Marriage Problems : చాలా మంది పెళ్లి చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. మరి కొందరు చేసుకోవడానికి ఇష్టపడకుండా కాలం గడిపేస్తూ ఉంటారు. మరి పెళ్లి చేసుకుంటే ఏయే అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. పెండ్లి చేసుకోకుండా వచ్చే నష్టాలు ఏమిటి? ఎవరికి ఎలాంటి పాపం చుట్టుకుంటుంది అనే విషయాలను తెలుసుకుందాం. ముఖ్యంగా పెండ్లి చూపులకు వెళ్లే సమయంలో అబ్బాయి కుటుంబం వారు అమ్మాయి కుటుంబంలో పరిశీలించాల్సినవి చాలానే ఉన్నాయి. అందులో ఒకటి వంశ క్రమం.. విత్తము, రూపము, బంధువులు వెనకాల ఉండేదే వంశ క్రమం. వీటిని ఎందుకు పరిశీలన చేయాలని ప్రశ్నిస్తే దీనికి శాస్త్రంలో సమాధానం ఉంది. ఆ ఇంట్లో అన్నదమ్ముల్లందరు నాస్తికులు, నాస్తిక మత ప్రచారం చేసేవంటి వాళ్లు, ఇంట్లో పూజా మందిరం లేనివాళ్లు, శాస్త్ర విరుద్ధమైన మాటలు మాట్లాడే వారు, ధర్మము నందు నిష్ట లేని వాళ్లు ఉంటే.. ఆ ఇంటి నుంచి పిల్లను తెచ్చుకోవడంలో కొంచెం జాగ్రత్త వహించాలి.
ఎందుకంటే బంధువులు అటువంటి వాళ్లయినప్పుడు ఏదో సమయంలో అబ్బాయి.. అమ్మాయి తరపువాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు వాళ్లకు అనుగుణంగా మారిపోవచ్చు. కాబట్టి ఒక కొడుకుకు భార్యను తీసుకు వచ్చే సమయంలో ఆ కొడుకు తండ్రి పలు విషయాలు గమనంలో ఉంచుకోవాలి. పిల్ల తరపు బంధువుల్లో పైన చెప్పినట్టుగా ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయాలను తెలుసుకోవాలి. నాస్తికంలో ఉన్నటువంటి వారు వారి బంధువుల్లో ఉన్నారని తెలిస్తే, అదే పనిగా నాస్తికం గురించి వారు మాట్లాడతారని తెలిస్తే అక్కడి నుంచి కోడలిని తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఆ అమ్మాయి భవిష్యత్తులో తన బాబాయ్, బంధువుల మాట విని.. నువ్వు ఎవరూ అని భర్తను ప్రశ్నిస్తే.. అలాంటప్పుడు మెట్టినిల్లు సంకటంలో పడిపోతుంది.
విత్తము, రూపము, బంధుజనముతో పాటు గమనించవలసిన మరొకటి శీలము. శీలము అంటే ప్రవర్తన. ఆ అమ్మాయికి సహజంగా ఏమంటే ఇష్టం. ఆడపిల్లను కొడలిగా చేసుకునేటప్పుడు ప్రధానంగా చూడాల్సింది శీలము (స్వభావము). ప్రవగిట్టని స్వభావం ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది కాక.. కొందరిలో మరో స్వభావం ఉంటుంది. ఎవరైనా చుటాలు వస్తే ఉన్నదంతా వారికి వండి పెట్టేయడం, ఉన్న డబ్బును ఖర్చు చేసేయడం. తర్వాతకి గురించి ఆలోచించకపోవడం.
Marriage Problems : ఇలాంటి అమ్మాయిలతో చాలా ప్రమాదమట..
అలాంటి స్వభావం ఉన్న అమ్మాయిలూ ప్రమాదమే. మరో ముఖ్య విషయం పురుషుడి తల్లిదండ్రులు గమనించాలి. తమ కొడుకు స్వభావానికి ఆ అమ్మాయి స్వభావానికి సరిపోతుందా లేదా అని చూసిన తర్వాతే పైన చెప్పిన నాలుగు అంశాలను చూడాలి. ఆ నాలుగు అంశాలను పరిశీలించాకే సంబంధం కుదుర్చుకోవాలి. దీని వెకనాల గ్రహాలు, నక్షత్రాలు, జాతకం, సంతానస్థానం, దీనితో పాటు పురుషుడి యొక్క ఆయుష్షు వీటన్నింటిని పరిశీలించి ఇద్దరికి సరిపోతుందా? లేదా? అంటూ చూస్తారు. ఇది జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినది.
సంబంధానికి వెళ్లేముందు చూడవలసిని ముఖ్యంగా మరో మూడు అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి సపిండ. సపిండ అంటే ఎంత దూరదృష్టితో చూసిన ఆ అమ్మాయి పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి అక్క కానీ చెల్లి కానీ కాకూడదు. వరసలు మారిపోయే అవకాశం ఉన్న పని ఎన్నడూ చేయకూడదు. ఒక్కొక్కసారి దూరదృష్టి వరుసలతో చూసినప్పుడు అబ్బాయికి ఆ అమ్మాయి కూతురు, చెల్లెలు అయిపోతుంది. అలా అయితే అలాంటి అమ్మాయిని పెండ్లి చేసుకోకూడదు. ఇక రెండవది సగోత్ర. సగోత్ర అంటే ఒకటే గోత్రం. మరొకటి సప్రవర అంటే ఒక్కొక్కసారి గోత్రం ఒకటై ఉంటుంది కానీ ప్రవర ఒకటై ఉండదు. అప్పుడు మినహాయింపు ఇవ్వొచ్చు అని చెబుతున్నది శాస్త్రం.
