Kidney Problem : నేటి సమాజంలో చాలా మంది ప్రతీ చిన్న విషయానికే ఆస్పత్రి మెట్లు ఎక్కుతున్నాడు.ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య కొందరిని వేధిస్తుంటుంది. దానికి ప్రస్తుత జీవనశైలే కారణంగా తెలుస్తోంది. ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, టెన్షన్, ఒత్తిడి, మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా కారణం కావొచ్చు.ఇకపోతే చాలా మంది చిన్న వయస్సులోనే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
మనదేశంలో ప్రతి ఏటా మూడున్నర కోట్ల మందికి పైగా డయాలసిస్ చేయించుకుంటున్నారని లెక్కలు చెబుతున్నాయి. ‘ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్’రిపోర్టు ప్రకారం..దేశ జనాభాలో 10 శాతం మంది దీర్ఘకాలిక కిడ్నీల వ్యాధితో బాధపడుతున్నారని తెలిసింది.
మహిళలు, పురుషులు కిడ్నీలు మెరుగ్గా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీల వ్యాధిని ఎలా గుర్తించాలంటే.. నడుం నొప్పి వచ్చినా, మూత్రం తరచూ రంగు మారుతున్నా, టాయ్ లెట్ వెళ్లేటప్పుడు ఇబ్బందులు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కాళ్లవాపు బాగా ఉన్నా కిడ్నీల పనితీరు సరిగా లేనట్టే అని భావించాలి. కిడ్నీలు చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుందట. తరచు వికారం, వాంతులు చేసుకోవడం లాంటివి జరుగుతాయి. కిడ్నీలు చెడిపోతే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఆగిపోతుంది. కిడ్నీలో ఇన్‌ఫెక్షన్లు, రాళ్లు ఏర్పుడుతుంటాయి. కిడ్నీలు ఉండే ప్రదేశంలో తరచూ నొప్పి వస్తుంటుంది.
కిడ్నీలు ఆరోగ్యంగా, వాటి పనితీరు మెరుగ్గా ఉండాలంటే.. ప్రతీరోజు 7 నుంచి 8 గ్లాసుల నీరు తీసుకోవాలి. విటమిన్ ఎ, సీ, పోటాషియం ఎక్కువగా ఉన్న ఆహారం, పండ్లు తీసుకోవాలి. వెల్లుల్లి తప్పుకుండా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఫైబర్, విటమిన్లు, ఇతర పోషకాలు అధికంగా ఉండే ఫుడ్ తప్పనిసరి. మూత్రం వచ్చినపుడు ఆపుకోకుండా వెంటనే వెళ్లాలి. ఆపుకుంటే మూత్రపిండాల్లో మలినాలు చేరి వాపురావడం, అధికంగా నడుపునొప్పి రావడం జరుగుతుంది.