Relationship Problems : సాధారణంగా మానవ సంబంధాలు, దాంపత్య జీవితంలో ఒకరినొకరు దూరం చేసుకోవడానికి అనేక కారణాలుంటాయి. కొన్నిసార్లు బలవంతంగా కలసి ఉండాలని ట్రై చేయడం కూడా తప్పే. ఆర్థిక సమస్యలు కూడా రిలేషన్ మధ్య గ్యాప్ తీసుకొస్తాయి. ఇష్టం లేకపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, మాటలకు గౌరవం లేకపోవడం, చులకన భావం ఇవన్నీ కూడా బంధాలను కలపవు.. దూరం చేస్తాయి. అందుకే చాలా మంది రిలేషన్‌లో కొంతకాలం బానే ఉంటారు. ఎందుకంటే కొత్తలో ఒకరికోసం ఒకరు తగ్గతారు. త్యాగం ఉంటుంది.
కాలం గుడుస్తున్న కొద్దీ రిలేషన్‌లో సమస్యలు ఉత్పన్నమవుతాయి. వాటిని ఎదుర్కొని గట్టిగా నిలబడకపోతే ఏ బంధమైనా తృణప్రాయంగా ముక్కలవుతుంది. ఎలాంటి టైంలో బంధాలు బలహీనమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. రిలేషన్ ఉన్నకొత్తలో అంతా బాగానే ఉన్నా ఆ తర్వాత మీ భాగస్వామి వద్ద ఉనికిని కోల్పోతున్నారంటే ఆ బంధం ఎక్కువ కాలం ఉండదు. అదేవిధంగా ప్రేమలో ఉన్న కొత్తలో చాలా బాగా మాట్లాడుకుంటారు. ప్రేమతో పాటు కాలం గడుస్తున్న కొద్దీ ఇద్దరి మధ్య మాటలు క్రమంగా తగ్గుతాయి. ఆ టైంలో ఒకరొనొకరు టైం ఇచ్చుకుని మరీ మాట్లాడుకోవాలి. కేరింగ్ ఉండాలి లేదంటే మీ బంధం మున్నాళ్ల ముచ్చటే అవుతుంది. ఇక అభిప్రాయాలను గౌరవించుకోలేకపోవడం కూడా రిలేషన్‌ను బలహీన పరుస్తుంది. ఒకరికొకరు తమతమ అభిప్రాయాలకు విలువ ఇచ్చుకోవాలి.
ముఖ్యంగా రిలేషన్‌లో ఉన్న వ్యక్తులు ఇతరులతో తప్పుగా ప్రవర్తించవద్దు.. చులకన భావం అనే దానిని డిలీట్ చేయాలి. లేదంటే ఏదో ఒక రోజు అదే భావన మీతో కూడా కలుగచ్చు. అన్నింటికంటే ముఖ్యమైనది క్షమాగుణం.. ఏ రిలేషన్ అయినా స్ట్రాంగా ఉండాలంటే ఇదే వజ్రాయుధం.. తెలిసో తెలియకో తప్పు చేసినప్పుడు మీ పార్ట్నర్‌ను సారీ అడగండి.. మొండిగా ఉంటే మీకే ప్రమాదం.. అదే విధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు నచ్చిన వ్యక్తిని రిజక్ట్ చేస్తే వారిని బ్రతిమాలో భామాలో ఒప్పించుకోవాలి. కానీ చులకన భావంగా వారిని వదులుకోవద్దు.. రేపు మీ బంధంలో కలతలు వస్తే వారే నచ్చజెప్పి కలిపేలా చూసుకోవాలి.
Read Also : Couple Relationship : మీ భాగస్వామిలో ఇలా సంకేతాలు కనిపించాయా..? ఇక వారు మిమ్మల్ని వదలకుండా చేస్తారట!