Sleep Late : మీరు రాత్రి టైంకు పడుకోవడం లేదా.. మీ గుండె డేంజర్‌లో ఉన్నట్టే.. జాగ్రత్త…!

Sleep Late : ఒకప్పుడు చాలా తక్కువ మంది గుండెకు సంబంధించిన వ్యాధులకు గురవుతుండే వారు. కానీ ప్రస్తుతం వయస్సుతో నిమిత్తం లేకుండా చాలా మందిలో గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. ఇందుకు కారణం.. ప్రస్తుతం మారిన వర్కింగ్ కల్చర్.. లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లే. పస్తుతం ఉరుకులు పురుగుల జీవితంలో మనిషి యంత్రంలా మారిపోయాడు. దీంతో టైంకు ఆహారం, నిద్ర ఉండటం లేదు. ఇక నైట్ టైంలో డ్యూటీ చేసే వారైతే నిద్రలేమితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Sleep Late _ Do you Sleep late_ It could be bad for your heart
Sleep Late _ Do you Sleep late_ It could be bad for your heart

ఈ కాలంలో చాలా మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. సమయానికి నిద్రపోకపోవడం వల్లే ఇలా గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తాయని చెబుతున్నారు వైద్యులు. ఇక గుండెనొప్పికి గురవున్న వారి సంఖ్య సైతం పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే గుండె పోటు వచ్చేది. అది కూడా చాలా తక్కువ మందికి. కానీ ప్రస్తుతం చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా మందికి హార్ట్ ఎటాక్ వస్తుంది. ఇందుకు కారణంగా మానసిక ఒత్తిడి, రాత్రి సమయాల్లో ఆలస్యంగా పడుకోవడం వంటివి కారణమవుతున్నాయి.

Sleep Late _ Do you Sleep late_ It could be bad for your heart
Sleep Late _ Do you Sleep late_ It could be bad for your heart

ముఖ్యంగా నిద్ర ప్రభావం గుండెపై చాలా ఉంటుంది. రాత్రి 10 నుంచి 11 గంటల్లోపు నిద్రపోవాలని సూచిస్తున్నారు ఎక్‌పర్ట్స్. రాత్రుల్లు ఆలస్యంగా నిద్రపోయి ఉదయం ఆలస్యంగా నిద్రలేచే వారిలోనూ గుండె సంబంధిత జబ్బులు తలెత్తే ప్రమాదముంది. దీనిని నివారించేందుకు వీలైనంత ఎక్కువ సమయం నిద్రించాలని చెబుతున్నారు పరిశోధకులు. మరి మీరు ఏటైంలో పడుకుంటాన్నారో చూసుకోండి.. మీ గుండె ఎంత ఆరోగ్యంగా ఉందో ఓ సారి చెక్ చేసుకోండి. ముఖ్యంగా రాత్రులు వర్క్ చేసే వారు జాగ్రత్తగా ఉండటం చాలా అవసమని చెబుతున్నా నిపుణులు.

Read Also : Diabetics Control Tips : షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? మీ గ్లూకోజ్ లెవల్స్ ఒకే మోతాదులో ఉండాలంటే ఇలా చేయండి..

Leave a Comment