Water Drinking Habit : నీరు అతిగా తాగితే ఇన్ని సమస్యలా? ఏయే సమయాల్లో నీటిని తాగితే మంచిది..

Water Drinking Habit : మనిషి కొద్ది రోజుల వరకు ఆహారం లేకపోయిన బ్రతకగలడు కానీ నీరు తాగకుంటే బ్రతకలేడు. అందుకే డాక్టర్స్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు నీరు ఎక్కువగా తాగాలని. రోజుకు మన శరీరానికి ఎంత నీరు అవసరమవుతుందో తెలుసా? నీరు ఎక్కువగా తాగడం వల్ల మన శరీరానికి చేకూరే లాభాలు ఎంటో తెలుసా? ఒక్క సారి తెలుసుకుందాం.

మనంలో చాలా మంది కేవలం దాహం వేసినప్పుడే మాత్రమే నీటిని తాగుతారు. ప్రస్తుత బిజీ లైఫ్‌లో నీటి గురించి చాలా మంది పట్టించుకోరు. దీని వల్ల వారు అనేక హెల్త్ ప్రాబ్లమ్స్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారు. శరీరానికి అవసరమైనంత నీటిని తాగడం వల్ల సగం డిసీజెస్‌లను దూరం పెట్టొచ్చు. మన బాడికి తగినంత నీటిని తాగకపోతే ముందు కాస్త నీరసం, అలసట లాగా అనిపిస్తుంది. దీంతో బాడీ డీహైడ్రేషన్‌‌కు గురవుతుంది. ఇలా జరిగితే స్కిన్, ఐస్ డ్రైగా మారతాయి. కాస్త ఇరిటేషన్‌గా అనిపిస్తుంది. యూరిన్ సైతం తగ్గుతుంది. మజిల్ పెయిన్స్ రావడంతో పాటు గుండె కొట్టుకోవడంలో స్పీడ్ పెరగుతుంది.

Water Drinking Habit
Water Drinking Habit

ప్రతి వ్యక్తి రోజుకు సుమారుగా ఐదు లీటర్స్ నీటిని తాగితే మంచిదని డాక్టర్స్ చెబుతుంటారు. మధ్యాహ్నానికి ముందు సమయంలో వీలైనంత ఎక్కువగా నీటిని తీసుకోవాలి. లంచ్ చేసిన తర్వాత కొంచెం తక్కువగా నీటిని తాగాలి. మార్నింగ్ లేవగానే సుమారు రెండు గ్లాసులకు సరిపడా నీటిని తాగినట్టయితే బాడీకి చాలా మంచిది. దీని వల్ల అవయవాలు ఉత్తేజమవుతాయి. శరీరంలోని విషపదార్థాలు సైతం తొలగిపోతాయని డాక్టర్స్ చెబుతున్నారు. బరువుకు తగ్గట్టుగా నీటిని తీసుకోవడం సైతం చాలా అవసరం. 20 కిలోల బరువుకు లీటర్ నీటిని చొప్పున తీసుకోవాలి. నీరు అవసరానికి మించి ఎక్కువగా తాగితే బాడీలోని ఫ్లూయిడ్ బెలెన్స్ దెబ్బతింటుందని డాక్లర్స్ సూచిస్తున్నారు. దీని వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయట. మూత్రపిండాలు, గుండెకు సంబంధించిన సమస్యలు సైతం ఏర్పడే చాన్స్ ఉంది. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే.

Read Also : Drinking Water : ప్రతీ రోజు ఎన్ని లీటర్ల వాటర్ తాగాలంటే?

Leave a Comment