Salla Charu Recipe in Telugu : ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఎండల తీవ్రతతో శరీరంలో తీవ్రమైన వేడితో బాధపడుతుంటారు. ఇలాంటి సమయంలో శరీరాన్ని ఎండ తీవ్రత నుంచి రక్షించుకోవాలన్నా, వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా తప్పకుండా ఒంటికి చలువ చేసే వాటిని తప్పక తీసుకోవాలి. అందులో సింపుల్ రెసిపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ కూరగాయలు లేనప్పుడు పెరుగుతో ఇలా చల్లచారు చేసుకోండి. రైస్‌లోకి మాత్రం చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే మొత్తం అన్నమంతా దీంతోనే తినేస్తారు.. కొంతమంది మజ్జిగ పులుసు, మజ్జిగ చారు ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు. ఇంతకీ మజ్జిగ చారు తయారీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు : పెరుగు, ఉప్పు( రుచికి తగినంత), నూనె, పసుపు 1టీ స్పూన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, టమాటలు, కరివేపాకు, ఎండుమిర్చి 2,ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, మెంతులు 1/4 టీ స్పూన్, కొత్తిమీర..
తయారీ విధానం : ఇప్పుడు చల్ల చారు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం గట్టి పెరుగు తీసుకుంటే బాగుంటుంది. ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగుని మనకు కావలసినంత వేసుకోవచ్చు. అంటే.. మనం ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లో టేస్ట్ పైన అంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని పెరుగుని బాగా బీట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన వాటర్ పోసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి. స్మూత్‌గా అయ్యేలాగా బాగా బీట్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు బీట్ చేసుకోవాలి. మనకు ఎంత వాటర్ కావాలో అంత పోసుకోవాలి. చిక్కగా కావాలనుకుంటే తక్కువ వాటర్ కూడా పోసుకోవచ్చు. దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి.
Salla Charu Recipe in Telugu : మజ్జిగ చారు (రసం) ఎలా తయారు చేయాలి..
మామూలుగా ఈ చల్ల చారుని మేమైతే కొంచెం పిండి కలిపి మరిగించాలి. ఒక్కొక్కసారి మనకు కావాల్సినట్టుగా చేసుకోవచ్చు. బజ్జీలు వేసి చల్లచారు చేస్తాము. ములక్కాడలతో చల్లచారు చేసుకోవచ్చు. దోసకాయతో చాలాసార్లు చేశాం. రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మాత్రం సింపుల్‌గా చేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుని పైనుండి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఇందులో వేసుకోవచ్చు. మనం పోపులో కూడా వేసుకోవచ్చు.
కొంచెం ఇలా వేసుకుంటే బాగుంటుంది అని వేస్తున్నాను టేస్ట్ సరి చూసుకోండి. కావాలనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు వేసుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకోవాలి. ముక్కలు చేసుకొని వేసుకోవాలి. వన్ టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి.

చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. పొడవు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కాకపోతే, ఎక్కువ సేపు వేయించాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయలు వేగకుంటేనే ఈ మధ్యలో చారులో బాగుంటాయి. ఒక్క నిమిషం తర్వాత టమాటాలు వేసుకోవాలి. సన్నగా తరిగిన టమాటలు వేసుకోవాలి. సన్నగా తరిగిన టమాటలతో టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని పైనుంచి కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి.
ఎంత సింపుల్‌గా ఉందో అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. రైస్‌లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వేరే కూరలేమి అవసరం లేదనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఒక్కొక్కసారి నైట్ టైం కూరగాయలు ఏమి లేకుంటే.. ఇలా సింపుల్ గా చేసేసుకుని తినవచ్చు. కొంచెం పిండి కలిపి మరిగించుకొని చేసుకోవచ్చు. మునక్కాడలతో లేదా దోసకాయలతో చేసుకోవచ్చు. ఇందులో పునుగులు వేసుకొని లాగించేయొచ్చు. బజ్జీలు వేసుకొని కూడా తినవచ్చు. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఇలా ఒకసారి చల్ల చారు తయారు చేసుకోండి.