Couple Relationship : ఆకర్షణ… నాలుగక్షరాల ఈ పదానికి చాలా పవర్ ఉంది. భూమికి, ఆకాశానికి మధ్య గురుత్వాకర్షణ శక్తి ఉన్న విధంగా మగువలు మరియు మగవారి మధ్య ఓ పవర్ ఫుల్ శక్తి ఉంటుంది. ఆ శక్తి కనుక మిమ్మల్ని ఆవహిస్తే ఆ వ్యక్తిని మీరు జీవితంలో విడిచిపెట్టేందుకు ఒప్పుకోరు. కొన్నిసార్లు ఈ ఆకర్షణతో అనేక మంది తమ జీవితాలనే సెట్ చేసుకుంటారు. మీకు ఒక వ్యక్తి పట్ల ఆకర్షణ ఏర్పడితే మీరు మళ్లీ ఆ వ్యక్తిని కలుసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
ఎలాగైనా సరే వారితో మాట్లాడాలని భావిస్తారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. ఒక్కో సారి ఇటువంటి ఆకర్షణ మీకు మొదటి చూపులోనే కలుగుతుంది. కొంత మంది వ్యక్తులను చూడగానే వారు మిమ్మల్ని అయస్కాంతంలా ఆకర్షించి అతుక్కుపోయినట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. ఇలా ఆకర్షణ శక్తి ఎలా ఉంటుందనే విషయం గురించి ఒక్క సారి తెలుసుకుంటే..

అనేక సార్లు మీ కంటి చూపుతోనే ఇతరులను ఆకర్షించగలుగుతారు. ఇలా కంటి చూపుతోనే ఎన్నో వేల నిశ్శబ్దపు మాటలను మాట్లాడడం సాధ్యమవుతుంది. మీరు అదే వ్యక్తిని చూస్తూ ఉంటే వారి దృష్టి మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మీరు ఒక వ్యక్తిని కలిసినపుడు మీరు వారిని ముందుగానే కలిసిన ఫీలింగ్ ఒక్కోసారి కలుగుతుంది. ఇదో రకమైన ఆకర్షణ. మీరు ఆ సమయంలో వారితో ఎంత మాట్లాడాలని ట్రై చేసినా కానీ ఒక్కోసారి మాటలు రావు. ఇందుకోసం మీరు ఎటువంటి నిరాశ చెందకూడదు.
ఎవరితోనైతే మనం అయస్కాంతంలా అతుక్కుపోవాలని భావిస్తామో వారి గురించి మనం మరింతగా తెలుసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తాం. మీరు ఎలాగైనా సరే వారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. గంటల కొద్దీ సమయం మాట్లాడుకుంటేనే గడుపుతారు. మీకు అసలు టైమే తెలియదు. మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షించిన వ్యక్తితో మీరు సరసాలు ఆడేందుకు ఆసక్తి చూపిస్తారు. మీకు ఆ పని చేయడం చాలా సరదాగా అనిపిస్తుంది. కానీ మీరు ఆ వ్యక్తితో పిచ్చి ప్రేమలో పడితే మాత్రం అసలు ఈ లోకాన్నే గుర్తు పెట్టుకోరు.
Read Also : Couple Marriage Life : శృంగార జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!