Optical illusion : మీ మెదడుకు మేత.. మీ బ్రెయిన్ ఎంత చురుకుగా పనిచేస్తుందో ఎప్పుడైనా టెస్టు చేశారా? అయితే, ఇప్పుడు ఓసారి ప్రయత్నంచండి. మన కంటికి కనిపించేది కొంతమాత్రమే.. కానీ, కనిపించని చాలా రహాస్యాలు ఎన్నో దాగి ఉంటాయి. ఇలాంటి సమయాల్లో బుర్రకు బాగా పదునుపెట్టాల్సి ఉంటుంది. అప్పుడే కళ్లకు కనిపించని వాటిని కూడా క్షణాల్లో కనిపెట్టవచ్చు. మీ IQ ఎంత స్ట్రాంగ్ అనేది టెస్టు చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే, మీకోసం ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం..
ఒక ఫొటోలో సింగిల్ నెంబర్ దాగి ఉంటుంది.. అది ఏంటో సెకన్లలో కనిపెట్టండి.. మీరు చేయాల్సిందల్లా.. ఈ ఫొటోలో అన్ని 9 సంఖ్యలే ఉన్నాయి. కానీ, అందులో 6 సంఖ్య కూడా ఉంది. దాగిన ‘6’ సంఖ్యను గుర్తించడమే మీ పని.. ఆప్టికల్ ఇల్యూషన్స్ (Optical illusion) అనేది మీ మెదడు ఎంత చురుకుగా పనిచేస్తుందో తెలియజేస్తుంది. మీలో ఎంతవరకు దృష్టి సామర్థ్యం ఉందో ఈ చిన్న టెస్టు ద్వారా పరీక్షించుకోవచ్చు.

పరిశోధన ప్రకారం.. ప్రతిరోజూ ఆప్టికల్ ఇల్యూషన్స్ పూర్తి చేయడం ద్వారా జ్ఞాపకశక్తి, శ్రద్ధతో పాటు అవగాహన కలుగుతుందని, తద్వారా బ్రెయిన్ మరింత చురకుగా పనిచేస్తుంది. అంతేకాదు.. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో కూడా సాయపడుతుంది.
ఈ ఫొటోలో 6 సంఖ్యను గుర్తించారా? లేదంటే.. ఇంకా చూస్తున్నారా? గడియారం టిక్ టిక్ అంటోంది.. మీకు ఇచ్చిన సమయం దాటిపోతుంది. నిర్ణీత సమయంలో ఈ టాస్క్ పూర్తి చేయాలి. సమాధానం తెలియదా? ఇదిగో మీకోసం సమాధానం అందిస్తున్నాం.. ఈ ఫొటోలో 6 సంఖ్య ఇక్కడ ఉంది చూశారా?