Papaya Seeds : బొప్పాయి ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్. పైగా తక్కువ ధరకు దొరుకుతుంది. ప్రతిరోజు బొప్పాయి తింటే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థాలు పుష్కలంగా అందుతాయి. ఉదర సమస్యలు ఉన్నవారికి బొప్పాయి అమృతంలాంటిది. ఇది పొట్టపేగుల్లో ఉన్న విష పదార్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఎర్ర రక్త కణాల సంఖ్య పెరగాలంటే బొప్పాయిని మించినేది లేదు. పోటాషియం, ప్లేవనాయిడ్స్, మెగ్నిషియం, మినరల్స్, కాపర్, ఫైబర్ లాంటి పోషకాలను అందిస్తారు. బొప్పాయిలో మాత్రమే కాదు.. బొప్పాయి గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే బొప్పాయి గింజలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే కాలేయ సమస్యలు ఉన్నవారు కూడా బొప్పాయి గింజలను ఆహారంలో తీసుకోవచ్చు.

బొప్పాయి గింజలను మెత్తగా పొడి చేసుకోని వాడుకోవచ్చు… లేకపోతే గింజలు అలానే తినవచ్చు. బొప్పాయి సహజ గర్భనిరోధకంగా కూడా పనిచేస్తుంది. గర్భం వద్దనుకునే దంపతులు మందులకు బదులు బొప్పాయి గింజలను తింటే సరిపోతుంది. అయితే ముందుగా డాక్టర్‌ను సంప్రదిస్తే మంచింది.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా బొప్పాయి గింజలను తింటే ఉపశమనం లభిస్తుంది. వారం రోజులు క్రమం తప్పకుండా బొప్పాయి గింజలను తింటే కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా బొప్పాయి గింజలను తింటే సులువుగా బరువు తగ్గుతారు. కొవ్వును కరిగించడంలో బొప్పాయి కీలక పాత్ర పోషిస్తుంది.
Read Also : Fenugreek Benefits : మెంతికూరతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. ఈ సమస్యలు ఉన్నవారు తప్పక తినాల్సిందే..!