ఒక్కొక్క సారి గోత్రాలు వేరైనా ప్రవర ఒకటైపోతుంది. ఇలా అయితే రుషి సంతానంలో వారు అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెల్లు అవుతారు. అలా ఉన్న వారితో పెండ్లి చేస్తే అబ్బాయిని నాశనం చేయడమే. అప్పుడు అన్న చెల్లెలు సంసారం చేసినట్టవుతుంది. భయంకర సంతానం ఏర్పడుతుంది. దీన స్థితిలోకి వెళతారు. ఐశ్వర్యం ఉండదు. కుటుంబంలో లేనిపోని ప్రమాదాలు వస్తాయి. అందుకే అలాంటి అమ్మాయిని పెండ్లి చేసుకోకూడదు. అందుకే గోత్రం, సపిండ, సప్రవర ఈ మూడింటిని తప్పనిసరిగా చూడాలి. ఈ మూడింటిని చూసిన తర్వాత ఓకే అనిపిస్తూ అప్పుడు సంబంధానికి వెళ్లాలి.
సంబంధం కుదిర్చే విషయంలో అబ్బాయి తండ్రి, అమ్మాయి తండ్రి ఇద్దరూ గుర్తించుకోవలసని మరో విషయం తమ పిల్లలకు ఎందుకు పెళ్లి చేయాలి. అబ్బాయి తండ్రి, అమ్మాయి తండ్రి వీటిని తెలుసుకోవాలని శాస్త్రం చెబుతుంది. ఇక వారిలో చూడాల్సిన మరో విషయం ఒకటి ధర్మము. కుటుంబంలో ఒకరు పెళ్లి చేసుకోకుండా ఉంటే వారు సన్యాసమైనా తీసుకోవాలి. లేదంటే బహుస్తశ్రమానికైనా వెళ్లాలి. అలా కాకుండా బ్రహ్మచారిగానే ఉండిపోతే అది చాలా ప్రమాదము. అలాంటి వారు పూజకు గానీ, యజ్ఞానికి గానీ, యాగానికి గానీ, ధర్మానికి గానీ, పెద్దవాడిగా కానీ దేనికీ పనికిరాడు. కాబట్టి తండ్రి తన కొడుకుకు పెండ్లి చేయవలిసిందే.
పెండ్లి చేస్తే కోడలు వస్తుంది. కోడలు వస్తే ధర్మం చేస్తాడు. భార్య పక్కనుంటే యజ్ఞం చేయొచ్చు, యాత్ర చేయొచ్చు, తీర్థయాత్ర చేయొచ్చు. భార్య ఒక్కత్తే తీర్థయాత్రకు వెళ్లి పుణ్యం చేస్తే పుణ్యం వస్తుందా అంటే రాదని చెబుతుంది శాస్త్రం. శాస్త్రం ఎప్పుడూ భద్దతను దృష్టిలో పెట్టుకుంటుంది. భర్త కూడా ఒక్కడే తీర్థయాత్రకు వెళ్లకూడదు. భర్త.. భార్యను వదిలి తీర్థయాత్రకు వెళ్తే మహాపాపం అని చెప్పింది శాస్త్రం. ఏ కారణంగానైనా ఇక భార్యతో కలిసి వెళ్లే అవకాశం లేదు అనే పరిస్థితి వస్తే అలాంటి సమయంలో మాత్రమే భర్త ఒక్కడే వెళ్లవచ్చు. అలాంటి సమయంలో ఆయన స్నానం చేసేటప్పుడు తన భార్య జాకెట్‌ను బొడ్డులో పెట్టుకుని స్నానం చేయాలి. అలా చేస్తే ఆయన చేసిన పుణ్యంలో భాగం ఆమెకు సైతం దక్కుతుంది.
భార్యభర్తల అనుబంధానికి ఎంతో విలువ ఉంటుంది. సమాజంలో పెళ్లిబంధానికి చాలా విశిష్టత ఉంది. భారతీయ సంస్కృతిని గుర్తుచేసేలా పెళ్లి అనుబంధం ఉంటుంది. అలాంటి పెళ్లిబంధాన్ని నూరేళ్ల బంధంగా మార్చుుకోవడంలో చాలామంది జంటలు విఫలమవుతున్న పరిస్థితులు. అభిప్రాయభేదాలు రావడం, ఒకరిపై మరొకరికి నమ్మకం లేకపోవడం, ఇగోలు వంటివే పెళ్లిబంధానికి బ్రేకప్ చెప్పే పరిస్థితికి దారితీస్తున్నాయిని అంటున్నారు. ఈ విషయంలో భార్యభర్తలు అవగాహన కలిగి ఉంటే వారి వివాహ బంధం నూరేళ్ల బంధంగా ఎలాంటి కలతలు లేకుండా కొనసాగుతుందనడంలో సందేహం అక్కర్లేదు. అప్పుడే వివాహ బంధాలు నిలబడతాయి. రేపటిబావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయి.
Read Also : Arranged Marriage Benefits : అరేంజెడ్ మ్యారేజ్‌లో ఉండే బెన్‌ఫిట్స్ మీకు తెలుసా?