Strawberry : స్ట్రాబెర్రీస్‌ను తినే ముందు ఇలా చేయండి.. లేదంటే డేంజరే..

Strawberry :  స్ట్రాబెర్రీస్.. ఇవి మనకు ఎక్కువగా దొరికే ఫ్రూట్‌లో ఒకటి. సమ్మర్‌లో చాలా మంది వీటిని జ్యూస్ చేసుకుని తాగేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఇక చిన్న పిల్లలు వీటిని ఎంత ఇష్టంగా తింటారు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వీటిని చాలా మంది ట్యాప్ వాటర్ కింద కడిగి తింటూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఏ ఫ్రూట్స్‌ను అయినా ముందుకు ఉప్పునీటిలో ఉంచాలి. ఈ విషయంలో మనలో ఎక్కువ మందికి తెలియదు.

Strawberry : how to wash strawberries before eating
Strawberry : how to wash strawberries before eating

మరి వీటిని ఎందుకు ఉప్పునీటిలోనే ఉంచాలి అనే ప్రశ్న మీకు రావడం సహజమే.. మామూలుగా ఫ్రూట్స్‌లో పురుగులు ఉండటం మనం చూస్తూనే ఉంటాం. అందుకే స్ట్రాబెర్రీస్‌ను తీసుకొచ్చాక.. ముందుగా కాసేపు ఉప్పు నీటిలో ఉంచాలి. దీంతో అందులో ఉంటే చిన్న చిన్ని పురుగులు బయటకు వచ్చేస్తాయి. అలా చేయకుండా మనం ఊరికెనే తినేస్తే పురుగులు సైతం మన కడుపులోకి వెళ్లిపోతాయి. పండ్లను కొనుగోలు చేసి తీసుకువచ్చాక.. ఒక బౌల్‌లో నీటిని తీసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసి కరగనివ్వాలి.

తర్వాత మనం తీసుకొచ్చిన స్ట్రాబెర్రీస్‌ను అందులో సుమారు ఒక అరగంట పాటు ఉంచాలి. ఇలా ఉంచితే అందులో ఉన్న పురుగులు బయటకు రావడం మనం చూడొచ్చు. ఇలా చేయడం వల్ల పండ్లపై ఉన్న హానికరమైన రసాయనాలతో పాటు పురుగుల సైతం ఫ్రూట్స్ నుంచి దూరమవుతాయి. తర్వాత ఆ ఫ్రూట్స్‌ను తినడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంత సమయం ఎవరు కేటాయిస్తారు అని కాస్త బద్దకంగా బిహేవ్ చేస్తే పురుగులను తినాల్సి వస్తుంది. సో ఫ్రూట్స్ తినే ముందు ఇలాంటి టిప్స్ పాటిస్తే ఆరోగ్యంతో పాటు పురుగులు లేని పండ్లను తీసుకునే ఆస్కారం ఉంటుంది. ఇలా అన్ని ఫ్రూట్స్‌ను ఉప్పు నీటితో కడిగితే బెటర్.

Read Also :  Teeth Whitening Tips : దంతాలు తెల్లగా మిళమిళ మెరిసిపోవాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవండి..

Leave a Comment