Girls Fall in Love : ప్రేమ.. ఇదొక గొప్ప అనుభూతి.. ఎవరిలో, ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. కొంత మంది రోజూ తమ చుట్టు ఉన్న వారిని చూస్తున్నా.. ఎవరితో లవ్‌లో పడరు. కానీ మరి కొందరు చూసిన వెంటనే ప్రేమలో పడిపోతారు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు పెద్దలు ప్రేమకు అడ్డుపడుతూనే ఉన్న ప్రేమికులు మాత్రం తమ ప్రేమను బతికించుకుంటూనే ఉన్నారు. నాటి నిజజీవితంలో జరిగిన కథల నుంచి నేటి సినిమా కథల వరకు అన్నింటిలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న అంశం ప్రేమే. యూత్‌ను కట్టిపడేసే విషయంలోనే ప్రస్తుత సినీ డైరెక్టర్లు ఎక్కువగా ప్రేమ కథలపైనే దృష్టి సారిస్తున్నారు. లైలా, మజ్నూ, పార్వతి, దేవదాసు, సలీం, అనార్కలి ఇలా ప్రేమ విషయంలో చరిత్రలో నిలిచిపోయిన వారు ఎందరో.. వారి ప్రేమ కథలు ఎందరికో స్ఫూర్తి నిస్తాయి. ప్రేమ విషయంలో ఒక్కొక్కరి తీరు ఒక్కోలా ఉంటుంది. కొందరు టైంపాస్ కోసం ప్రేమ పేరును అడ్డం పెట్టుకుంటారు. మరి కొందరు ప్రేమనే శాశ్వతం అంటూ భావిస్తుంటారు.
నిజానికి తమ భాగస్వామితో ఎవరు ఎంతో ప్రేమగా ఉంటారనేది వారికే తెలుసు. నిజంగా ఒక మనసుకు ప్రేమించే మనసు దొరికితే ఆ జీవితం స్వర్గమనే చెప్పాలి. ఎలాంటి గొడవలు, మనస్పర్థలు లేకుండా జీవితాన్ని హ్యాపీగా గడిపేయొచ్చు. అలా కాంకుండా ప్రేమను అడ్డుపెట్టుకుని తన పార్ట్‌నర్‌ను సాధించాలని చూస్తే అలాంటి వైవాహిక జీవితం ఎన్నో ఏండ్లు నిలవదు. అందుకే అంటారు.. ప్రేమించి మనిషి దొరకడం కన్నా అదృష్టం మరొకటి ఉండదని. నిజమేమరి.. అయితే జోతిష్య శాస్త్రం ప్రకారం ఐదు రాశుల అమ్మాయిలు.. తమకు నచ్చిన వారు కనిపిస్తే తొలిచూపులోనే ఎదుటి వారికి తమ హృదయాన్ని, మనసును ఇస్తారట. వారి ప్రేమను జీవితాంతం కావాలని కోరుకుంటారట. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రాశివారు (zodiac signs ) ఎవరో చూద్దాం.

కర్కటం, సింహం, మేషం, మిథునం, తుల రాశివారు (Astrological sign )ఈ క్యాటగిరీకి చెందిన వారు మరి వీరిలో మొదటగా కర్కటం వారి గురించి తెలుసుకుందాం. వీరికి లవ్ విషయంలో ఎవరితోనూ పోలిక ఉండదు. వీరు మెంట్ గా స్ట్రాంగ్ ఉన్నప్పటికినీ లవ్ మాటర్ లో మాత్రం వీరు మనస్తత్వం కాస్త సున్నితంగానే ఉంటుంది. తమ పార్టనర్ ను సంతోషంగా ఉంచేందుకు, ప్రేమజీవితంలో అనుకూలతలు కాపుడుకునేందుకు కాస్త కొంటె, తుంటరి పనులు చేస్తారు. ఈ రాశికి చెందిన అమ్మాయి.లు తమ పార్ట్‌నర్‌తో అసలు గొడవపడరు. ఎదుటివారు సైతం ఇదే తరహాలో తమను కూడా శ్రద్ధగా, ప్రేమగా చూసుకోవాలని అనుకుంటారు. వీరు ప్రేమకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు.
