Acidity : ఎసిడిటీ ఇబ్బంది పెడుతోందా… వీటితో చెక్ పెట్టండి..

Acidity :  టైంకు తినకపోవడం.. అతిగా తినడం మొదలైనవన్నీ ఎసిడిటీకి కారణమవుతాయి. పలు రకాల ఆసనాలు వేయడం వల్ల ఈ ప్రాబ్లమ్‌కు చెక్ పెట్టొచ్చు. వాస్తవానికి యోగా వల్ల మనకు అనేక ఉపయోగాలున్నాయి. ప్రతి రోజు యోగా చేస్తే ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ దూరమవుతాయి. స్ట్రెస్‌ను తగ్గించుకునేందుకు సైతం యోగా ఉపయోగపడుతుంది.

ఎసిడిటీ ప్రాబ్లమ్‌కు చెక్ పెట్టేందుకు ఉపయోగపడే ఆసనాల్లో మొదటిది పశ్చిమోత్తాసన.. ఈ ఆసనం అబ్డామినల్ ఆర్గాన్స్‌కు చాలా యూజ్ అవుతుంది. అజీర్తి ప్రాబ్లమ్స్‌కు సైతం తగ్గిస్తుంది. లేడీస్ ఈ ఆసనాన్ని రెగ్యులర్‌గా చేస్తే మెనుస్ట్రువల్ సైకిల్‌‌కు సైతం యూజ్ అవుతుంది.  ఇక మరోక ఆసనం హాలాసన.. ఇది సైతం చాలా ఇంపార్టెంట్ ఆసనమే. నాగలిని సంస్కృతంలో హల అని పిలుస్తారు. ఈ ఆసనం చేయడం వల్ల భుజాలు, వెనుక మజిల్స్ చాలా ఫ్రీగా మారుతాయి.

acidity problem solution in telugu
acidity problem solution in telugu

ఈ ఆసనం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. వెయిట్ లాస్ అయ్యేందుకు సైతం ఈ ఆసనం యూజ్ అవుతుంది. ఇక మరొకటి వజ్రాసనం.. ఇది ఆరోగ్యానికి చాలా లాభం చేకూరుస్తుంది. రెగ్యులర్‌గా తిన్న తర్వాత చేస్తే చాలా మంచిదట. దీని వల్ల ఎసిడిటీ వంటి ప్రాబ్లమ్స్ రావని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ ప్రక్రియకు ఇది ఎంతగానే హెల్ప్ చేస్తుంది.

ఇక పవనముక్తాసనం విషయానికి వస్తే.. ఇది కూడా చాలా పనికొచ్చే ఆసనమే. ఎసిడిటీని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది. అజీర్తి ప్రాబ్లమ్స్‌ను సైతం దూరం చేస్తుంది. కడుపులో ఉండే ఇతర ఆర్గాన్స్‌ను స్ట్రాంగ్ గా తయారుచేస్తుంది. స్ట్రెస్‌ను తగ్గించుకునేందుకు ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. ఇక మరో ఆసనం..

ఉష్ట్రాసన.. డైజేషన్ కోసం ఇది చాలా యూజ్ అవుతుంది. స్టమక్, నెక్ భాగాల్లోనూ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఎసిడిటీని తగ్గించేందుకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఇక వీటితో పాటు కపాలభాతి ప్రాణాయామం చేయడంతో పాటు ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల కూడా డైజెషన్ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు.

Read Also : Health Fitness : వ్యాయామం చేశాక అలా చేయడం మస్ట్.. లేదంటే ఇబ్బందులు తప్పవు!

Leave a Comment