Teeth whitening tips and tricks : ముఖం అందంగా కనబడినప్పటికీ పళ్లు సరిగా లేకపోయినా వాటి కలర్‌లో ఏ మాత్రం తేడా ఉన్నా మనం మాట్లాడుతున్నపుడు ఈజీగా తెలిసిపోతుంది. ఈ క్రమంలో మనం మన ఆరోగ్యంతో పాటు దంతాల ఆరోగ్యంపైన కూడా దృష్టి సారించాలి. దంతాలు మిళ మిళ మెరిసిపోయేలా చూసుకోవాలి. అయితే, అలా పళ్లు నీట్‌గా కనబడేందుకుగాను ట్రీట్‌మెంట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంగ్లిష్ మెడిసిన్స్ కూడా అస్సలు అక్కర్లేదు. సహజ సిద్ధమైన, సురక్షితమైన ఈ చిట్కాలు పాటించండి చాలు.. మీ దంతాలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు మిళ మిళ మెరిసిపోతాయి.
చాలా మంది చక్కటి తెల్లగా మెరిసిపోయే దంతాలను చూసి ఇష్టపడుతుండటం మనం చూడొచ్చు. అయితే, ఇందుకుగాను పళ్లను వారు ప్రతీ రోజు రెండు సార్లు తోముకుంటూ ఉంటారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఉరుకుల పరుగుల జీవనంలో చాలా మందికి ఒక్క సారి పళ్లు తోముకోవడం కష్టమైపోయింది. ఇక వారు రెండు సార్లు పళ్లు టైమ్ కేటాయించి మరి తోముకోవడం కష్టమే. ఈ క్రమంలోనే తోమే ఒక్కసారైనా శ్రద్ధగా తోముకోవడం మంచిది. చాలా మందిలో పళ్లు పసుపు వర్ణంలోకి మారడం మనం చూడొచ్చు. ఇందుకు ప్రధాన కారణం వారు కాఫీ, సోడా ఎక్కువగా తీసుకుంటూ ఉండటం. పసుపు వర్ణాన్ని తొలగించుకునేందుకుగాను వారు కాఫీ, సోడాలను లిమిటెడ్‌గా తీసుకోవాలి లేదా మానేయాలి.
రెండు సార్లు బ్రష్ తప్పనిసరి :
ఒకసారి బ్రష్ చేసుకోవడం అందరు చేస్తుంటారు. అయితే, టీత్ హెల్త్ పట్ల ఇంట్రెస్ట్ ఉండి, వాటిని ఇంకా ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకునే వారు మాత్రమే టీత్‌ను డెయిలీ టూ టైమ్స్ బ్రష్ చేస్తుంటారు. అలా మీరు మీ దంతాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు, తెల్లగా మెరిసేలా చేసుకునేందుకుగాను ప్రతీ రోజు రెండు సార్లు బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇకపోతే చాలా సార్లు ఆకలిగా ఉండటం వల్లో లేదా ఏదో పనిలో పడి ఆతురతగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో సరిగా బ్రష్ చేసుకోం.
అలా చేయడం వల్ల పళ్లు సరిగా క్లీన్ కావు. అటువంటి సందర్భాల్లో వీలును బట్టి ఫైబర్ అధికంగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం చాలా మంచిది. అలా చేయడం వల్ల మీ దంతాలు ఆటోమేటిక్‌గా క్లీన్ అయిపోతాయి. విటమిన్ సి సమృద్ధిగా ఉండే నిమ్మ, స్ట్రాబెర్రి, కివి మీ దంతాలను క్లీన్ చేయడంతో పాటు వాటిని బలోపేతం చేస్తాయి. ఇక యాపిల్ ఫ్రూట్ మీ నోటిలో లాలాజలం ఉత్పత్తికి సహకరిస్తుంది. పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల మీ టీత్‌కు హెల్ప్ అవుతుంది.
