Surya Namaskar Mantra : సూర్యుని ఆరాధనకు ఆదివారం చాలామంచిది. రవి అంటే రవివార్ అని కూడా పేరు.. ఆదివారం సూర్యునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ప్రతి ఆదివారం సూర్యుని పూజించడం అలవాటు చేసుకోండి. ప్రపంచానికి వెలుగులు పంచే సూర్యున్ని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే.. సూర్యుని ఆరాధనతో పోగట్టుకోవచ్చు. అలాగే నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. అలాగే సూర్యుడు ప్రపంచానికి ప్రత్యక్ష దైవం కూడా. అందుకే ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేసుకోవడం ఎంతో మంచిది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నిత్యం సూర్యుని ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. జాతకంలో రవి అనుగ్రహం లేనివారిలో కుటుంబంలో కలహాలు కలుగుతుంటాయి. ప్రత్యేకించి తండ్రితో గొడవలు వంటి అనేక సమస్యలు వస్తుంటాయి. రవి స్థానం బలంగా ఉండాలంటే నిత్యం సూర్యున్ని పూజించాలి.
సూర్య అనుగ్రహం కోసం ఇలా :
ప్రతి ఆదివారం ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించాలి. దీపారధన చేయాలి. సూర్యుని అనుగ్రహం కోసం సూర్య అష్టోత్తరం, ఆదిత్య హృదయం శ్లోకాలను పఠించాలి. ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండొచ్చు. రాత్రి సమయంలో గోధుమ రవ్వతో చేసిన పదార్థం సూర్యునికి నైవేద్యంగా ఆరగింపు చేయాలి. ఆ తర్వాతే ఆహారం తీసుకోవాలి. సూర్యునికి జిల్లేడు పూలు, గన్నేరు పూలు అంటే చాలా ఇష్టం.. మీకు దగ్గరలో లభిస్తే ఈ రెండింటితో పూజించండి. ప్రత్యేకించి గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని సూర్యునికి నైవేద్యంగా సమర్పించండి. బియ్యం, బెల్లం, ఆవు పాలు, ఆవునెయ్యితో చేసిన నైవేద్యం సూర్యునికి చాలా ఇష్టం. ఆదివారం రోజు మీకు దగ్గరలో సూర్యుని దేవాలయం ఉంటే వెళ్లి దర్శించుకోండి.
ఆదివార నియమాలు ఇలా? :
సూర్యభగవానుడి అనుగ్రహం పొందాలంటే ఆదివార నియామాలు పాటించాల్సి ఉంటుంది. ఆదివారం పరిహారాలతో ఎలాంటి లాభాలు, ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.. ఆదివారానికి సూర్యభగవానుడు అధిపతిగా చెబుతారు. రవిగ్రహం అని కూడా పిలుస్తారు. మీ జాతకంలో రవి నీచస్థితిలో ఉన్నప్పుడు ఫలితాలు వ్యతిరేక దశలో ఉంటాయి. జన్మకుండలి అనగా జాతకంలో రవి బలహీనంగా ఉన్న సమయంలో సూర్యునికి సంబంధించిన దోషాలు వస్తాయి. తద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి ఇబ్బందులను తగ్గించుకునేందుకు కొన్ని సూర్యభగవానుడి పరిహారాలను ఆచరించడం చేస్తుండాలి. సూర్య అనుగ్రహం కోసం ప్రతిరోజూ సూర్య మంత్రను పఠిస్తుండాలి. అప్పుడు సూర్యుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చు. జాతకంలో మిగతా గ్రహాల స్థితి బాగున్నా రవి స్థితి అనుకూలంగా లేకుంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అందుకే రవి అనుగ్రహం కోసం ఆదివారం పరిహారాలు పాటించాలని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు. సూర్య నమస్కార మంత్రాలను నిత్యం పఠించడం ద్వారా ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఓసారి చూద్దాం..
Surya Namaskar Mantra : సూర్య నమస్కారం మంత్రాన్ని ఇలా జపిస్తే..
