Ashwagandha health benefits in Telugu : మన దేశంలో పురాతన కాలంలోనే ఆయుర్వేద మూలికలను పూర్వీకులు వాడారు. ఈ క్రమంలోనే ఆయుర్వేద (Ashwagandham tips) వనమూలికలను (Ashwagandha uses in telugu) నేటికీ దివ్య ఔషధంగా భావిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న ఆధునిక వైద్యం నాడు అందుబాటులో లేదు. కానీ, ఆనాడు పూర్వీకులు ప్రకృతిలో లభించే వనమూలికల ద్వారా వైద్యం చేసుకున్నారు. ఇప్పుడంటే చిటికెలో ఇంగ్లిష్ మందులు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ, అప్పుడు ఇటువంటి పరిస్థితులు లేవు. కరోనా కాలంలో ఏపీలో ఆనందయ్య ఆయుర్వేద మందు బాగా పని చేసిన సంగతి అందరికీ విదితమే. ఈ సంగతులు ఇలా ఉంచితే.. ఆయుర్వేదంలో అతి ముఖ్యమైన వనమూలికగా అశ్వగంధ ఉంది. కాగా, అశ్వగంధ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
మానసిక రుగ్మతలకు చెక్ (Mental Problems) :
మనిషికి ఒత్తిడికి సంబంధించిన లక్షణాలతో పాటు ఆందోళనకర రుగ్మతలను తగ్గించే దివ్య ఔషధం అశ్వగంధ. అశ్వం అనగానే అందరికీ గుర్తొచ్చేది గుర్రం. ఇకపోతే గంధ అనగా వాసన. ఈ అశ్వగంధ వాసన గుర్రం మూత్రంలా ఉంటుదట. అయితే, ఈ అశ్వగంధ మగవారికి చాలా గొప్ప ఔషధం అని ఆయర్వేద పరిశోధకులు చెప్తుంటారు. అశ్వగంధ ఔషధాన్ని తీసుకోవడం ద్వారా గుర్రానికి ఎంత స్థాయిలో లైంగిక శక్తి కలిగి ఉంటుందో అంతే పెరుగుతుందట.. మానవ శరీర సంక్షేమాన్ని కోరే గొప్ప ఔషధంగా అశ్వగంధ (ashwagandha lehyam uses) ఉంటుదని మూలికా శాస్త్రంలో పేర్కొన్నట్లు పరిశోధకులు వివరిస్తున్నారు. శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలగించడంలో అశ్వగంధ కీలక పాత్ర పోషిస్తుంది. ఇకపోతే అశ్వగంధలోని గుణాలకు కేన్సర్‌కు విరుద్ధంగా పోరాడే శక్తి ఉంది. ఈ క్రమంలోనే కేన్సర్‌కు చికిత్స చేయడంలో అశ్వగంధ మూలిక బాగా పని చేస్తుంది.
కీళ్లనొప్పులు మాయం (Knee Problems) :
కీళ్లనొప్పులు నయం చేయడంలో అశ్వగంధ కీ రోల్ ప్లే చేస్తుంది. కీళ్లవాతంతో బాధపడుతున్నవారికి ఆ బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇకపోతే లైంగిక పటుత్వం కలిగించడంలో అశ్వగంధ చాలా బాగా పని చేస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. అశ్వగంధ మగవారిలో వీర్య కణాల పెంపుదలను ప్రోత్సహించడంతో పాటు లైంగిక శక్తిని పెంచుతుంది. ఈ మూలికను తీసుకోవడం వల్ల చర్మ శుద్ధి చేయబడటంతో పాటు వృద్ధాప్య సంకేతాలు నివారించబడుతాయి.
Ashwagandha : అశ్వగంధతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
ఫలితంగా మీరు యంగ్‌గా కనిపించొచ్చు. అశ్వగంధ శరీరంలో హీట్‌ను బాగా పెంచుతుంది. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో అశ్వగంధ చాలా బాగా పని చేస్తుంది. ఆరోగ్య ప్రదాయిని అయిన అశ్వగంధ గురించి తెలిసిన వారందరూ తప్పక దీనిని తీసుకుంటున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. హై బ్లడ్ ప్రెషర్, మధుమేహం కంట్రోల్ చేయడంలో అశ్వగంధ సాయం చేస్తుంది. బ్లడ్‌లో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంతో పాటు ఇన్సులిన్ స్తాయిని అశ్వగంధ పెంచుతుంది.
