Hair Care Tips : జుట్ట రాలే సమస్య ప్రస్తుతం ప్రతీ 10 మందిలో ఆరుగురికి ఉంది. చాలా మందికి యవ్వనంలోనే జుట్టు రాలిపోయి అంద విహీనంగా కనిపిస్తుంటారు. దీంతో వారిపై నమ్మకం తగ్గిపోయి ఒత్తిడికి లోనవుతారు. అయితే, జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటర్ ప్రాబ్లమ్స్, అధికంగా ఆలోచించడం, చుండ్రు, రసాయన షాంపులు, తరచూ కొబ్బరినూనె పెట్టకపోవడం, పోషకాహార లోపం, వారసత్వంగా కూడా జుట్టు రాలిపోయి బాల్డ్ హెడ్ సమస్య ఏర్పడవచ్చును.అయితే, దీనికి ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంది. ఇంట్లోనే ఆయుర్వేద పద్ధతుల్లో రెమిడీని తయారు చేసుకుని వాడుతుంటే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు.
జుట్టు బలంగా, తెల్లవెంట్రుకలు రాకుండా ఉండాలంటే..
ఈ రోజుల్లో స్కూల్ పిల్లవాడి నుంచి యువతీ యువకుల్లో చాలా మందికి చిన్న వయస్సులోనే జుట్టు నెరుస్తోంది. అలాంటి వారు తమ తెల్లజుట్టును కవర్ చేసుకోవడానికి అనేక రసాయనాలతో కూడా షాంపులు, కండిషనర్స్, బ్లాక్ హెన్నాలు వాడుతుంటారు. వీటి వలన జుట్టు రాలే సమస్య కూడా తీవ్రతరమవుతుంది. అయితే, ఆయుర్వేదంలో వీటికి అద్భుతమైన చిట్కా ఉంది.

చుండ్రును, నెత్తిలో ఉన్న మురికిని తీసివేయడానికి షికాకా ప్యాక్ వేసుకోవాలి. ఇందులో గూస్బె్ర్రీ అనేది ఒక గొప్పసహజ పదార్థం..ఒక కప్పు గూస్బె్ర్రీ, షికాకా పౌడర్ గోరువెచ్చని నీటిలో కలుపుకుని.. 2గంటల తర్వాత తలకు అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రంగా తల కడుక్కోవాలి. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా బలంగా తయారవుతుంది. వైట్ హెయిర్స్ కూడా తగ్గే చాన్స్ ఉంది. మెంతులు కూడా జుట్టుకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి.
మెంతులను పొడి చేసుకుని నీటిలో లేదా నూనెలో కలుపుకుని తలకు అప్లై చేసుకుని 30నిమిషాల తర్వాత కడుక్కంటే కుదుళ్లు మెరిసిపోతాయి. అధిక చుండ్రు సమస్యకు వేపాకుతో చేసిన ప్యాక్ బాగా పనిచేస్తుంది. వేప యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుంది.ఇది కూడా అప్లై చేసుకుని కాసేపయ్యాక కడిగేసుకోవాలి. అదేవిధంగా, ఉసిరిపోడి, కుంకుడు కాయ పొడి, బ్రహ్మీ ఆకుల పౌడర్, మందార ఆకులు లేదా పూలను ఎండబెట్టి చేసిన పొడి.. ఉల్లిపాయ నుంచి తీసిన రసాన్ని నూనెలో కలిసి తరచు రాసుకుంటే చుండ్రు తగ్గిపోయి హెయిల్ ఫాల్ సమస్య తగ్గుతుంది.