Negative Energy At Home : ఇంట్లో చిరాకుగా ఉంటుందా? ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుతున్నారా? కుటుంబ సభ్యులతో చిటికిమాటికి దెబ్బలాడుతున్నారా? మానసిక ప్రశాంతత లోపించిందా? ఏది మాట్లాడిన కోపం వస్తుందా? అయితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థం. ఈ సమస్యలతో ప్రతిరోజు ఇబ్బందులు పడుతుంటే మాత్రం నెగటివ్ ఎనర్జీ ప్రభావం అధికంగా ఉందని గమనించాలి. కంటికి కనిపించని ఈ నెగటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి పారదోలి పాజిటివ్ ఎనర్జీని వచ్చేలా చేయాలంటే ఈ 5 powerful tips రెమడీలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
1. ఉప్పు అద్భుతంగా పనిచేస్తుంది :
వంటిట్లో ఉప్పు.. నెగటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది. ఒక గిన్నెలో కొంచెం ఉప్పు తీసుకుని నీళ్లు కలిపండి. ఆ నీటిని ఇంట్లో అన్నిచోట్ల చల్లడం ద్వారా నెగిటివ్ ఎనర్జీని వదిలించుకోవచ్చు. ఇళ్లు తుడిచేటప్పుడు కూడా ఉప్పు నీటితో తుడవడం ద్వారా నెగటివ్ ఎనర్జీని దూరం చేసుకోవచ్చు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు.
2. బయటి గాలి ఇంట్లోకి వచ్చేలా చేయాలి :
ఇంట్లో గాలి బయటకు వెళ్లేలా చూసుకోవాలి. అలాగే బయట గాలి లోపలికి వచ్చేలా చూసుకోవాలి. అప్పుడు ప్రెష్ ఎయిర్ ఇంట్లోకి అవస్తుంది. ఫలితంగా గాలి ఫీల్టర్ అవుతుంది. ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే అది బయటకి పోతుంది. నిద్రలేవగానే ఉదయం ఈ పనిచేయాలి. మూసిన కిటికిలు, తలుపులను తెరిచి ఉంచాలి. స్వచ్ఛమైన గాలి లోపలికి రావడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది.
అప్పుడు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. చాలామంది పగలు కూడా కిటికీలు తలుపులు మూసేసి ఉంచుతారు. అలా ఎప్పటికి చేయకూడదు. తలుపులు కొద్దిసేపు మూసినప్పటికీ కిటికీలు మాత్రం ఎప్పుడూ తెరిచే ఉండాలి. అలా చేయడం ద్వారా బయట గాలి సులభంగా ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది. ఫలితంగా పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుంది. లోపల ఏమైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే అదంతా బయటకు వెళ్లిపోతుంది.
3. సూర్యకాంతి ఇంట్లోకి ప్రసరించాలి :
సూర్యకాంతి ఇంట్లోకి ప్రసరించేలా చూసుకోవాలి. అప్పుడే గాలి, వెలుతూరు ఇంట్లోకి వస్తే.. నెగిటివ్ ఎనర్జీ వెంటనే వెళ్లిపోతుంది. కిటికీలు, తలుపులు తెరవడం ద్వారా సూర్యుని కిరణాలు ఇంట్లోకి ప్రసరిస్తాయి. ఫలితంగా పాజిటివ్ వైబ్రేషన్ జనరేట్ అవుతుంది. అంతేకాదు.. ఏమైనా బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు కూడా ఉంటే నశించిపోతాయి.
సూర్యకాంతి పడినచోట కంటికి కనిపించని ఎన్నో అంతర్గత శక్తులు బయటికి వెళ్లిపోతాయి. చీకటి కమ్మిన చోట ఈ శక్తులు దాగి ఉంటాయి. ఇవే ఇంట్లో మనుషులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటాయి. దీన్నే నెగటివ్ ఎనర్జీగా పిలుస్తారు. ఈ నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించాలంటే ముందుగా ఆ ఇంట్లో స్వచ్ఛమైన గాలితో పాటు మంచి వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
4. దేవుడి నామస్మరణ :
ఇంట్లో ఉదయాన్నే సుప్రభాతం వంటి భగవంతుడి నామస్మరణ ధ్వనించేలా చేయాలి. అప్పుడు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వెంటనే బయటకి వెళ్లిపోతుంది. ఏదైనా ఆహ్లాదకరమైన మ్యూజిక్ కూడా ప్లే చేసుకోవచ్చు. దైవ సంబంధిత మంత్రాలు, పూజగదిలో గంట శబ్ధం వంటివి చేయడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. అంతేకాదు.. మానసికి ప్రశాంతత కూడా లభిస్తుంది. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు.
