Chinta Chiguru Mutton Curry : చింత చిగురు మటన్ కర్రీ… మటన్ ను చాలా ఇష్టపడుతూ ఉంటారు. మటన్ రకరకాల వంటలుగా తయారు చేస్తూ ఉంటా అయితే ఒకసారి చింతచిగురుతో కలిపి మటన్ వండి తింటే వావ్ అనాల్సిందే.. అంత యమ్మీ యమ్మీ గా ఉంటుంది. మటన్ చింతచిగురు ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు…
చింత చిగురు-1 కప్పు, మటన్-1/2 కేజీ, ఉల్లిపాయలు( మీడియం సైజ్) -4, పచ్చిమిర్చి-5, ఉప్పు కారం( రుచికి తగినంత), అల్లం వెల్లుల్లి పేస్ట్-2 టేబుల్ స్పూన్, పసుపు-1 టీ స్పూన్, కొత్తిమీర, ధనియాల పొడి-1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి-1 టేబుల్ స్పూన్, నూనె, జీలకర్ర-1 టీ స్పూన్, బిర్యానీ ఆకులు-3,
తయారీ విధానం…
ముందుగా మటన్ ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చింత చిగురును శుభ్రం చేసుకుని చేతులతో నలిపి( క్రష్) పొడిలా పెట్టుకోవాలి. ఉల్లిపాయలను పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి (పల్లీల నూనె) నాన్ వెజ్ లో చాలా టేస్టీగా ఉంటుంది. నూనె వేసి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, మూడు బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి.
Chinta Chiguru Mutton Curry : చింత చిగురు మటన్ కూర తయారీ ఇలా..
ఇప్పుడు వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మటన్ వేసి కలపాలి. కొంచెం మగ్గిన తర్వాత పసుపు ఉప్పు కలిపి మూత పెట్టి (10 నిమిషాలు)మటన్ లో ఉన్న వాటర్ అంతా పోయి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. (చింతచిగురు పులుపు ఉంటుంది కాబట్టి కారం ఉప్పు కొంచెం ఎక్కువగా పడుతుంది).
ఇప్పుడు రుచికి తగినంత కారం ఉప్పు వేసి కలపాలి. ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని మటన్ కర్రీ నూనె పైకి తేలేంతవరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి. ఇప్పుడు మటన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసి కలిపి కుక్కర్ విజిల్ పెట్టి ఆరు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి.

ఆ తర్వాత కుక్కర్ విజిల్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ముక్క ఉడికిందో లేదో చూసుకొని కలుపుకోవాలి. చింతచిగురును వేసి కలపాలి. మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఒక నిమిషం తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన మటన్ చింతచిగురు రెడీ.. గమనిక : నాన్ వెజ్ తిన్నప్పుడు వేడి చేస్తుంది కాబట్టి మజ్జిగ, నిమ్మరసం సబ్జ గింజలు తాగితే శరీరానికి చలవ చేస్తుంది.