Late Marriage : పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరపు రాని ఘట్టం. పెళ్లి కోసం అనేక మంది తమకు తోచిన విధంగా అప్పులు చేసి మరీ గ్రాండ్ గా చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటారు. పూర్వ కాలంలో తీసుకుంటే పెళ్లిళ్లు చాలా చిన్న వయసులో జరిగేవి. బాల్య వివాహాలు చేయడం కరెక్ట్ కాదని తర్వాతి రోజుల్లో అనేక పోరాటాలు జరిగాయి. దీంతో పెళ్లి వయస్సును ప్రభుత్వం 18–21 మధ్యలోకి తీసుకొచ్చింది. కానీ ప్రస్తుత రోజుల్లో అనేక మంది ఆ వయసులో కూడా పెళ్లి చేసుకోవడం లేదు.
ఒక్కొక్కరైతే ఏకంగా మూడు పదుల వయస్సు దాటినా కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. ఇలా వారు ఆలోచించకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. కొంత మంది తాము ఇంకా జీవితంలో సెటిల్ కాలేదని భావించగా, మరి కొంత మందేమో తమకు ఇప్పుడే పెళ్లి అవసరం లేదని పోస్ట్ పోన్ చేస్తుంటారు. కారణాలేవైనా కానీ పెళ్లి ఆలస్యంగా చేసుకోవడం వలన అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఓ సంస్థ జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇంతకీ వారేం చెప్పారంటే…
లేటు వయసులో పెళ్లి చేసుకోవడం వలన మీరు ఆ కార్యంలో సరిగ్గా పాల్గొనలేరట. అంతే కాకుండా మీకు త్వరగా భావప్రాప్తి జరుగుతుందని ఆ సర్వేలో వెల్లడైంది. కావాల్సిన వయసులో పెళ్లి జరిగితే మీరు చాలా చురుగ్గా ఆ కార్యంలో పాల్గొంటారు. ప్రతి రోజు దాంపత్య సుఖం పొందడం వలన మీలో రోగ నిరోధక శక్తి చాలా పెరుగుతుందట. మీరు ఆ కార్యంలో రెగ్యులర్ గా పాల్గొంటే మీలో చురుకుదనం పెరుగుతుందని వెల్లడైంది. యూనివర్సిటీ ఆఫ్ మేరీ ల్యాండ్ సర్వే ప్రకారం మీరు లేటు వయసులో పెళ్లి చేసుకుంటే సరిగ్గా ఆ సుఖాన్ని ఎంజాయ్ చేయలేరు.
Read Also : Relationship Problems : ‘రిలేషన్స్’ చెడిపోవడానికి ఇవే ప్రధాన కారణాలు..? జాగ్రత్త వహించండి..!