Sorakaya Soup : శరీరంలో వేడి తొందరగా తగ్గాలంటే అద్భుతమైన సూప్ గురించి తెలుసుకుందాం.. అదే.. సొరకాయ సూప్ (Sorakaya Soup). ఈ సొరకాయ సూప్ వేడిని తగ్గించడమే కాదు.. తొందరగా వెయిట్ లాస్ అవుతారు కూడా. ఈ సూప్ ఒంటికి చాలా చలువ చేస్తుంది. మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా.. చాలా హెల్తీ సూప్.. ప్రతిరోజు ఒక కప్పు బ్రేక్ ఫాస్ట్ బదులుగా ఈ సూప్ తీసుకుంటే చాలు.. తొందరగా వెయిట్ లాస్ అవ్వడం ఖాయం. ఇంతకీ, సొరకాయతో మీరు ఎప్పుడైనా సూప్ ట్రై చేశారా? సొరకాయ హెల్ది సూప్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఒక సొరకాయ తీసుకోండి. సొరకాయ మొత్తం అయినా పర్వాలేదు.. లేదంటే సగమైనా తీసుకోండి. ఈ సొరకాయని ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి. ముక్కలా కట్ చేసుకున్న సొరకాయని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 5 నుంచి 6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. సూప్ కదా కావాలి.. అందుకే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు వేసుకోవాలి. ఇది మాత్రం ఆప్షనల్ అని మర్చిపోవద్దు. ఇలా చేస్తే సూప్ చాలా చిక్కగా వస్తుంది. సమ్మర్‌లో పెసరపప్పు తింటే చలవ చేస్తుంది. ఈ పెసరపప్పును 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. మూత పెట్టుకొని మూడు పొంగులు వచ్చేవరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పెసరపప్పు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
Sorakaya Soup : సొరకాయ సూప్ రోజూ తాగారంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
కావాలనుకుంటే మొత్తం అంతా తీసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సొరకాయ సూప్ మరి మొత్తగా ఉండకూడదు. మన పంటికి తగులుతూనే బావుంటుంది. మీరు మిక్సీ జార్‌లో వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. గ్రైండ్ చేసిన పేస్ట్‌ని కూడా అందులో వేసుకోవాలి. సూప్ చాలా చిక్కగా కావాలి అంటే.. ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోండి. మీకు సొరకాయ ముక్కలు ముక్కలు తగిలేలా చేసుకోవచ్చు. ఇప్పుడు సూప్ కోసం కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇది చాలా హెల్తీ సూప్.. వెయిట్ లాస్‌కు బాగా పనిచేస్తుంది. మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. ఎండాకాలంలో ఈ సూప్ ఒంటికి చలువ చేస్తుంది.
సొరకాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పెసరపప్పు వేయడంతో టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు సూప్ 2 నిమిషాలు మరుగుతే సరిపోతుంది. సాల్ట్ కానీ పెప్పర్ పౌడర్ గాని వేసుకోవచ్చు. కొంచెం పైనుంచి కొత్తిమీర వేసుకోవచ్చు. ఇంకా బాగా టేస్ట్ రావాలి అంటే.. కొంచెం పోపు వేసుకోవచ్చు. లేదంటే ఇలాగే తాగేయొచ్చు. ఎలాంటి సమస్య ఉండదు. కానీ, కొంచెం పోపు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే నెయ్యి వేసుకోవచ్చు లేదా బట్టర్ వేసుకోవచ్చు. చివరిగా హాఫ్ టీ స్పూన్ సాజీర వేసుకోవాలి. ఇప్పుడు అన్ని కలిపి మిక్స్ చేసుకోవాలి.
వన్ టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ ఆప్షనల్. మీ టేస్ట్ బట్టి అన్ని వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపుని మరుగుతున్న సూప్‌లో వేసుకోవాలి. అంతే.. టేస్ట్ టేస్టీగా హెల్దీ ఫుడ్ సూప్ రెడీ.. ఇందులో కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఈ ఎండాకాలంలో సొరకాయ సూప్ ఒంటికి బాగా చలువ చేస్తుంది. మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. వెయిట్ లాస్‌కి బాగా పనిచేస్తుంది. బ్రేక్ ఫాస్ట్ బదులు ఈ సూప్ తాగారంటే చాలు.. రోజు తాగితే వెయిట్ లాస్ అవ్వడం గ్యారంటీ.. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ కూడా ఈ సొరకాయ సూప్ వెంటనే ట్రై చేయండి..