Tea Powder : ఇలా జరిగితే.. ఆ టీ పొడి కల్తీదని అర్థం.. కల్తీ టీని ఎలా గుర్తించాలో తెలుసా? ఇదిగో ఇలా చేస్తే మీకే తెలుస్తుంది!

Tea Powder : ప్రస్తుతం ప్రపంచమే కల్తీమయమయిపోయింది. ఏ పదార్థం చూసినా కల్తీ ఏమో అనే అనుమానం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అటువంటి కల్తీ ప్రపంచంలో సరైన వస్తువులను గుర్తించడం చాలా కష్టమే. కానీ సరైన వస్తువులను గుర్తించే మనం తీసుకోవాలి. లేకపోతే మన ఆరోగ్యం అటకెక్కే ప్రమాదముంది. టీ.. చాలా మందికి పొద్దున లేవగానే అవసరమయ్యేది. కానీ కొంత మంది కేటుగాళ్లు దీనిని కూడా కల్తీ చేశారు. ప్రస్తుతం మనలో చాలా మంది ఉపయోగిస్తున్న టీ పొడి ఎక్కడో ఓ చోట కల్తీ మరకలు అంటుకుని వస్తుండడం గమనార్హం. అలా కల్తీ అయిన టీని మనం గుర్తించడం చాలా తేలియక ఈ సింపుల్ ప్రాసెస్ ను అవలంభిస్తే చాలు కల్తీని కనిపెట్టేయొచ్చు.

Tea Powder : Is your tea adulterated? Here's how to find out in telugu
Tea Powder : Is your tea adulterated? Here’s how to find out in telugu

కల్తీని కనుక్కోవడం కోసం టీ ఫిల్టర్ మరియు టీ ఆకుల్ని తీసుకుని ఆ ఫిల్టర్ పేపర్ మీద టీ ఆకులను తడిసేటట్లు పెట్టండి. కాసేపయినాక టీ ఫిల్టర్ పేపర్ ని ట్యాప్ వాటర్ తో వాష్ చేయండి. అప్పుడు ఆ ఫిల్టర్ పేపర్ మీద ఏవైనా మరకలుంటే ఆ టీ పౌడర్ కల్తీదని, మరకలు లేకపోతే ఆ టీ పౌడర్ స్వచ్ఛమైనదనే విషయాన్ని గ్రహించాలి. ఇలా ఇంట్లోనే ఉండి మనం వాడే టీ సరైనదో కాదో తెలుసుకోవచ్చు.

ఈ కల్తీలను మామూలుగా తీసుకుంటే అవి ఒక్కోసారి మన ఆరోగ్య వ్యవస్థనే నాశనం చేసేంత వరకు వెళ్తున్నాయి. చాలా విషయాల్లో మనకు తెలియకుండానే కల్తీ అనేది మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. తీరని నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ కల్తీ నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం చాలా జాగ్రత్తగా ఉండాలి.

Leave a Comment