Wife Avoiding Husband : మీ పార్టనర్‌కు శృంగారంపై ఆసక్తి తగ్గుతోందా? అయితే దానికి కారణం మీరే కావొచ్చు.. మహిళల్లో శృంగారం అంటే ఇష్టం తగ్గడానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కారణం నిజంగా మీరే భాగస్వామి అయి ఉండొచ్చు.. ఎందుకంటే. భాగస్వామి ప్రవర్తన కారణంగానే రానురాను వారిలో ఈ తరహా పరిస్థితి ఎదురవుతుందని సెక్సాలిజిస్టులు చెబుతున్నారు. సాధారణంగా యువ జంటలు చిన్న విషయాలకే అలకబూనుతుంటారు.. భర్తను దగ్గరకు రానివ్వరు.. దాంతో పురుషులు చాలా ఇబ్బంది పడుతుంటారు. భార్యను నొప్పించలేక… తమలో కోరికను కంట్రోల్ చేసుకోలేక ఆందోళన చెందుతుంటారు.
అవకాశం దొరికితే చాలు.. శృంగారానికి తెగ ఉత్సాహం చూపిస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా భార్య చొరవ చూపరు. ఈ విషయంలో చాలామంది భర్తలు తమ లైంగిక నిపుణులను సంప్రదించి తమ సమస్యను చెబుతుంటారు. పడకగదిలో మహిళలు భాగస్వామితో శృంగారం పట్ల ఆసక్తి లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మహిళలు తమ భాగస్వామిని శృంగారానికి ఎందుకు దూరంగా పెడతారో కారణాలను తెలుసుకుందాం..
ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉండాలి.. ఒకరిపై మరొకరికి ఆకర్షణ ఉండి తీరాలి. ఏదో ఇలా చేసాం.. కానిచ్చేశాం అన్నట్టుగా ఉండకూడదు.. భావోద్వేగ బంధం బలపడాలంటే ఒకరిపై మరొకరికి మధ్య ఆకర్షణ పెరిగేలా చూసుకోవాలి. భాగస్వామితో శృంగారంలో పాల్గొనాలంటే నేరుగా అక్కడికి వెళ్లకూడదు. ముందుగా వారిని శృంగారానికి ప్రేరేపించాలి. వారిలో ఆసక్తిని కలిగేలా ప్రేరణ కలిగించాలి. వారితో శృంగారం కాకుండా వారికి ఇష్టమైన విషయాలను మాట్లాడేందుకు ప్రయత్నించాలి. అలా వారితో సాన్నిహిత్యం పెంచుకోవాలి. ఎందుకు ఆసక్తి లేదో సానుకూలంగా అడిగి తెలుసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే.. అది పరిష్కరించే వరకు వారిని బలవంతం చేయకూడదు.
తమ భర్త తమను ఏదైనా విషయంలో మోసం చేస్తున్నారని గుర్తించినప్పుడు భార్యల్లో శృంగారంపై ఆసక్తి చూపించరు. తమ నమ్మకాన్ని వమ్ము చేశారని అనుకుంటారు. వారిలో కోపం పెరిగిపోతుంది. అది కాస్తా మీపై ఇష్టాన్ని తగ్గించేలా చేస్తుంది. మిమ్మిల్నీ దూరం పెట్టేస్తారు. ఆ తప్పును సరిదిద్దుకుంటే మాత్రం మళ్లీ మీకో అవకాశం ఇస్తారు కూడా. చాలామంది మహిళలు ఇంటి పని, ఉద్యోగం ఒత్తిడితో శృంగారంపై ఆలోచనలు తగ్గిపోతాయి. రాత్రి సమయాల్లో శృంగారానికి ప్రేరేపించినా వారిలో పెద్దగా సమయం దొరకదు. ఒకవేళ సమయం దొరికినా.. వారి శరీరం సహకరించదు. రొమాన్స్ లో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపరు.
Wife Avoiding Husband : మీ భాగస్వామిని ఇలా సంతృప్తి పొందేలా చేయండి..
చాలా మంది మహిళల్లో వయసు పెరగడంతో పాటు పిల్లలు పుట్టిన తర్వాత సాధారణంగా వారిలో శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుందని భావిస్తారు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. వారి ప్రవర్తనలో మార్పుల వల్ల శృంగారంపై ఆసక్తి తగ్గుతుంది. పిల్లల ముందు రొమాన్స్ చేసేందుకు ఇష్టపడరు. ఈ కారణంగా చాలామంది మహిళలు తమ భర్తతో శృంగారానికి ఆసక్తి చూపరని గుర్తించాలి. కుటుంబ సభ్యుల నుంచి ఏవైనా సమస్యలు ఉన్నా అది వారి భర్తపైనే పడుతుంది. ముఖ్యంగా పడకగదిలో శృంగారంపై ప్రభావం పడుతుంది. కుటుంబ సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించాలి. ఆ తర్వాతే భాగస్వామితో శృంగారానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇష్టం లేని పెళ్లి చేసుకున్న సందర్భాల్లో కూడా మహిళలు తమ భర్త పట్ల ఆసక్తి చూపరు. ఇలాంటివారిని తమ ప్రేమతో భర్తలు తమ దారిలోకి తెచ్చుకోవాలి. లవ్ ఫెయిల్యూర్ అయిన వారు తొందరగా బయటపడలేరు. వారిని అర్థం చేసుకుని వారికి నచ్చినట్టుగా మీ ప్రవర్తన ఉండాలి. అలా ఉంటూనే వారికి మీపై ప్రేమ పెరిగేలా చూసుకోవాలి. అలా కాకుండా నేను భర్తను.. అనే అహంకారంతో వారిని బలవంతం చేస్తే మీపై చెడు అభిప్రాయాన్ని ఏర్పడేలా చేస్తుంది. ఈ తప్పు అసలే చేయొద్దని అంటున్నారు. అలా చేస్తే.. ఇకపై ఎప్పటికీ మీతో శృంగారం చేసేందుకు ఆసక్తి చూపరు.. వారి మనస్సును తెలుసుకుని మనస్ఫూర్తిగా శృంగారానికి సిద్ధమైనప్పుడు మాత్రమే వారితో రొమాన్స్ చేసేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు నిపుణులు.