Couple Relationship Problems : పెళ్లి అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగే ముఖ్యమైన ఘట్టం. కాగా ఈ మ్యారేజ్ ద్వారా ఇద్దరు వ్యక్తులు ఒక్కరిగా మారిపోతారు. భార్యా భర్తలుగా తమ జీవితాలను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో చాలా మంది మ్యారేజ్ అనే రిలేషన్‌షిప్‌ను చాలా కాలం కొనసాగించడం లేదు. ఇందుకు చాలా కారణాలుంటాయి. సెలబ్రిటీలు నుంచి సామాన్యుల వరకు చాలా మంది విడాకుల బాట పడుతున్నారు. ఈ క్రమంలో బంధం నిలబడాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
ఒకరిని మరొకరు అర్థం చేసుకుని ముందుకు సాగితేనే భార్యా భర్తల మధ్య బంధం ఇంకా ముందుకు సాగుతుంది. ఏదేని విషయమై డిస్కషన్ వచ్చినపుడు ఇరువురు కలిసి చర్చించుకోవాలి. అంతే తప్ప ఒకరు చెప్పిందే ఫైనల్ అన్న ధోరణిలో ఉండకూడదు. అలా ఉండటం వల్ల మీకే ఇబ్బందులు ఎదురవుతాయి. భార్యా భర్తలు అన్యోన్యంగా ఉంటేనే ఆ సంసారం పచ్చగా ఉంటుంది.

అసలు సమస్య ఎక్కడుంది :
కాగా, ఏదేని విషయమై విభేదాలు రాగానే వారు విడిపోయేందుకు ఆసక్తి చూపుతుండటం సహజమే. కాని అలా కాకుండా అసలు సమస్య ఎక్కడుంది అనే ఆలోచించాలి. అలా ఆలోచనే చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం ఇట్టే కనుగొనవచ్చు. ప్రేమను పంచడం అనేది కూడా రిలేషన్ షిప్‌లో చాలా ముఖ్యం. ప్రేమ ఉన్నట్లు అనిపించడం కాదు కనిపించాలి కూడా అని పలువురు చెప్తుంటారు. ఈ నేపథ్యంలోనే భార్యా భర్తల మధ్య బంధం అనుబంధంగా ఇంకా బలపడాలంటే ప్రేమను ఎప్పటికప్పుడు ఎక్స్‌ప్రెస్ చేస్తుండాలి.
Couple Relationship Problems : భార్య భర్తల గొడవలకు కారణాలేంటి?
రిలేషన్‌షిప్‌లో ఉన్నపుడు ఒకరి పరిస్థితిని మరొకరు అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. భర్త ఆర్థిక పరిస్థితిని భార్య అర్థం చేసుకోవాలి. అలా భాగస్వామి ఆర్థిక పరిస్థితి తెలుసుకుని అందుకు తగ్గట్లుగానే ఖర్చులు ప్లాన్ చేసుకోవాలి. ఇకపోతే సర్దుకుపోయే గుణం ఇద్దరూ కలిగి ఉంటే చాలా మంచిది. కొన్ని సార్లు భార్య, మరి కొన్నిసార్లు భర్త ఇలా ఇద్దరు పలు విషయాల్లో సర్దుకుపోతూ ఉండాలి. ప్రతీ సారి ఒక్కరే సర్దుకుపోతుండటం కూడా మంచిది కాదు. అలా చేయడం వల్ల కొంత కాలం తర్వాత మనస్పర్థలు వచ్చే అవకాశముంటుంది.
ఇగోలను వదిలిపెట్టాలి :
భార్యభర్తల మధ్య లైంగిక సంబంధం మాత్రమే కాదు.. బంధం బలపడటానికి ప్రేమ, అప్యాయత, అనురాగాలు కూడా కాావాలి. వీటికి లైంగికపరమైన బంధం మరింత బలంగా మారుతుంది. దంపతుల మధ్య అనుబంధానికి ఇదే పునాది కూడా. అయితే చాలామందిలో జంటల్లో ప్రధానంగా వినిపించే మాట.. ఇగో.. ఇదే పచ్చని సంసారాలను బుగ్గిపాలుచేసేది. భార్యభర్తల మధ్య ఇగోలకు చోటు ఉండరాదు.
అప్పుడే ఆ సంసారం సాఫీగా సాగుతుంది. నువ్వెంత.. అనేది మధ్యలో వచ్చిందా? అంతే.. మూడుమూళ్ల బంధం ముక్కలైనట్టే. పిల్లలు ఉన్న దంపతులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇగోలకు పోయి బంధాన్ని తెంచుకునే బదులు అవన్నీ పక్కనపెట్టి మన కోసం మనం అనే భావనతో ముందుకు సాగడం ఎంతో మేలుని చెబుతున్నారు. అప్పుడే సంసార బంధం మూడనాళ్ల ముచ్చటగా కాకుండా నూరేళ్ల బంధంగా మారుతుంది.