Talambralu Chettu : మన చుట్టూ ఉండే మొక్కల గురించి, వాటిలోని ఔషధ గుణాల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో అనారోగ్యం పాలైతే చాలు వెంటనే మెడికల్ షాప్స్‌కు వెళ్లడం ట్యాబ్లెట్స్ వేసుకోవడం చేస్తున్నారు. కొంచెం సీరియస్ అయితే హాస్పిటల్స్‌కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.దీంతో మనకు మొక్కలు, వాటి వలన ఉపయోగాల గురించి తెలిసే చాన్సే లేదు. ఒకప్పుడు ఆస్పత్రులు, ఇలా మెడికల్ దుకాణాలు లేవు కాబట్టి ఏ చిన్న గాయమైనా, జ్వరం వచ్చినా మూలికల వైద్యం పైనే చాలా మంది ఆధారపడేవారు. నేటికి కొందరు ఇంగ్లీషు మందులు వాడటం కంటే ఇంట్లోనే ఆయుర్వేద విధానంలో హోం మేడ్ మెడిసిన్ వాడుతున్నారు. తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.
మొక్కల నుంచి ఔషధ గుణాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. అయితే, వాటిని ఎలా వినియోగించాలనేది మాత్రం మనకు తెలిస్తే చాలు.. వంటింట్లోనే హెల్దీ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. కొంత మందికి ‘తలంబ్రాల’ మొక్కల గురించి తెలియకపోవచ్చు. వీటిని మనం రోడ్డు పక్కన, కాలువలు, చెత్త చెదారం ఉన్న చోట కూడా ఇవి మొలుస్తుంటాయి. చూసేందుకు గుబురుగా రంగురంగుల చిన్నపూలతో ఉంటాయి. వీటి ఆకులు గాజు సీసం లాగా ఉండి గుచ్చుకుంటుంది. ఈ మొక్కను ముఖ్యంగా తామర, గజ్జి వంటి వ్యాధుల నివారణలో వాడుతుంటారు. ఇందులో క్రిమినాశక, యాంటీమైక్రోబయాలజికల్ లక్షణాలు ఉంటాయి.

తద్వారా వెంటనే గాయాలను, నొప్పులను మాయం చేస్తుంది. దీని ఆకులను మెత్తగా నూరి దానికి ఆముదం నూనె కలుపుకుని కీళ్ల నొప్పులు ఉన్న దగ్గర రాసుకుని కట్టుకట్టాలి. ఇలా చేస్తే మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. ఈ చెట్టు ఆకులను నీటిలో మరిగించి నోట్లో పోసుకుని పుకిలించి ఉంచితే గొంతు నొప్పి, దగ్గు తగ్గిపోతుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణగా నిలుస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పి, విరేచనాలను కూడా తగ్గించే శక్తి దీనికి ఉంది. చివరగా దోమలను నివారించడంలో ఉపయోగపడుతుంది. దీని ఆకులను ఎండబెట్టి పొగ బెడితే దోమలు పారిపోతాయి. తలంబ్రాల చెట్టు ఆకుల్లో మిథనాలిక్ అండ్ ఇథనాలిక్ గుణాలు ఉండటం వలన దోమలు, కీటకాలు వెంటనే పారిపోతాయి.