Health Fitness : శరీర ఆరోగ్యం కోసం మనలో చాలా మంది వ్యాయామం చేస్తుంటారు. దీని వల్ల ఆరోగ్యానికి ఎంతో లాభం చేకూరుతుంది. బాడీ ఫిట్‌గా ఉండటానికి వ్యాయామం అవసరం. ప్రతి రోజూ కనీసం 30 నిముషాల పాటైనా వ్యాయామం చేయాలి. కరోనా తర్వాత చాలా మంది ఫిజికల్ ఫిట్‌నెస్‌పై కేర్ పెడుతున్నారు. ఇలా ఎక్సర్ సైజ్ చేయడం వల్ల ఫిజికల్, మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది.
వ్యాయమం వల్ల బాడీతో పాటు చర్మం సైతం అందంగా మారుతుంది. కానీ వ్యాయామం అలవాటు లేని వారు అనేక క్రీములను ముఖానికి రాసుకుని చర్మాన్ని పాడు చేసుకుంటారు. అలా కాకుండా ఫిజకల్ యాక్టివిటీ ద్వారా అందం చేకూరుతుంది. వ్యాయామం వల్ల స్కీన్ లోపల, బయట శుభ్రంగా మారుతుంది. పోషక పదార్థాలు, ఆక్సిజన్ మన బాడీలోని లోపలి బాగాలకు అందుతాయి. ఇలా జరగడంతో స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది.

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల నేచురల్ ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని సున్నితత్వంగా మార్చుతుంది. వ్యాయామం చేయడం వల్ల చెమట పడుతుంది. చెమట ఎక్కువ పడితే శరీరంపై చెడు బ్యాక్టీరియా ఏర్పడుంది. చెమటను ఇలాగే వదిలేస్తే ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
కాబట్టి చెమట పట్టిన వెంటనే నీటితో కడిగేసుకోవాలి. లేదంటే స్కీన్ ప్రాబ్లమ్స్ తో పోరాటం చేయాల్సిందే. అందుకే చెమట పట్టిన వెంటనే స్కీన్ ను నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వ్యాయామం చేసిన వెంటనే చెమటను నీటితో కడిగేసుకోవడం వల్ల చర్మానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తదు. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఆరోగ్యంతో పాటు అందాన్ని సైతం సొంతం చేసుకోవచ్చు..
Read Also : Mask during workouts : మాస్క్ పెట్టుకుని వ్యాయామం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..