ఇంట్లో నిత్యం పూజలు చేయడం ద్వారా దైవానుగ్రహం కలుగుతుంది. దైవం ఉన్నచోట దుష్టశక్తులు ఇంట్లోకి రావు. దైవరాధన చేయడం ద్వారా ఇంటిని నెగటివ్ ఎనర్జీ నుంచి దూరంగా ఉంచుకోవచ్చు. దేవుడి పూజలతో పాటు భక్తి శ్లోకాలను జపించడం వంటివి చేయాలి. ఉదయాన్నే లేవగానే తలస్నానం చేసి పూజగదిలో దీపం వెలిగించాలి. అవసరమైతే దేవుడి పాటలు విన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆ రోజుంతా పాజిటివ్ వైబ్రేషన్ కలిగి ఉంటారు.
5. ఇంటిని సువాసనతో నింపేయండి :
ఇంటిని ఎప్పుడూ వెలుతురు ఆవరించి ఉండేలా చూసుకోవాలి. లైట్లు వేసుకోవాలి. అలాగే పూజాగదిలో దీపారాదన వంటివి చేయాలి. అలా చేయడం ద్వారా నెగటివ్ ఎనర్జీని తరిమేస్తుంది. ఇంట్లో మంచి సువాసన వచ్చేలా అగర్ బత్తీలు, దూప్ స్టిక్స్ వెలిగించండి. ప్రతిరోజూ కానీ ఇలా చేస్తుంటే మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ క్రమంగా తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ ఇంట్లో కూడా నెగటివ్ ఎనర్జీ ఉంటే ఈ రెమడీలతో తరిమేయండి.
ఇంట్లో చెడువాసనలు ఉన్నా నెగటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. తద్వారా ఆ ఇంట్లో ఏదో ఒక చిరాకుగా ఉంటుంది. చిటికిమాటికి కోపానికి గురవుతుంటారు. భార్యభర్తలయితే గొడవపడుతుంటారు. పిల్లలు అయితే ప్రతిదానికి ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తారో కూడా అర్థంకాదు.
ఎక్కువగా మారం చేస్తుంటారు. చిరాకు పడుతుంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని గుర్తించాలి. చెడువాసనలు ఇంట్లో లేకుండా చూసుకోవాలి. మంచి సువాసులు వెదజల్లేలా చూడాలి. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నంతసేపు మీలో ఏదో చిరాకు అనిపిస్తుంటుంది. ఇలా చేయడం ద్వారా నెగటివ్ ఎనర్జీ బయటికిపోతుంది.
నెగటివ్ ఎనర్జీ పోయిందని ఇలా గుర్తించవచ్చు :
ఇంట్లో నుంచి నెగటివ్ ఎనర్జీ వెళ్లిపోయిందనడానికి ఇలా గుర్తు పట్టొచ్చు. మీలో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తుంటుంది. మనస్సుకు హాయిగా అనిపిస్తుంటుంది. ఒంట్లో నుంచి ఏదో తెలియని శక్తి బయటకు వెళ్లిపోయిందనే రిలీఫ్ అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ బట్టి మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వెళ్లిపోయిందని గుర్తించవచ్చు.
ఇంట్లో ఎక్కువగా సాంబ్రాణీ వంటి దూపాలు వేస్తుండాలి. అప్పుడు ఏదైనా చెడు వాసనలు ఉంటే వెళ్లిపోతాయి. ఇళ్లంతా సువాసనలతో నింపండి. అలాగే ఇంటిని తుడిచినప్పుడల్లా ఉప్పునీటితో తుడవండి. ఇలా చేస్తే నెగటివ్ ఎనర్జీ వెంటనే వెళ్లిపోతుంది. ఉప్పు నెగటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి ఉంటుందని అందరికి తెలిసిందే..
Read Also : Vastu remedies : మీరెంతో ఇష్టపడే వారితో గొడవలా? ఈ వాస్తు దోషాలు ఉన్నట్టే.. జాగ్రత్త!