Chicken Keema Pakoda Recipe : నోరూరించే చికెన్ కీమా పకోడీ ఎప్పుడైనా తిన్నారా? ఒకసారి తిన్నారంటే మళ్లీ కావాలంటారు. అంత టేస్టీగా ఉంటుంది. సాధారణంగా ఉల్లిపాయలతో పకోడా చేసుకుంంటారని తెలిసిందే. కానీ, చికెన్ పకోడాలను ఇలా కూడా చేయొచ్చుని తెలుసా? వాస్తవానికి చికెన్‌తో ఎన్నో రకరకాల వంటలు తయారు చేసుకోవచ్చు. వేడి వేడి పకోడీ స్నాక్స్ చికెన్‌తో చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ కీమా పకోడీ హోటల్ స్టైల్‌లో ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చికెన్ కీమా పకోడీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు… చికెన్ కీమా, నూనె, ఉప్పు, పసుపు1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, శనగపిండి, కోడిగుడ్డు1, గరం మసాలా1 టీ స్పూన్, ధనియాలు జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 3 రెమ్మ, జీలకర్ర 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1టేబుల్ స్పూన్, జిలకర1 టీ స్పూన్, ఉల్లిపాయ1,
తయారీ విధానం.. ముందుగా బోన్ లెస్ చికెన్ తీసుకుని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి అందులో పసుపు, రుచికి తగినంత ఉప్పు,అల్లం వెల్లుల్లి పేస్ట్, జిలకర, ధనియాలు జీలకర్ర పొడి, గరం మసాలా, నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కోడిగుడ్డు, కారం వేసి బాగా కలపాలి.

కీమా కాబట్టి బాల్స్ విడిపోకుండా గుడ్డు వేస్తారు. చికెన్ లో ఉన్న వాటర్ ని తగ్గట్టుగా శనగపిండిని కొద్దికొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. క్రిస్పీగా రావాలంటే కొంచెం బియ్యం పిండి వేసి కలపాలి. స్టవ్ వెలిగించి అలా అయితే డీప్ ఫ్రై కి సరిపోయినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని చికెన్ కీమా చిన్న చిన్న పకోడీల్లా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకొని పకోడీ తీసే ముందు అందులో కరివేపాకు, నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీయాలి. అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి చికెన్ కిమా పకోడీ రెడీ…