జీవితంలో సక్సెస్ సాధించాలంటే? :
సూర్యుని అనుగ్రహం కలిగితే.. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగే ఉద్యోగపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. తలనొప్పి వంటి ఇతరేతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా వెంటనే తొలిగిపోతాయి. సంపద, కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతాయి. వారసత్వపరంగా ఏమైనా ఆస్తుల వివాదాలు గానీ, కోర్టు వంటి వ్యవహారాలు కూడా కొలిక్కి వస్తాయి. శాసించగల అధికారంలో అధికారం లాంటి పవర్ మీ చేతికి అందుతుంది. అందరూ మీమాట వింటారు. మీరు చెప్పింది శాసనం అన్నట్టుగా మారుతుంది. అంతా మీకు అనుకూలంగా మారుతుంది. సూర్యభగవానుడి మంత్రాల్లో ఆదివారం రోజున ఆచరించాల్సిన పరిహారాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా ఆదిత్య హృదయం, ఆదిత్యస్తోత్రమ్, సూర్యకవచం, శ్రీచైతన్య విజయ కవచమ్, శ్రీమహావిద్యా కవచం, శ్రీమాతంగి కవచం, శ్రీ మహావిద్యా కవచం, శ్రీత్రైలోక్య విజయ కవచమ్, త్రిపుర భైరవి కవచం, శ్రీ మహావిద్యా కవచం వంటి పరిహారాలను పాటించాల్సి ఉంటుంది.

సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి :
నిత్యం తెల్లవారుజామున లేచి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది ఒక దినచర్యగా పాటించాలి. ఇలా నిత్యం చేస్తంటే సూర్యుడు చాలా సంతోషిస్తాడు. అలాగే మీకు మానసిక ప్రశాంతతను అందిస్తాడు. అర్ఘ్యం ఇవ్వడమే కాదు.. సూర్య నమస్కారం చేసే సమయంలో ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలని జ్యోతిష పండితులు చెబుతున్నారు. కలిగియుగ ప్రత్యక్షదైవంగా పేరొందిన సూర్యభగవానుడికి నిత్యం సరైన విధానంలో నీటిని సమర్పిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు. మీకు అనుకూలమైన వాతావరణం ఉండేలా చేస్తాడు. ఫలితంగా మీకు మీ కుటంబానికి మంచి ఆరోగ్యం, సంపద చేకూరుతాయి. సూర్యున్ని పూజించాలంటే.. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. వెంటనే స్నానమాచరించాలి. సూర్యోదోయానికి ముందే నిద్ర లేవాలి. సూర్యోదయానికి ముందే మేల్కొంటే చాలా మంచిది. స్నానం చేసిన తర్వాత శుద్ధి చేసిన బట్టలను ధరించాల్సి ఉంటుంది. ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్య కిరణాలు మరింత వేడిగా ఉండకూడదు. నేరేడు సూర్య కిరణాలు ఉన్నప్పుడే ఇలా చేయాలి. తద్వారా మంచి ఆరోగ్యంతో పాటు అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
ఈ మంత్రాన్ని ఇలా జపించండి :
సూర్యునికి అర్ఘ్యం ఇచ్చే సమయంలో చేతులను సాధ్యమైనంతవరకు పైకి లేపాలి. సూర్యుడి నుంచి వచ్చే ఏడు కిరణాలు మీ శరీరంపై పడతాయి. అప్పుడే నవగ్రహాల ఆశీర్వాదం కూడా పొందవచ్చు. “ఓం నమో సూర్యాయ నమ:” అంటూ మంత్రాన్ని జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి నీటిని వదలాలి. మీ జాతకంలో సూర్యుడు స్థితి బలహీనంగా ఉంటే.. ఆర్థికపరమైన, అనారోగ్యపర సమస్యలను వస్తుంటాయి. అందుకే సూర్యునికి నిత్యం ఆర్ఘ్యం ఇవ్వడం వల్ల అనుకూల శక్తి లభిస్తుంది. తద్వారా మీ ఇబ్బందులన్నీ ఒక్కొక్కటిగా తొలిగిపోతాయి. శీతల ప్రదేశాల్లో ఉండే వారికి సూర్యుడు కనిపించడు. మరి సూర్య నమస్కారం ఎలా చేయాలంటే.. ఉదయం లేవగానే ప్రతిరోజూ సూర్యోదయం అయ్యే దిక్కులో అర్ఘ్యం ఇవ్వడం చేస్తుంటే చాలు.. కొంతమందికి స్నానమాచరించే పరిస్థితి ఉండదు. అలాంటి అప్పుడు కాళ్లు, ముఖం, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పరిశుభ్రమైన బట్టలను ధరించి సూర్య నమస్కారం ఆచరించుకోవచ్చు.