Lemon Remedy : గుడిలో అమ్మవార్లకు భక్తులు నిమ్మకాయ దండలు వేస్తారు. అమ్మవారికి 108 నిమ్మకాయల మాల చాలా ప్రీతి.. దుర్గాదేవికి రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు పెట్టడం వల్ల అనేక అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. నిమ్మకాయల దీపం… అంటే పార్వతి దేవికి ప్రీతి.. నిమ్మకాయల మాల, నిమ్మకాయల దీపం పెట్టుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది. మీరు ప్రతినిత్యం పూజ చేసే విధంగా పూజ చేసి ఆ తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని మీ ఇంట్లో దుర్గాదేవి (ఫొటో లేదా విగ్రహం)ని పూలతో అలంకరించి నిమ్మకాయ పెట్టి కుంకుమతో అర్చన చేయాలి.
అదే సమయంలో 108 సార్లు ‘ఓం దుర్గాయై నమః’ అనే ఈ నామంతో పూజ చేసి (పండ్లు) లేదా నైవేద్యం పెట్టాలి. మీ సంకల్పాన్ని మనసులో అమ్మవారికి చెప్పుకుని నమ్మకంతో పూజ చేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయకు ఎర్ర దారం లేదా పసుపు పచ్చ దారాన్ని 3 లేదా 9 రౌండ్లు చుట్టి ముడి వేయాలి. అలా చేయడం వల్ల బంధనం ఏర్పడుతుంది. తద్వారా పూజ చేసినవారికి అమ్మవారి శక్తి లభిస్తుంది. ఇలా పూజ చేసిన ఆ నిమ్మకాయను మీ జేబులో పెట్టుకోవడం లేదా వ్యాపార స్థలాల దగ్గర షాపుకి కట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లేదా షాపులో నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది.
నరదిష్టికి నాపరాయి పగులుతుంది అంటారు. అలాంటి నరదిష్టి, దిష్టి దోషం, మనపై ఏడ్చే వారి దిష్టి ఉండదు. ప్రతికూల శక్తి ప్రభావం మనపై పడదు. ప్రతి శుక్రవారం రాహుకాలంలో ఈ నిమ్మకాయ రెమిడీ చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. (రాహుకాలం 10:30 నుంచి 12 గంటలు) మధ్యలో అలా వారానికి ఒకసారి నిమ్మకాయని మారుస్తూ ఉండండి. అనుకున్న పనులు అవ్వట్లేదు అనుకునేవాళ్లు రెండు నిమ్మకాయలతో రెమిడి చేసి చూడండి. ఆ తర్వాత వచ్చే అద్భుతమైన ఫలితాలను మీరు ఊహించలేరు.
![Lemon Remedy](https://mearogyam.com/wp-content/uploads/2023/04/Lemon-Remedy-1.jpg)
Lemon Remedy : నిమ్మకాయతో ఇలా పూజ చేస్తే.. ఎలాంటి కోరిక అయినా ఇట్టే తీరిపోతుంది..
ఒకటి నిమ్మకాయపై పసుపుతో ‘ఓం మహాగణాధిపతయే నమః మరొకటి నిమ్మకాయపై ఓం దుర్గాయే నమః అని కుంకుమార్చన 108సార్లు చేసి దారంతో మూడుసార్లు లేదా తొమ్మిది సార్లు చుట్టాలి. దీనిని జేబులో ఉంచుకోవాలి. నిమ్మకాయతో ఇలా చేస్తే మీ ఇంటిలో, మీ ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి వారం రోజుల్లో మీ జీవితంలో అద్భుత మార్పులు వస్తాయి.( ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి నిమ్మకాయ వేసి నీళ్లు కలర్ చేంజ్ అయిన తర్వాత అలా మారుస్తూ ఉండాలి. ఇలా వ్యాపార స్థలాల దగ్గర చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది).
మంగళవారం రోజు ఒక బౌల్ తీసుకొని అందులో కుంకుమ కొన్ని నీళ్లు పోసి కలిపి కొంచెం కాటుక నీళ్లు కలిపాలి. ఆ తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకుని ఒక నిమ్మకాయకి తడి కుంకుమ మరో నిమ్మకాయకి కాటుక పూయాలి. చేతిలో పట్టుకొని ఇంటికి ఇలా దిష్టి తీయాలి. ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. ఎవరి తొక్కనిచోట లేదా చెట్టు మొదల్లో వేయాలి. ఇంటికి వచ్చి కాళ్లు చేతులు కడుక్కొని ఇంటి లోపటికి వెళ్లాలి.
ఇంటి గుమ్మానికి నిమ్మకాయ మిర్చి దండలను దిష్టి దోషాలను ఇట్లే తగ్గిస్తాయి. అమావాస్యకి ఎదుటివాళ్ళ దృష్టి మీ కుటుంబం మీద పడకుండా ఉండాలంటే సాయంత్రం నిమ్మకాయ పరిహారంగా ఇంటికి దిష్టి తీయాలి. నిమ్మకాయను మధ్యగా రెండు భాగాలు చేసి.. ఒక నిమ్మకాయ భాగానికి కుంకమను వేసి.. మరో భాగానికి పసుపును వేసి రెండింటిని మీ ఇంటి గుమ్మం ముందు రెండు వైపులా పెట్టాలి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఎలాంటి నెగటివ్ ఎనర్జీ రాకుండా నివారిస్తుంది.
Read Also : Brahma Muhurta : బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? బ్రహ్మ ముహూర్తంలో చేసే పనులు నిజంగా నెరవేరుతాయా?