Ulavalu mixture snack recipe : ఉలవలు తో మిక్చర్… mixture.. తెలుగింటి పాత రుచి ఉలవలతో కారాలు.. అందరూ ఆహా ఏమి రుచి అనేలా నూనె పీల్చుకోకుండా ఎంతో టేస్టీగా ఉండే ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు.. చూస్తే నోరూరుతుంది తింటే ఇంకా ఇంకా తిందురు.. ఎంతో అమోఘమైన కరకరలాడే ఉలవల కారాలు ఎలా తయారు చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు… ఉలవలు1 కేజీ, వంట సోడా 1 టీ స్పూన్, శనగపిండి, నూనె, ఉప్పు, కారం, పల్లీలు, కరివేపాకు..
తయారీ విధానం.… ఉలవలను శుభ్రంగా కడుక్కొని ఒక టీ స్పూన్ వంట సోడా వేసి ఉలవల్లో నీళ్లు పోసి 6,7 గంటలు (రాత్రంతా) నానబెట్టుకోవాలి. మరుసటి రోజు నానిన ఉలవలను శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత ఉలవలకు ఉన్న వాటర్ అన్ని పోయేలా ఒక గంటసేపు కాటన్ క్లాత్ పై ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నూనె పీల్చుకోదు.. కారా కోసం ఒక బౌల్లో శనగపిండి తీసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా మెత్తగా మురుకుల పిండిలా కలుపుకోవాలి ఆ తర్వాత వేడిగా ఉన్న నూనె ఒక స్పూన్ వేసుకోవాలి అలా వేయడం వల్ల క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి..
స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపోయేంత నూనె పోసి నూనె వేడి అయిన పిండి ముద్దను మురుకులు గొట్టంలో కొంచెం నూనె రాసి పిండిని పెట్టుకొని వేడిగా ఉన్న నూనెలో కారపూసల వత్తుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఉంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. కారం మొత్తం చేయడం అయిపోయిన తర్వాత ఉలవలను.. తేమ లేకుండా చూసుకొని
ఉలవలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుప్పెడు పల్లీలు తీసుకొని కలర్ మారేంతవరకు వేయించి తర్వాత ఉలవలు ఉన్న ప్లేట్లో వెయ్యాలి. గుప్పెడు కరివేపాకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని వేయించి పెట్టుకున్న ఉలవలు, పల్లీలు, కరివేపాకు, కారాలు చిన్న చిన్నగా తుంచుకొని మొత్తం మిక్స్ చేయాలి వేడిగా ఉన్నప్పుడే రుచికి తగినంత ఉప్పు కారం వేసి కలపాలి. అలా చేయడం వల్ల ఉలవలకు మిక్చర్ కు ఉప్పు, కారం పడుతుంది. ఎంతో రుచికరమైన ఉలవల మిక్చర్ రెడీ..