Telangana Style Mutton Boti Fry : పక్కా తెలంగాణ బోటి ఫ్రై ఎప్పుడైనా తిన్నారా? అద్భుతంగా చాలా టేస్టీగా ఉంటుంది. సాధారణంగా బోటిని ఫంక్షన్లలోనే, పెళ్లిలో చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. బోటీని చేసేందుకు చాలా ప్రాసెస్ ఉంటుందని ఇంట్లో చేసేందుకు వెనకాడుతారు. కానీ, బోటి ఫ్రై ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు తెలుసా? మటన్ బోటీ ఎలాంటి స్మెల్ లేకుండా చాలా రుచిగా చేసుకోవచ్చు. మటన్ బోటీ ఫ్రై చేయడానికి ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి. ఎంతో రుచికరంగా రావాలంటే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు… బోటి -కేజీన్నర, ఉల్లిపాయలు- నాలుగు, పచ్చిమిర్చి- ఎనిమిది, నూనె( డీప్ ఫ్రై కి సరిపోయినంత), అల్లం వెల్లుల్లి పేస్ట్- రెండు టేబుల్ స్పూన్, ఉల్లికాడలు- అరకప్పు, మెంతికూర- అరకప్పు, కరివేపాకు- రెండు రెమ్మలు, కారం ఉప్పు( రుచికి తగినంత), ధనియాల జిలకర పొడి- ఒక టీ స్పూన్, గరం మసాలా పొడి- హాఫ్ టీ స్పూన్, పసుపు- హాఫ్ టీ స్పూన్,
తయారీ విధానం... ముందుగా కట్ చేసిన బోటీ ముక్కలను నీళ్లను మార్చుకుంటూ ఏడు ఎనిమిది సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. చిల్లుల గిన్నెలో బోటీని వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో బోటి మునిగే నీళ్లు పోసి బాగా మసలనివ్వాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి బోటీని వేసుకోవాలి. (మరిగే నీళ్లలో బోటీ వేస్తే సాఫ్ట్ గా ఉంటుంది).20 నిమిషాలు ఉడికించాలి…లేదా (కుక్కర్ లో వేసి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి) ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి బోటిని చిల్లుల గిన్నెలో వేసుకొని తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు కట్ చేసి వేసుకోవాలి మరోసారి శుభ్రంగా కడగాలి.

Telangana Style Mutton Boti Fry : తెలంగాణ మటన్ బోటి ఫ్రై తయారీ…
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఎనిమిది టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన మెంతుకూర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, ఉల్లికాడలు, కొంచెం ఉప్పు వేసి కలపాలి. ఒక నిమిషం తర్వాత కడిగి పెట్టుకున్న బోటీని వేసుకొని కలపాలి. హై ఫ్లేమ్ లో ఉంచి (10 నిమిషాల పాటు) మూత పెట్టి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ కలర్ మారేంతవరకు బోటిని ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, రుచికి తగినంత కారం ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి, కట్ చేసిన చేసిన కొత్తిమీర వేసి అన్ని ఇంగ్రిడియంట్స్ బోటీకి పట్టేలా కలుపుకోవాలి. మరో రెండు నిమిషాలు బోటిని ట్రై చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన బోటీ రెడీ..
గమనిక : బోటీలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలి… బోటి కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా బోటి పేలుతుంది కాబట్టి.. బోటి ఫ్రై, మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై చాలా ఇష్టపడి తింటూ ఉంటాం. శరీరానికి వేడి చేస్తుంది కాబట్టి మజ్జిగ, సబ్జ గింజలు వేసుకొని నిమ్మరసం తాగితే చలవ చేస్తుంది.