Shani Dev Puja : శనివారం ఈ పనులు చేస్తే.. ఈ దోషాలు పోయి బోలెడు లాభాలు..

Shani Dev Puja :  వారంలో ప్రతీ రోజుకు ఒక దేవుడు ఉంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా, శనివారం ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. ఈ రోజు శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తే కనుక ఈ లాభాలు కలుగుతాయట. అవేంటో తెలుసుకుందాం.. శనివారం రోజున శనిదేవుడికి ఇలా పూజలు చేయడం వల్ల చెడు దృష్టి తొలగిపోతుందట. ఈ పూజల ఫలితం వల్ల మీరు దేనినైనా ఎదుర్కొనే ధైర్యం కలుగుతుంది. అన్ని బాధల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. శనిదేవుడు తనను పూజించిన ప్రతీ ఒక్కరికి అనుగ్రహం ప్రసాదించడమే కాదు…

how to worship shani dev puja on saturday benefits in telugu
how to worship shani dev puja on saturday benefits in telugu

వారిని బాధల నుంచి విముక్తి కల్పిస్తాడట. జనరల్‌గా ఏదేని విషయమై మీరు అనుకున్న పని జరగకపోతే మీకు శనిదేవుడి అనుగ్రహం లేదని అంటుంటారు. ఈ నేపథ్యంలోనే శనిదేవుడికి మనసులోనే పూజలు చేసుకుంటారు చాలా మంది. శని దేవుడు కోపం తెచ్చుకోవద్దని కోరుకుంటుంటారు. దయ కలిగిన శనిదేవుడు భక్తులపై ఎంతో దయను కలిగి ఉంటాడు..

తనను తలుచుకున్న మాత్రం చేతనే వారికి లాభాలు చేకూరుస్తాడాట. అటువంటిది ప్రత్యేకమైన పూజలు చేస్తే కనుక వారి బాధల నుంచి సంపూర్ణమైన స్వేచ్ఛను ప్రసాదిస్తాడట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..శని దేవుడిని ఆరాధిస్తే మీకు సంపద, ఆస్తి కలగడంతో పాటు ఉన్న సంపద, ఆస్తి అలానే ఉండిపోతుందట. దాంతో పాటు శని దేవుడు మీ పట్ల దయతలచి మీ దోషాలను నివారిస్తాడు.

శనివారం రోజున రావి చెట్టు నీటిలో పాలతో పాటు చక్కెరను కలపాలి. దాంతో పాటు నూనెతో దీపాన్ని వెలిగించాలి. అలా చేయడం వలన శనిదేవుడి దయ మీపై ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగిపోయి మీరు ఆర్థికంగా రాణిస్తారు. ఇకపోతే శనివారం రోజున ఎరుపు మిరియాల స్థానంలో నలుపు రంగు మిరియాలను ఉపయోగించడంతో పాటు ఆహారంలోనూ నలుపు ఉప్పు ఉపయోగిస్తే దురదృష్టం తొలగిపోతుందట. శని భగవానుడి అనుగ్రహం లభిస్తుంది.

Read Also : Peepul Tree : ఇంట్లో రావి చెట్టును అస్సలు పెంచకూడదట.. ఒకవేళ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..!

Leave a Comment