Rava Milk Mysore Pak Recipe : నోరూరించే రవ్వ మిల్క్ మైసూర్ పాక్ ఎలా చేయాలో తెలుసా? నోట్లో వెన్నెల కరిగిపోయే ఈ కమ్మని స్వీట్ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్‌లో అరకప్పు నెయ్యిని తీసుకోండి. ఇలా నెయ్యి బాగా వేడి అయ్యాక ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రవ్వను బాగా వేపాలి. ఈ రవ్వ వేపడానికి కనీసం 10 నిమిషాల పైనే పడుతుంది. రవ్వ మాడిపోకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా తిప్పండి. రవ్వ బాగా ఫ్రై అవుతున్నప్పుడు జీడిపప్పు వాసన వస్తుంది. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఈ వేడి వేడి రవ్వలో మిల్క్ పౌడర్ వేసినప్పుడు ముద్దలు కడుతుంది. ముద్దలు కట్టకుండా కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలపండి.
మిల్క్ పౌడర్ ముద్దలు కట్టకుండా బాగా కలిపి ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకోవాలి. మీ దగ్గర బట్టర్ పేపర్ లేకపోతే ఏదైనా అల్యూమినియం పాయింట్ తీసుకోవచ్చు. మైసూర్ పాక్ తీసుకోవడానికి మోడ్ ని సెట్ చేశాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదే పాన్లోకి ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో ఒక ముప్పావు కప్పు చక్కెరను తీసుకోవాలి. ఈ క్వాంటిటీకి ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా కావాలంటే కప్పు వరకే తీసుకోవచ్చు. అరకప్పు నీళ్లను తీసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.

చక్కెర బాగా కరిగిపోయాక మూడు నిమిషాలు పాకాన్ని మరిగించాలి. పాకానికి కొంచెం తక్కువగా ఎక్కువ స్టిక్కీగా రావాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి ఫ్రై చేసి పెట్టిన రవ్వ మిల్క్ మిక్స్ కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేసేస్తే ముద్దలు కడుతుంది.
Rava Milk Mysore Pak Recipe : రవ్వతో మిల్క్ మైసూర్ పాక్.. తయారీ ఇలా..
కొంచెం కొంచెంగా పాకంలో యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. బాగా కలిపాక ఇప్పుడు ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని, ఒక పావు టీ స్పూన్ వంట సోడాను వేసుకోవాలి. ఈ మైసూర్ పాక్ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. కొంచెం పాన్ నుంచి సపరేట్ అయ్యేంతవరకు కలుపుతూ మాడిపోకుండా చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం రవ్వ మిక్స్ తీసుకొని ఉండలా చేస్తే సాఫ్ట్ ఉండలా రావాలి. గట్టిగా చేస్తే మైసూర్ పాక్ అనేది గట్టిగా వస్తుంది.
టూ సాఫ్ట్ గా తీసుకుంటే సాఫ్ట్‌గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్తీ లోకి తీసుకోవాలి. కొంచెం గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సిల్వర్ పేపర్ ని అతికించవచ్చు. పూర్తిగా చల్లారే అంతవరకు ఒక గంట రెండు గంటలు అలా పక్కన పెట్టండి. ఎప్పుడైతే ఇది పూర్తిగా చల్లారిపోతుందో అప్పుడు సైడ్ నుంచి కొంచెం చాకుతో కట్ చేసుకోవాలి. అంతే.. మైసూర్ పాక్ రెడీ అయినట్టే.