కరోనా నేపథ్యంలో చాలా మంది విటమన్ సి ఫ్రూట్స్, మాంసాహారం బాగా తీసుకుంటున్నారు. మునుపటితో పోల్చితే ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అయితే, అశ్వగంధ ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు చెప్తున్నారు. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో అశ్వగంధ బాగా పని చేస్తుందట. గాయాలను నయం చేయడంలోనూ అశ్వగంధ బాగా పని చేస్తుంది. ఇకపోతే ఈ అశ్వగంధ ఔషధాన్ని నోటి తీసుకున్పడు గాయాలను అది అత్యంత వేగంగా మానేలా చేయగలదని అంటున్నారు. అశ్వగంధ ఔషధం తీసుకున్నపుడు మెంటల్ టెన్షన్స్ అన్ని కూడా ఫ్రీ అయిపోయి మంచి నిద్ర వస్తుంది. అశ్వగంధ మగవారిలో మాత్రమే కాకుండా స్త్రీలలోనూ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
గుండు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది (Heart Health) :
స్త్రీలలో లైంగిక కోరికను అశ్వగంధ పెంచగలదు. అశ్వగంధ గుండె కండరాలను బలోపేతం చేస్తుంది. గుండె కండరాలు బలోపేతం కావడం ద్వారా హార్ట్ హెల్త్ ఆటోమేటిక్‌గా బాగుంటుంది. ఫలితంగా గుండె మీద ఒత్తిడి తగ్గి గుండెకు సంపూర్ణమైన రక్షణ లభిస్తుంది. కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది. చాలా సందర్భాల్లో కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోవడం, ఫలితంగా గుండె ఆరోగ్యం ప్రభావితమవుతుండటం మనం చూడొచ్చు. ఈ క్రమంలో హార్ట్ హెల్త్‌పైన కాన్సంట్రేషన్ అవసరం. అశ్వగంధ మెదడు పనితీరును పెంచుతుంది. పార్కిన్సన్, అల్జీమర్స్ వల్ల నరాలకు కలిగే నష్టాన్ని అశ్వగంధ తగ్గిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఈ క్రమంలో పార్కిన్సన్, అల్జీమర్స్ వ్యాధులున్న వారు అశ్వగంధను తీసుకోవడం వల్ల వారికి మేలు జరుగుతుంది.
అలసటను తగ్గిస్తుంది :
అలసటను తగ్గించడంలో అశ్వగంధ దివ్య ఔషధమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనస్సును ప్రశాంత పరిచి, ఒత్తిడి కలిగించే హార్మోన్ల విడుదలను ఆపుతుంది. అశ్వగంధ పూత పాము విషాన్ని న్యూట్రలైజ్ చేయగలదని, శరీరంలో విష వ్యాప్తిని అదుపు చేయగలదని అధ్యయనాల్లో తేలింది. అశ్వగంధ మానవ శరీరంలోని అవయవాల ఆరోగ్యం కోసం మాత్రమే కాదు బాహ్య అవయవాల కోసం కూడా పని చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ భాండాగారంగా ఉన్న అశ్వగంధ యాంటీ ఏజింగ్‌కు బాగా ఉపకరిస్తుంది. పొడిచర్మం కాకుండా చర్మాన్ని రక్షిస్తుంది. స్కిన్ ప్రొటెక్షన్‌కు మెడిసిన్‌గా అశ్వగంధ పని చేస్తుంది.
కేశాలు ఆడ, మగ అనే భేదాలు లేకుండా ప్రతీ ఒక్కరికి ముఖ్యం. వాటి సంరక్షణ కోసం మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రొడక్ట్స్ వాడి ఉండి ఉంటారు. అయితే, వాటి వల్ల ఉపయోగం లేకపోగా, జుట్టు ఇంకా రాలిపోతుందని చాలా మంది చెప్తుండటం మనం చూడొచ్చు. ఈ క్రమంలో వారి కేశాల సంరక్షణకు అశ్వగంధ టానిక్ తీసుకుంటే మంచి ప్రయోజనముంటుంది. అశ్వగంధ జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు వెంట్రుకలు వైట్ కాకుండా చూస్తుంది. జుట్టు పోషణకు ఔషధంగా పని చేస్తుంది.
Read Also : Dangerous Zodiac Signs : ఈ రాశి మీదేనా? వీరికి హార్ట్ ఎటాక్స్ ఎక్కువగా వస్తాయట.. మీ రాశి ఉందో చెక్ చేసుకోండి