ఇక సింహరాశికి చెందిన వారి విషయానికి వస్తే ఈ రాశికి చెందిన అమ్మాయిలు చాలా నిజాయితీగా, నిబద్ధతతో ఉంటారు. ఇలాంటి అమ్మాయిలు తమ మనస్సును ఇష్టపడినవారితోనే గడపాలని అనుకుంటారు. ఎప్పుడూ వారితోనే ఉండాలనుకుంటారు. ప్రేమలో వారి అభిరుచి కనిపిస్తుంది. పార్ట్‌నర్‌ను ప్రేమగా చూసుకోవడం, సుఖం, సంతోషాలను అందించడంలోనూ ఎవరితోనూ వీరికి పోలిక ఉండదు. వీరు నిజమైన ప్రేమను చూపుతారు. మొదటి చూపులోనే మనసును, హృదయాన్ని ఇచ్చేస్తారు. మేష రాశి వారి గురించి చెప్పుకుంటే.. ఈ రాశికి (Horoscope People )చెందిన అమ్మాయిలు ఫస్ట్ లుక్ లోనే లవ్ లో పడిపోతారు. ఈ రాశికి (zodiac signs people )చెందిన అమ్మాయిలు ఎప్పుడూ ప్రేమను కోరుకుంటారు. తమ ప్రేమ జీవితం కొత్తగా ఉండాలని భావిస్తారు. పార్టనర్ ను ప్రలోభాలకు గురి చేసేందుకు ఏమైనా చేయగలరు. తమ ప్రేమికులతో టైం స్పెండ్ చేయడం, లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లడం వంటి వాటిపై మక్కువ చూపుతారు. ఈ రాశి అమ్మాయిలకు కోపం తొందరగా వస్తుంది. అంతే తొందరగా కోపం తగ్గుతుంది.
మిథునం రాశికి చెందిన అమ్మాయిలు , అబ్బాయిలు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. ఇతరులను సైతం హ్యాపీగా ఉంచుతారు. లవ్ విషయంలో ఈ రాశికి చెందిన అమ్మాయిలు చాలా ఓపెన్‌మైండ్ తోనే ఉంటారు. తమ పార్ట్‌నర్‌ను హ్యాపీగా ఉంచేందుకు దేనికైనా రెడీ అవుతారు. అంతే కాకుండా ప్రతీక్షణం తమ లవర్‌తో కలిసుండాలని, జీవించాలని ఎక్కువగా ఇష్టపడతారు. కష్టంలోనైనా, సుఖంలోనైనా, సంతోషంలోనైనా, బాధలోనైనా, ప్రేమలోనైనా వాళ్ల పార్ట్‌నర్‌కు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. వారి చెప్పిన మాటలను గౌరవిస్తారు. ఇక ఐదు రాశుల్లో చివరి రాశి తుల. ఈ రాశికి చెందిన అమ్మాయిలు ప్రేమకు బానిసలు అని గుర్తింపు తెచ్చుకుంటారు. హద్దులు లేకుండా తమ పార్ట్‌నర్‌ను ప్రేమిస్తారు. వారితో అంతే అంకితభావంతో మెసులుకుంటారు.
అంతే కాకుండా ఈరాశి అమ్మాయిలు తమ ఆత్మగౌరవానికి సైతం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. వీరి ప్రేమ వ్యవహారంలో ఎవరు జ్యోక్యం చేసుకున్నా సహించరు, ఒప్పుకోరు. ఒకరితో వీరు రిలేషన్‌లో ఉంటారో.. వారినే మనస్ఫూర్తిగా.. ప్రేమిస్తూనే ఉంటారు. వారి లవర్ ఇష్టాలకు విలువను ఇస్తూ వారితో సమయం గడిపేందుకు ఇష్టపడతారు. ఇలా ఈ ఐదు రాశులకు (Horoscope Today Telugu )చెందిన వారు తమ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారనే విషయాన్ని తెలుసుకున్నాం కదా.. మరి ఇందులో మీది ఏ రాశో చూసుకోండి. ప్రతి మనిషి జీవితంలో ప్రేమ అనే ఓ మధుర అనుభవం ఉంటుంది. మీ లవర్ తో మీరు గడిపిన సమయాన్ని, అనుభవాలను, జ్ఞాపకాలను మరోసారి నెమరు వేసుకోండి మరి.
Read Also : Dangerous Zodiac Signs : ఈ రాశి మీదేనా? వీరికి హార్ట్ ఎటాక్స్ ఎక్కువగా వస్తాయట.. మీ రాశి ఉందో చెక్ చేసుకోండి