చేసేవారిలో గుండెపోటుకు కారణాలేంటి?
సాధారణ వ్యాయామం చేసేవారితో పోలిస్తే జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేసేవారు ఎక్కువగా శక్తిని ఖర్చుచేస్తారట.. అక్కడ ఎంత సేపు వ్యాయామం చేశామనేది కౌంట్ ఉండదని, ఫలితంగా ఎక్కువ శ్రమ ఖర్చవుతుందని తెలుస్తోంది. ఇలా నిరంతరం చేస్తే తీవ్రమైన శారీరక శ్రమ, అలసట, నిర్జలీకరణం మరియు పెయిన్స్ పెరిగి ఆస్పత్రిలో జాయిన్ కావాల్సి వస్తుందట.. ఉదా..సాధారణంగా పరిగెత్తేవారితో పోలిస్తే మారథాన్‌లో పరిగెత్తిన వారి గుండెకు ప్రమాదం ఎక్కువగా పొంచి ఉందని గుర్తించారు.
కొందరిలో ఛాతిలో నొప్పి రావడం, గుండెకు మచ్చలు ఏర్పడటం వంటి మార్పులకు దారితీస్తుందన్నారు. వ్యాయామం అనేది నెమ్మదిగా కొద్దికొద్దిగా చేయడం వలన కేలరీలు కరుగుతాయని, దీంతో ఒత్తిడి, డిప్రెషన్ కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రీసెర్చ్ ప్రకారం వారానికి కనీసం 150నిమిషాల మితమైన వ్యాయామం గుండె భద్రంగా తలఉండేలా చూస్తుందని తేలింది.
Read Also : Heart Attack : గుండెపోటు రావడానికి ముందు ఎటువంటి సంకేతాలు వస్తాయి.. ఎలా అప్రమత్తం కావాలి!