పచ్చి కూరగాయలతో పళ్లు క్లీన్ :
కొన్ని కూరగాయలను పచ్చిగా తినడం వల్ల కూడా పళ్లు ఆటోమేటిక్‌గా క్లీన్ అయిపోతాయి. ఆ వెజిటేబుల్స్ ఏంటంటే..గుమ్మడి, క్యారెట్ వీటిని పచ్చిగా ఉన్నప్పుడే తినడం వల్ల ఇవి పళ్ల మధ్య ఉన్న బ్యాక్టీరియాను సహజ సిద్ధంగా క్లీన్ చేసేస్తాయి. తద్వారా మీ పళ్లు క్లీన్ అండ్ వైట్ అయిపోతాయి. ఇకపోతే నిమ్మ పండు సిట్రస్ యాసిడ్ అధికంగా కలిగి ఉన్న ఫ్రూట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. కరోనా నేపథ్యంలో ప్రతీ ఒక్కరు నిమ్మ పండు రసం తీసుకోవడానికి ముందుకొచ్చారు. నిమ్మ పండ్లకు గిరాకీ కూడా బాగా పెరిగింది. కాగా నిమ్మ వల్ల దంతాలు తళ తళ లాడిపోతాయి.
అయితే, నిమ్మ రసానికి ఉప్పు చేర్చి ఆ మిశ్రమంతో పండ్లను తోముకుంటే మంచి ఫలితముంటుంది. అయితే, ఈ మిశ్రమంతో పళ్లు తోముకుంటున్న క్రమంలో మీకు నోరంతా పుల్లగా అనిపించొచ్చు. కానీ, ఒక రెండు లేదా మూడు రోజులు బ్రష్ చేసుకుంటే చాలు.. మీకు అలానే అలవాటు అయిపోతుంది. దంతాలు కూడా తెల్లగా మెరిసిపోతాయి. ఇకపోతే రెండు లేదా మూడు నెలలకొకసారి మీరు టూత్ బ్రష్‌ను తప్పక మార్చాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల మీకు మంచి ఫలితం ఉంటుంది.
ట్రూత్ బ్రష్ రెగ్యులర్‌గా మార్చాలి :
టూత్ బ్రష్‌ను మీరు చాలాకాలం పాటు మార్చకుండా ఉంటే దంతాలపై ఉండే ఎనామిల్ పాడైపోయి మీ దంతాల మీద మరకాలు ఏర్పడే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు టూత్ బ్రష్ ను రెగ్యులర్‌గా మార్చాలి. ఇక మీరు దంతాలను శుభ్రం చేసుకునే బ్రష్‌లను సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచాలి. టాయిలెట్స్‌కు కనీసంగా ఆరు అడుగుల దూరంలో ఉంచాలి. చాలా మంది కంబైన్డ్ బాత్రూమ్ ప్లస్ లెట్రిన్ ఉన్న ప్రదేశంలోనే టూత్ బ్రష్‌లు పెడుతుండటం మనం చూడొచ్చు. కానీ, అలా పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల మీకే నష్టం జరుగుతుంది. దంత పరిశుభ్రత అనేది ఉండబోదు. గాలిలో ప్రయాణించే కణాలు వచ్చి ఆ టూత్ బ్రష్‌లో వాలి ఉండొచ్చు. ఫలితంటా మీ దంతాలు క్లీన్ అస్సలు కాకపోగా వేరే కలర్‌లోకి మారిపోయే చాన్సెస్ ఉంటాయి.
కాబట్టి ఈ జాగ్రత్తను ప్రతీ ఒక్కరు పాటించాల్సి ఉంటుంది. కనీసంగా ఆరు అడుగుల దూరం ఇంకా ఎక్కువ దూరం ఉన్నా పర్లేదు. ప్రతీ ఒక్కరు వారి టూత్ బ్రషెస్‌ను బాత్రూంకు చాలా దూరంగా ఉంచుకోవాలి. ఇకపోతే పూదీనాతో తయారు చేయబడిన పేస్ట్ వాడటం వల్ల చాలా తొందరగా పళ్లు తెల్లగా అవుతాయి. ఇది మీరు వాడిన తర్వాతనే అర్థమవుతుంది. ఒకసారి వాడి చూసి సానుకూల ఫలితాలు వస్తే కంటిన్యూ చేయొచ్చు. లేదా మీరు మళ్లీ టూత్ పేస్ట్ చేంజ్ చేసుకోవచ్చు కూడా. అయితే, పూదీనాతో తయారు చేయబడిన పేస్ట్ ద్వారా పళ్లు తెల్లగా మారిపోవడం వెంటనే అయితే జరిగిపోదు. కొంత కాలం తర్వాత పళ్లు తెల్లగా మారుతాయి.