Special Mutton Fry Recipe in telugu : స్పెషల్ మటన్ ఫ్రై.. ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ మరి తినేస్తారు. మటన్ ప్రై టేస్టీగా రావాలంటే అందులో కొన్ని పదార్థాలను కలపాలి. అప్పుడే మటన్ ప్రై చాలా టేస్టీగా వస్తుంది. సాధారణంగా ఈ మటన్ ప్రై చేస్తారో తెలుసా? అందులోనూ స్పెషల్ మటన్ ప్రై ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మటన్‌తో అనేక రకాల వంటకాలను తయారుచేసుకోవచ్చు. మటన్ వేపుడు, మటన్ పులుసు, మటన్ ఫ్రై వంటి అనేక రకాల వంటలను చేసుకోవచ్చు. మటన్ చాలా టేస్టీగా రావాలంటే అందులో కొన్ని ప్రత్యేకమైన ఇన్‌గ్రిడియంట్స్ తప్పక ఉండాల్సిందే.. అవేంటో ఓసారి చూద్దాం..
మటన్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్ధాలు ఇవే :
ముందుగా.. 650 గ్రాముల బోన్‌లెస్ మటన్ తీసుకోండి. 100 గ్రాముల వరకు తరిగిన ఉల్లిపాయలు, ఒక టీ స్పూను కారం పొడి, ఉప్పు తగినంత, పావు టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లల్లి పేస్టు తీసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నూనె, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అర టీ స్పూన్ మిరియాల పొడి, అర టీ స్పూన్ వరకు గరం మసాల పౌడర్, రెండు టీ స్పూన్ల నిమ్మరసాన్ని యాడ్ చేయాలి.

Spiecial Mutton Fry Recipe : హోటల్ స్టైల్ మటన్ ఫ్రై ఇంట్లోనే ఇలా ఈజీగా..
తయారీ విధానం : మటన్ ముక్కలు బాగా కడిగిపెట్టుకోండి. ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి కలపాలి. ఇప్పుడు తగినంత నీటిని పోయాలి. ఆ తర్వాత కుక్కర్‌లో వేసి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు బాగా ఉడికించాలి. కడిగిపెట్టుకున్న మాంసం ముక్కలను తడి ఆరే వరకూ ఉంచాలి. స్టౌ వెలిగించి దానిపై గిన్నె పెట్టాలి. తగినంత నూనె పోయాలి. కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, పుదీనా, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి.
కడిగి పెట్టుకున్న మాంసం ముక్కలను అందులో వేసి కలపాలి. దీనిపై గరం మసాల పొడి, నిమ్మరసం, మిరియాల పొడిని చల్లి 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మటన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించుకోవాలి. అంతే.. వేడివేడి రుచికరమైన మటన్ ఫ్రై రెడీ.. మీ ఇంట్లో ఇప్పుడే ఈ వంటకాన్ని తయారుచేసుకోండి.